translateexpand_more

Yadadri News News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana01 Jun, 01:24 pm
ప్రోటోకాల్ వివాదం.. బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత

– సర్పంచ్‌ భర్త, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పై దాడి చేశారంటూ ఫిర్యాదు – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారంటూ ఆరోపణలు – అధికార పార్టీకి పోలీసులు అంటకాగడంపై తీవ్ర విమర్శలు బీబీనగర్‌, జూన్ 01 : బీబీనగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్‌ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్‌ కొలను వాణి, బీఆర్‌ఎస్ నాయకుల కథనం ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్‌ ప్రకారం సర్పంచ్‌తో రిబ్బన్‌ కటింగ్‌ నిర్వహించాలని గ్రామ కార్యదర్శి సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి సర్పంచ్‌ చేతిలో ఉన్న కత్తెరను తీసుకుని స్వయంగా రిబ్బన్‌ కట్‌ చేశారని ఆరోపించారు. దీనిని సర్పంచ్‌, వార్డు సభ్యులు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీయగా, సర్పంచ్‌ భర్త కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సురకంటి సుధాకర్‌ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. అనంతరం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ కూడా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని, సీఐ, ఎస్ఐ సమక్షంలో తమను కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులకు సర్పంచ్‌ , వార్డు సభ్యులు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు మార్గమధ్యలో అడ్డగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. అనంతరం స్టేషన్‌లో తమతో

Namasthe Telangana01 Jun, 12:41 pm
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 240 గజాల స్థలం దానం

– మహిళా సంఘ భవనం, గ్రంథాలయ నిర్మాణానికి పడమటి సోమారం గ్రామ పంచాయతికి అప్పగింత బీబీనగర్‌, జూన్ 01 : బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన స్వర్గీయ మీసాల భిక్షపతి-మణెమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గ్రామాభివృద్ధికి చేయూతనందించారు. గ్రామంలో తాము జన్మించిన తమ సొంత ఇంటి స్థలం సుమారు 240 గజాల భూమిని గ్రామ పంచాయతికి ఉచితంగా అందజేశారు. మీసాల శ్రీనివాస్, ప్రేమ్‌, వెంకటేష్‌ ఈ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేందుకు అంగీకరించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. గ్రామ పంచాయతి తీర్మానం మేరకు ఆ స్థలంలో మహిళా సంఘ భవనం, గ్రంథాలయ భవనం నిర్మించేందుకు గ్రామ పంచాయతీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించగా, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ సహకరిస్తుందని మీసాల కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజా అవసరాల కోసం కుటుంబ ఆస్తిని విరాళంగా అందించడం అభినందనీయమని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ‌స్తులు వారిని సన్మానించారు. గ్రామంపై కుటుంబానికి ఉన్న మమకారం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బద్దం అంజయ్య, ఉప సర్పంచ్‌ తంతరపెళ్లి ప్రదీప్‌ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి వేణు గౌడ్‌, వార్డు సభ్యులు ఆల్వా లింగారెడ్డి, ఆల్వా పుష్పమ్మ బాల్‌ రెడ్డి, దేశం శ్రీనివాస్ గౌడ్‌, దాసరి నాగలక్ష్మి కృష్ణ, నూనె అమృత రాములు, ఆముదాల సదానందం, ఎండి రేష్మ ఉస్మాన్‌ తో పాటు గ్రామ మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.

Namasthe Telangana29 May, 08:22 am
రైతుల పాలిట శాపంగా మారిన రేవంత్ ప్రభుత్వం

– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాడుగుల ప్రభాకర్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, మే 29 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భూదాన్ పోచంపల్లిలో పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధాన్యం పోసి నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతులు, ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. మళ్లీ 50 ఏండ్ల దాకా కాంగ్రెస్ పార్టీని 100 కిలోమీటర్ల లోతులో పాతి పెడతారని విమర్శించారు. ప్రజా పాలన అంటే ధాన్యo కొనకుండా రైతులను గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు. ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు కల్లాల వద్ద పడి కాపులు కాస్తున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిచే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడం, ధాన్యం లారీలు లోడింగ్ అన్‌లోడింగ్‌ ప్రక్రియ జాప్యం జరుగుతుందన్నారు. అధికారులు నాయకులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పర్యటించి రైతుల కష్టసుఖాలను తెలుసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్ట కష్టాలు పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదంటూ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు, అధికారులచే ప్రారంభం చేయాలని సూచించారు. ప్రజలను ఓట్లు వేయమని అడిగితే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా గెలవరని, వారి బండారం బయట పడుతుందని ఎద్దేవా చేశారు. రైస్ మిల్లులో మూడు పంటలకు సంబంధించిన ధాన్యం ఉందని,

Namasthe Telangana26 May, 02:11 pm
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్‌ రెడ్డి రాజీనామా

బీబీనగర్‌, మే 26 : బీబీనగర్‌ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్‌ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్‌ కాంగ్రెస్ నాయకులు, మిత్రులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ లక్ష్యంగా చేసిన తన ప్రయాణంలో అందరి సహకారం ఎంతో బలాన్నిచ్చిందన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైందేనని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పం కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ప్రతి సందర్భంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని ఆయ‌న పేర్కొన్నారు.

Namasthe Telangana25 May, 10:58 am
– ప్రజావాణిలో యాదాద్రి కలెక్టర్‌కు రావిప‌హాడ్ స‌ర్పంచ్‌ వినతి బీబీనగర్‌, మే 25 : బీబీన‌గ‌ర్‌ మండలంలోని రావిపహాడ్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన...

– ప్రజావాణిలో యాదాద్రి కలెక్టర్‌కు రావిప‌హాడ్ స‌ర్పంచ్‌ వినతి బీబీనగర్‌, మే 25 : బీబీన‌గ‌ర్‌ మండలంలోని రావిపహాడ్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్...

Andhra Jyothy23 May, 11:33 pm
యాదాద్రిలో వేదపాఠశాలకు భూమిపూజ

- Home » Telangana » Revanth Reddy Lays Foundation for Veda Pathashala at Yadagirigutta with Kanchi Peethadhipathi ABN , Publish Date - May 24 , 2026 | 05:03 AM సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ‘శ్రీ లక్ష్మీనరసింహస్... - శనివారం ఉదయం 9.38 గంటల ముహూర్తానికి.. - కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి, మే23 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ‘శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేదపాఠశాల’ నిర్మాణానికి శ్రీక...

Namasthe Telangana26 May, 01:15 pm
అర్హ‌త‌ను మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు : డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్

భూదాన్ పోచంపల్లి, మే 26 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హ‌త‌ను మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువ‌న‌గిరి డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మెహర్ నగర్‌కు చెందిన సిరిపంగి రాములు నీరసంతో ఉండగా స్థానిక బాలాజీ హాస్పిటల్‌లో వైద్యురాలు రోగిని పరీక్షించి మోతాదుకు మించి మందులు ఇవ్వడంతో వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బాలాజీ హాస్పిటల్ ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని వైద్యురాలికి సూచించారు. ఏం చదివారు, ఎప్పటి నుండి పని చేస్తున్నారు. హాస్పిటల్లో డాక్టర్ ఎవరు, సర్టిఫికెట్లు ఏమున్నాయి. మెడికల్ షాప్ లోని వ్యక్తి ఫార్మసీ చదివిందా అని ప్రశ్నించారు. పూర్తిగా విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయనతో పాటు మండల వైద్యాధికారిణి డాక్టర్ శ్రీవాణి, ఆరోగ్య కార్యకర్త రాపోలు లక్ష్మణ్ బాబు ఉన్నారు.

Namasthe Telangana26 May, 07:40 am
భూదాన్ పోచంపల్లిలో రైతుల ధర్నా

భూదాన్ పోచంపల్లి, మే 26 : ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరిట రైతులను మోసం, మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భూదాన్ పోచంపల్లిలోని నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ర‌హ‌దారిపై వడ్ల బస్తాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద పక్క మండలాలకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారని, పోచంపల్లి మండలానికి సంబంధించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్ద దిగుమతి చేసుకోక రోజుల తరబడి జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యం లారీల లోడింగ్, అన్‌లోడింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారని, వర్షాలు పడే అవకాశం ఉండడంతో ధాన్యం తడిస్తే రైతు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరిట మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, ధాన్యం కొనుగులు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 30 నిమిషాలు ధర్నా కార్యక్రమం చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. మండల తాసీల్దార్ శ్రీనివాసరెడ్డి రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి.మండల అధ్యక్షుడు మీసాల సైదులు, సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, నాయకులు మంచాల మధు, వడ్డేపల్లి యాదగిరి, లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు.