translateexpand_more

Vaartha News

Latest updates from Telugu Digital news sources.

Vaartha02 Jun, 11:41 am
స్విమ్మింగ్ చేస్తున్నారా? చర్మం పాడవకుండా ఉండాలా

Swimming : స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని శుభ్రం చేయడానికి వాడే క్లోరిన్ వల్ల చర్మం పొడిబారడం, నల్లబడటం, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. దీని నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ఈత కొట్టడానికి ముందు, తర్వాత సరైన స్కిన్ కేర్ రూటీన్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచి వ్యాయామం అయినప్పటికీ, ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రం కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. స్విమ్మింగ్ పూల్స్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి క్లోరిన్ వంటి రసాయనాలను వాడుతుంటారు. ఈ క్లోరిన్ నీరు చర్మంపై పడటం వల్ల చర్మం పొడిబారడం ట్యాన్ అవ్వడం (నల్లబడటం), దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి స్విమ్మింగ్ చేస్తూనే చర్మాన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో, అందుకు సంబంధించిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కిన్ కేర్ రూటీన్ గురించి తెలుసుకుందాం. Read Also : Peanuts : అమితంగా పల్లీలు తింటే ప్రమాదమా? పూల్‌లోకి దిగడానికి ముందు సాధారణ నీటితో ఒకసారి స్నానం చేయాలి. దీనివల్ల చర్మకణాలు ముందే నీటిని గ్రహిస్తాయి, ఫలితంగా పూల్‌లోని క్లోరిన్ నీరు చర్మంలోకి ఎక్కువగా ఇంకకుండా ఉంటుంది. ఓపెన్ పూల్స్‌లో స్విమ్ చేసేటప్పుడు సూర్యరశ్మి, క్లోరిన్ కలయిక వల్ల చర్మం త్వరగా నల్లబడుతుంది. అందుకే ఈతకు వెళ్లే 20 నిమిషాల ముందే ముఖం , చేతులు, కాళ్లకు కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ను రాయాలి. చర్మంపై రక్షణ పొరను ఏర్పరచడానికి స్విమ్మింగ్‌కు ముందు బాడీ లోషన్ లేదా కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల క్లోరిన్ ప్రభావం చర్మంపై నేరుగా పడదు. స్విమ్మింగ్ పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. చర్మంపై పేరుకుపోయిన క్లోరిన్ రసాయనాలను తొలగించడానికి మైల్డ్ బాడీ వాష్ లేదా యాంటీ-క్లోరిన్ సోప్‌ను ఉపయోగించవచ్చు. క్లోరిన్ నీటి వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోయి చర్మం పొడిగా మారుతుంది. అందుకే స్నానం చేసిన వెంటనే చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్‌ను రాసుకోవాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా ఉండటానికి స్విమ్మింగ్ తర్వాత తగినంత నీరు లేదా కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. స్విమ్మింగ్ వల్ల కలిగే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూనే.. పైన పేర్కొన్న చిన్న చిన్న చర్మ సంరక్షణ నియమాలను పాటించడం ద్వారా మీ చర్మాన్ని నల్లబడకుండా, పొడిబారకుండా కాపాడుకోవచ్చు. Food Adulteration: ఆహార భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ Tamil Nadu BJP Leader: బీజేపీకి అన్నామలై రాజీనామా.. కొత్త పార్టీ వైపు అడుగులు? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Peanuts : అమితంగా పల్లీలు తింటే ప్రమాదమా? Sleeplessness : నిద్రలేమి వేధిస్తోందా? మీ అలసటకు చెక్ పెట్టే సూపర్ టిప్స్! Vitamin D: విటమిన్ డి లోపిస్తే వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు Fiber in Food: రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే! Afternoon Nap: మధ్యాహ్నం నిద్ర మెదడుకు మంచిదేనా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! Sadhguru Jaggi Vasudev: రోజూ గుడ్లు తినొద్దు..ప్రొటీన్ కోసం ఇవి తినండి:సద్గురు తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... ఐపీఎల్ (IPL) సీజన్ ముగింపు వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక ఊహించని... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... తెలంగాణలోని అంగన్‌వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటి నుంచో... లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని...

