translateexpand_more

Tollywood Director News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 01:16 pm
చిరంజీవికి అదిరిపోయే కథ చెప్పా.. విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే

సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తాను కూడా అలాంటి కథలను రూపొందించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే, తన తెలుగు చిత్రం ఆహ్వానం కథను డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో హాలీవుడ్ లో సినిమా చేశా అని వెల్లడించారు. ఆహ్వానంలోని వివాహ నేపథ్యాన్ని మార్చి, పుట్టబోయే బిడ్డ హక్కులు, తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత ఆవశ్యకత అనే కొత్త కోణంలో కథను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ ప్రయోగానికి తనకు మూడు సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం, డైరెక్టర్స్ అసోసియేషన్‌లో తన సభ్యత్వ అనుభవాలను పంచుకున్నారు. ఐదుగురు పర్మనెంట్ ఆర్టిస్టులు సిఫార్సు చేస్తే తప్ప సభ్యత్వం లభించదని, అయితే అప్పటికే 30కి పైగా చిత్రాలు తీసిన తన సామర్థ్యాన్ని గుర్తించి, తోటి సభ్యులు తన అప్లికేషన్‌ను ఆమోదింపజేసినట్లు తెలిపారు. సినీ నిర్మాణ ప్రక్రియలో అసోసియేషన్ పాటించే కఠినమైన నిబంధనలను ఆయన వివరించారు. షూటింగ్ జరిగే ప్రదేశం, ఐదు విభాగాల పనితీరు, ఏ డిపార్ట్‌మెంట్ పనిని మరొకరు చేయకూడదనే నియమాలు, అలాగే దర్శకుడు, నటులు, కెమెరామెన్ మధ్య సమన్వయం వంటి విషయాలను ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్ట్ ఎందుకు కార్యరూపం దాల్చలేదో కూడా ఎస్.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. చిరంజీవి గారిపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, తమ ఇద్దరి ఆలోచనలలో తేడాలున్నాయని, తాను ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని ఆయన తెలిపారు. చిరంజీవి గారికి తాను చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని, అది అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌తో కూడినదని అన్నారు కృష్ణారెడ్డి. ఆ కథలో, చిరంజీవి కుటుంబంతో కలిసి టీవీలో