పశ్చిమబెంగాల్‌లో పదిహేనేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ఎన్నో అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి తృణమూల్ నేతలు, కార్యకర్తలు 'కట్ మనీ' పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారం కోల్పోయింది. దీంతో తృణమూల్ అగ్ర నేతలపై కూడా ప్రజలు దాడులు చేస్తున్నారు (TMC cut money).

ఈ దాడుల భయంతో కొందరు తృణమూల్ నేతలు ప్రజాగ్రహాన్ని చల్లబరిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాము వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చెయ్యాలని నిర్ణయించుకున్నారు. బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోని మాతాభంగాలోని తృణమూల్ నేతలు గతంలో తాము వసూలు చేసిన డబ్బును ప్రజలకు తిరిగి ఇచ్చేశారు. గ్రామస్తులను ఒక మైదానంలో సమావేశానికి పిలిచి, అక్కడ డబ్బులను పంపిణీ చేశారు (TMC leaders village protest).

కూచ్ బెహార్ జిల్లాలోని ఓ తృణమూల్ నేత గ్రామస్తుల నుంచి రూ.80 లక్షలు వసూలు చేశాడని (Cut money controversy), తాజగా అందులో సగం డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశాడని స్థానిక బీజేపీ నేత తెలిపారు. చాలా గ్రామాల్లో ఇలా 'కట్ మనీ'ని వెనక్కి ఇచ్చేశారట. ప్రజాగ్రహానికి భయపడి తృణమూల్ నేతలు బయటకు రాలేని చోట్ల.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు డబ్బును పంపిణీ చేశారట. ఈ పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..