translateexpand_more

Tvk Vs Dmk News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 12:32 pm
నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని

చెన్నై, జూన్ 01: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానని, కేవలం ప్రజా సేవకుడిని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తనను ఒక ముఖ్యమంత్రిలా కాకుండా సొంత సోదరుడిలా గుండెల్లో పెట్టుకుని ఆదరించారని భావోద్వేగానికి లోనయ్యారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఇదే సమయంలో తన ప్రభుత్వంపై వస్తున్న రాజకీయ విమర్శలపై సీఎం విజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇచ్చి, ఆ తర్వాత విమర్శలు చేస్తామని చెప్పిన విపక్షాలు.. కనీసం ఆరు రోజులు కూడా ఓపిక పట్టలేకపోయాయని మండిపడ్డారు. పదవిలోకి వచ్చిన ఆరో రోజు నుంచే తమపై బురదజల్లడం ప్రారంభించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక చివరకు తన డ్రెస్సింగ్ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారని, తాను బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో ఉంటే తప్పేంటని విపక్షాలను నిలదీశారు. తనను ఎంజీఆర్ (MGR) లాంటి మహోన్నత నాయకుడితో పోల్చవద్దని విజయ్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులోనూ తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK), ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) మధ్యే అసలైన పోటీ ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు పూర్తి మెజారిటీ అందించి.. స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని అందించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..
<p style="text-align: