translateexpand_more

Brahmamudi Serial News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 05:21 am
అసలు మేం మీ కన్న కొడుకులమేనా?.. చలపతి, లక్ష్మీలను నిలదీసిన రాజు.. ఇందుని గుడ్డిగా నమ్ముతున్న రేఖ

ఫస్ట్ నైట్ జరిగిందన్నట్టుగా రాజు బిల్డప్ ఇస్తాడు. అదంతా శేషు, భ్రమరాంబ నమ్మేస్తారు. రేఖ కూడా కంగారు పడిపోతుంది. ఇంతలో ఇందు అక్కడకి వస్తుంది. ఇక ఇందుని ఆడుకునేందుకే.. ఏమో ఇందు అని పిలుస్తాడు రాజు. ఏయ్ రాజు ఏంటి.. ఓవర్ చేస్తున్నావ్ అని ఇందు అంటుంది. చూశావా మామయ్య.. భార్యని అలా పిలిస్తే తప్పా.. అని శేషుని ఉసిగొల్పుతాడు రాజు. ఏం తప్పు లేదు.. ఎందుకమ్మా అల్లుడిని అలా అంటావ్.. ప్రేమగా పిలిస్తే తప్పా అని శేషు అంటాడు. నాకు వేడి నీళ్లు పెట్టు.. రాత్రంతా నిద్రలేపు.. ఒంటినొప్పులు ఎక్కువగా ఉన్నాయ్ అని రాజు బిల్డప్ ఇస్తాడు. దీంతో శేషు, భ్రమరాంబ సిగ్గు పడిపోతుంటారు. అలా రేఖ ఈ ఇందుని పక్కకి తీసుకు పోతుంది. రాజు ఏమో ఇంకా తన యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంటాడు. మామ.. నాకు ఒళ్లంతా నొప్పులు ఎక్కువగా ఉన్నాయి.. ఆయిల్‌తో మసాజ్ చేస్తావా? అని రాజు అంటాడు. నేను నీ మామయ్యని.. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను అల్లుడు అని శేషు అంటాడు. ఇంకో వైపు ఫస్ట్ నైట్ గురంచి రేఖ అసలు విషయం రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది.ఏం జరగలేదు.. నైట్ ఏం జరగలేదు.. మీరు ఇచ్చిన మత్తుమందు పాలు తాగి పడుకున్నాడంతే అని ఇందు చెబుతుంది. మరి వాడేంటి అలా చెబుతున్నాడు అని రేఖ అడుగుతుంది. వాడు కిడ్నాపర్, లోఫర్ వాడు చెప్పింది మీరు నమ్ముతారా అని అమాయకంగా నటిస్తుంది ఇందు. ముందు వాడ్ని ఈ ఇంటి నుంచి పంపించేయండి.. సీఈవో అవ్వకుండా ఆపండి.. దాని గురించి ఆలోచించండి అని రేఖతో ఇందు అంటుంది. నా ప్లాన్స్ నాకు ఉన్నాయ్.. వాడు సీఈవో అవ్వడు.. నేనే అవుతాను అని రేఖ అంటుంది. మీరు కాదు.. నేను అవుతాను అని ఇందు లోలోపల అనుకుంటుంది.ఇందుని లాక్ చేసిన రాజు.. అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ ఏంటి? అని రాజుని ఇందు నిలదీస్తుంది. ఆ మాత్రం చేయకపోతే విషయం లేదని అనుకుంటారు.. ఇది నా కారెక్టర్‌కి సంబంధించిన అంశం అని రాజు అంటాడు. ఇలా చేస్తే కటింగ్స్ పడతాయ్ అని ఇందు బెదిరిస్తుంది. నేను ఒప్పుకోను.. నో కటింగ్స్.. ఎక్కువ చేస్తే అన్ని విషయాలు అందరికీ చెప్తా.. అప్పుడు మీ తాత, నానమ్మ ఏడుస్తారు.. రేఖ సంబరపడి ఆ మదన్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని రివర్స్‌లో రాజు బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో ఇందు సైలెంట్ అయిపోతుంది.వెంకీకి ధైర్యం చెప్పిన రాజు.. ఇంతలో రాజుకి ఫోన్ వస్తుంది. వెంకీ విషయం తెలిసి కంగారు పడతాడు. వెంటనే రాజు తన ఇంటికి వెళ్తాడు. నువ్వు చావాలని అనుకోవడం ఏంట్రా.. మేం నీకు గుర్తుకు రాలేదా.. నీకు ఏమైనా అయితే మేం ఎలా ఉంటాం రా అని రాజు అంటాడు. నువ్వు ఏమైనా తిట్టావా? అని చలపతిని రాజు అడుగుతాడు. అసలు మీకు మేం కన్న కొడుకులమేనా? అని రాజు అంటాడు. ఏంట్రా ఒక్కసారి అలా అనేశావ్.. మేమేరా నీ కన్నతల్లిదండ్రులం అని చలపతి అంటాడు. నా గురించి కాదు.. వాడి గురించి.. కన్న కొడుక్కి అలా అయితే నీకు కొంచెం కూడా బాధలేదా? అలా తింటున్నావ్ అని చలపతిని నిలదీస్తాడు రాజు.విమర్శించిన చలపతి.. సరే ఇవన్నీ పక్కన పెట్టు.. మరి ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లావ్.. పెద్ద బిజినెస్ మెన్ వి అయ్యావు.. ఎంత సంపాదించావ్ అని రాజుని నిలదీస్తాడు చలపతి. సారు.. బిజినెస్ చేస్తాడు.. కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు.. అని చలపతి అవమానిస్తాడు. జాబ్ పోయింది.. వడ్డీలు, ఈఎంఐలు, అప్పులు ఎలా కట్టాలో తెలీడం లేదు.. అవన్నీ భరించలేక ఈ పని చేశాడు అని చలపతి అంటాడు. మనం మధ్య తరగతి వాళ్లం రా.. మనకు డబ్బు కంటే బంధాలే విలువ రా ఇలా ఎందుకు చేశావ్.. జాబ్ పోతే ఇంకొటి దొరుకుతుంది కదా అని రాజు కూడా మోటివేట్ చేస్తాడు.బాధపడిన తల్లిదండ్రులు.. నీలాంటి అమాయకులు, మంచివాళ్లు చిన్న సమస్య వస్తే ఇలానే చేస్తారు.. ఒకడు మనల్ని గేలి చేసినంత మాత్రానా మన జీవితం ఏమీ తలకిందులు అయిపోదు.. జనమంతా మనల్ని చూసి నవ్వినంత మాత్రానా మన జీవితం నాశనమైపోయినట్టు కాదు.. ఈ వెక్కిరింపులు, చీత్కారాలు ఏడమ చేత్తో తీసి పడేయాలి.. అని రాజు మోటివేట్ చేస్తాడు. వీడ్ని చూసి.. సిగ్గు లేకుండా బతకడం ఎలానో నేర్చుకో అని వెంకీని అడ్డం పెట్టుకుని రాజుని చలపతి తిడతాడు. నేను మీ గురించే కదా బిజినెస్ చేస్తున్నా.. అని రాజు అంటాడు. నువ్వేమో ఇంటి పట్టున ఉండటం లేదు అని లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది.బిజినెస్ మాత్రమే చేస్తా.. నేను చెప్పిన ఫ్యాక్టరీలో సూపర్ వైజర్‌గా చేరు.. నెలకి పాతిక వేలు వస్తాయి. మా కళ్ల ముందే హాయిగా ఉండు రా.. మేం లేకపోయినా

