translateexpand_more

Tollywood News 2026 News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu02 Jun, 12:29 pm
స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టిన బుచ్చిబాబు

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్‌కు తెలుగు భాషపై ఉన్న శ్రద్ధను, ఆమె సింప్లిసిటీని కొనియాడుతూ బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా అసిస్టెంట్ డైరెక్టర్లను పట్టుకుని తెలుగు నేర్చుకుంది.. జాన్వీ కపూర్ ఎంత స్మార్ట్ అండ్ టాలెంటెడో చెప్తూ బుచ్చిబాబు ప్రశంసలు కురిపించారు. "జాన్వీ కపూర్ చాలా తెలివైనది. నిన్న జరిగిన ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడడం కోసం ఆమె మా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర తెలుగు నేర్చుకుంది. లొకేషన్‌లోనే కాకుండా ప్రమోషన్లలోనూ ఆమె చూపిస్తున్న ఈ డెడికేషన్ నిజంగా గ్రేట్" అని బుచ్చిబాబు కొనియాడారు. అంతేకాదు ఈరోజు ప్రెస్ మీట్ ఉందనగానే జాన్వీ కపూర్ ఎంతో సరదాగా స్పందిస్తూ.. "ఈరోజు మళ్లీ ప్రెస్ మీట్ ఉందా.. నిన్నటితో నాకున్న తెలుగు అంతా అయిపోయింది" అని తనతో అన్నట్లు బుచ్చిబాబు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి కూతురిని అనే పొగరు ఇసుమంత కూడా లేదు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, జాన్వీ కపూర్ లొకేషన్‌లో ఎంత ఒదిగి ఉంటుందో బుచ్చిబాబు వెల్లడించారు. "స్టార్ కిడ్ అనే అహంకారం, శ్రీదేవి గారి కూతురిని అనే పొగరు ఆమెలో ఇసుమంత కూడా కనిపించదు. అందరితో ఎంతో మర్యాదగా, వినయంగా ఉంటుంది" అని జాన్వీ రియల్ క్యారెక్టర్‌‌ను బుచ్చిబాబు రివీల్ చేశారు. గతంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జాన్వీ కపూర్, ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ పక్కా లోకల్ క్యారెక్టర్‌తో అలరించబోతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

NTV Telugu02 Jun, 12:02 pm
మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని, కనీసం నిద్రను కూడా పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తన బిజీ షెడ్యూల్ చెప్పి షాక్ ఇచ్చారు. మ్యారేజ్ డే రోజు కూడా .. సినిమా ప్రమోషన్స్ కోసం బుచ్చిబాబు ఎంతలా కష్టపడుతున్నారో ఆయన మాటల్లోనే స్పష్టమైంది. "ఈరోజు నా వెడ్డింగ్ యానివర్సరీ (పెళ్లి రోజు).. కానీ కనీసం ఆ విషయం కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నాను. గత మూడు రోజుల నుంచి అసలు తారీఖులను కూడా చూడడం లేదు. నిద్ర కూడా లేకుండా కేవలం 'పెద్ది' ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే మునిగిపోయాను" అని బుచ్చిబాబు వెల్లడించారు. ఒక దర్శకుడికి తన సినిమాపై ఉన్న ప్యాషన్, డెడికేషన్‌కు ఈ సంఘటనే ఒక నిదర్శనమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మీరు హిట్ అంటేనే నాకు హ్యాపీ.. తన కష్టమంతా ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్ పైనే ఆధారపడి ఉందంటూ బుచ్చిబాబు భావోద్వేగానికి గురయ్యారు. "నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని రోజులు నిద్ర లేదు అనేది ముఖ్యం కాదు. జూన్ 4న థియేటర్లలో మీరు సినిమా చూసి 'హిట్' అయిందని చెప్తే చాలు.. అదే నాకు అసలైన హ్యాపీనెస్, నా కష్టానికి దక్కే నిజమైన ప్రతిఫలం" అని అన్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు పవర్‌ఫుల్ రోల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. మరి తన పెళ్లి రోజును సైతం పక్కనపెట్టి బుచ్చిబాబు పడిన కష్టానికి, రామ్ చరణ్ చూపించిన డెడికేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబోతుందో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.