Vaartha02 Jun, 11:35 am
ఆహార భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్

Food Adulteration: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో హోటళ్లు, బయటి ఆహార పదార్థాలపై ఆధారపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను, ఆరోగ్యానికి హాని కలిగించే రంగులను వాడుతూ కల్తీ దందా సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన తనిఖీల్లో వెల్లడైన కల్తీ ఉదంతాలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ఆహార భద్రత మరియు ప్రమాణాల శాఖ (IPM) సహా పలు కీలక విభాగాలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. Read Also: Collector Himanshu Shukla: గిరిజనులకు మౌలిక వసతులు తక్షణమే కల్పించాలి ఆహార కల్తీని సమర్థంగా అరికట్టడానికి కేవలం ఫుడ్ సేఫ్టీ విభాగమే కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, తూనికలు-కొలతలు, ఉద్యానవన, పశువైద్య శాఖల అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగనున్నారు. త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉన్న పాలు, పండ్లు, మాంసం, కూరగాయలు, తాగునీరు వంటి విభాగాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి ఆరు నెలలకోసారి జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆహార తయారీ పరిశ్రమలలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు సరికొత్త పద్ధతులను అమలు చేయనున్నారు. Hayagreeva Movie: క్రైమ్ థ్రిల్లర్ ‘హయగ్రీవ’ మూవీ రివ్యూ! Swimming: స్విమ్మింగ్ చేస్తున్నారా? చర్మం పాడవకుండా ఉండాలా.. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Pawan Kalyan: ఆంధ్రాలోనే దిక్కులేదు.. తెలంగాణలో సీఎం ఎలా అవుతా?..పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు Raghurama Krishna Raju: తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ సీఐడీ చీఫ్‌పై రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం Pawan Kalyan: గద్దర్‌పై పవన్ కల్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు Ramprasad Reddy: వైసీపీ ప్రభుత్వం అమరావతిని అల్లకల్లోలం చేసింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి Pawan Kalyan: తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?.. రావొద్దనడానికి అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేం పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్ తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... ఐపీఎల్ (IPL) సీజన్ ముగింపు వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక ఊహించని... తెలంగాణలోని అంగన్‌వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటి నుంచో... లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల తీవ్రతపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని...

Vaartha02 Jun, 11:16 am
మళ్లీ గెలుపుపై ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కేవలం ఒకే ఒక్కసారి గెలిచిన ‘వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా’ మిగిలిపోకూడదని, నిరంతరం ప్రజల్లో ఉంటూ మళ్లీ మళ్లీ విజయాలు సాధించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను గుర్తుచేస్తూ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (గొడ్డలి పార్టీ) విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. లేకుంటే ఆ పార్టీ విషం చిమ్ముతూనే ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం, కుప్పం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలుస్తూనే ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అటువంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశానని, కానీ ఇలాంటి నీచులతో ఎప్పుడూ పోరాడలేదని వ్యాఖ్యానించారు. Read Also: Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించామని చంద్రబాబు (Chandrababu) గుర్తుచేశారు. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి కొందరు 241 కేసులు వేసినప్పటికీ, వాటన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా నియామకాలు పూర్తి చేశామన్నారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మన ప్రజాప్రతినిధులు గట్టిగా కౌంటర్లు ఇవ్వడం వల్లే వారు ఇప్పుడు తోకముడిచారని అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియపై ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ తరగతులకు కొందరు నేతలు హాజరుకాకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2002 తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఓటర్ల జాబితా సవరణ ఇదని, ఇందులో కూటమి ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్చేందుకు ప్రతిపక్షం కుట్రలు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. జూలై 14 లోపు ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని, ఎంపీలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ ప్రాధాన్యతను, సైకిల్ గుర్తు ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సరికొత్త పంథాను చంద్రబాబు ప్రకటించారు. CM Yogi : స్నేహం ముసుగులో దాడులా? సహించేది లేదు:: సీఎం ఆదిత్య‌నాథ్‌ Hayagreeva Movie: క్రైమ్ థ్రిల్లర్ ‘హయగ్రీవ’ మూవీ రివ్యూ! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Pawan Kalyan: గద్దర్‌పై పవన్ కల్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు Ramprasad Reddy: వైసీపీ ప్రభుత్వం అమరావతిని అల్లకల్లోలం చేసింది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి Pawan Kalyan: తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?.. రావొద్దనడానికి అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేం పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్ Food Adulteration: ఆహార భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ Collector Himanshu Shukla: గిరిజనులకు మౌలిక వసతులు తక్షణమే కల్పించాలి రానున్న ఐదేళ్లలో భూమిపై భరించలేని వేడి పెరగనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.... తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమిత వేగమే ఇద్దరి ప్రాణాలను... పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్... పరిశ్రమలు పంచాయతీలకు పన్ను చెల్లించకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పన్నులు... భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. నేపాల్ ప్రధాని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు... తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (జూన్ 2, 2026) రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా... ఐపీఎల్ (IPL) సీజన్ ముగింపు వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక ఊహించని... సంఘర్షణలతో ప్రభావితమైన దక్షిణ సూడాన్ దేశంలో పౌరులను రక్షించడంలో మరియు శాంతి స్థాపన ప్రయత్నాలకు మద్దతు... దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ కార్డుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సార్థక్ పీడీఎస్ పథకం...

Vaartha News Keyword | Telugu Digital