Samayam Telugu27 May, 05:11 am
రాజ్, ఇందుల శోభనం.. పథకం వేసిన భ్రమరాంబ.. కొత్త స్ట్రాటజీతో రేఖ

బోర్డ్ మెంబర్ గా కూడా రిజైన్ చేయాలని అనుకున్నాను.. కానీ సీతారామయ్య గారికి ఇచ్చిన మాటకు కట్టు బడి ఇంకా ఉన్నాను.. నువ్వు నీ అమ్మానాన్నాల ఆశయం కోసం పని చేస్తున్నాను అంటున్నావ్.. నేను నీకు సాయం చేస్తాను అని పరంధామయ్య అంటాడు. కానీ నువ్వు మాత్రం రేఖ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సలహా ఇస్తాడు. చిన్నప్పటి నుంచి రేఖ ఆంటీని చూస్తూ పెరిగాను.. ఆమె గురించి నాకు అంతా తెలుసు.. మీరే నా గురించి కంగారు పడకండి తాతయ్య గారు అని ఇందు అంటుంది. మరో వైపు మదన్‌కి రేఖ ఓ పని అప్పజెబుతుంది. ఇంట్లో ఇలా సైలెంట్‌గా ఉండకుండా.. బయట పార్టీలు అని తిరగకుండా.. ఇంట్లో ఉన్న ఇందుని ప్రేమలో దించు.. అని మదన్‌కి ఓ టాస్క్ ఇస్తుంది రేఖ. నేను ట్రై చేస్తాను మమ్మీ అని మదన్ అంటాడు. ట్రై కాదు.. నువ్వంటే పడి చచ్చేలా చేయాలని రేఖ అంటుంది. ఏంటి వదినా.. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది లే అని భ్రమరాంబకి కౌంటర్ వేస్తుంది రేఖ. అక్కడి నుంచి రేఖ వెళ్లిపోవడంతో ఇందు, రాజ్‌లను ఒక్కటి చేస్తాను అని ఓ పథకం వేస్తుంది భ్రమరాంబ. ఇక శేషు, భ్రమరాంబ తమ పథకం ప్రకారం అపర్ణ ముందు నటించేస్తుంటారు. ఇందు కోసం బాధపడుతున్నాను.. పెళ్లి అయినా ఇందు జీవితంలో ఏం మార్పులు వచ్చాయి.. ఓ ముద్దూ ముచ్చట లేదు.. పెళ్లి తరువాత జరిగే కార్యక్రమం గురించి ఒక్కరూ మాట్లాడుకోవడం లేదు.. కనీసం శోభనం కూడా ఏర్పాటు చేయలేదు అని అపర్ణకు వినపడేలా శేషు, భ్రమరాంబ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీంతో అపర్ణ, సుభాష్‌లకి కూడా ఫస్ట్ నైట్ గురించి

Samayam Telugu28 May, 06:41 am
కాళ్లు పట్టుకునేందుకు సిద్ధపడిన రాజు.. అమ్మ జ్ఞాపకంగా ఉన్న చైన్ ను ఇచ్చిన ఇందు.. అది మాత్రం ఇంకా

అవన్నీ నాకు తెలీదు.. నాకు డబ్బు కచ్చితంగా కావాలి.. ఆ డబ్బు కోసమే నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను.. నా ఇంటిని వదిలేసి నీకోసం ఇక్కడ నటిస్తున్నాను.. నువ్వు చెప్పావ్ అని తాళి కట్టాను.. నువ్వు చెప్పావ్ అద్దె మొగుడిలా నటిస్తున్నా.. నువ్వు చెప్పావ్ అని ఆఫీస్‌కి వచ్చా.. నువ్వు చెప్పావ్ అని సీఈవో అని నాటకం ఆడి రేఖ దగ్గర ఇరుక్కుంటున్నాను.. నాకు డబ్బు చాలా అర్జెంట్.. ఆ డబ్బు కావాల్సిందే.. అవతల నాకు చాలా పని ఉంది.. టైం లేదు ఇవ్వు అని రాజు అంటాడు. నేను నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు.. నీ ఈగో చల్లారకపోతే నన్ను కొట్టు.. కావాలంటే నాది నేనే చెంపలు వాయించుకుంటాను.. ఇంకా నీ ఈగో చల్లారకపోతే కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అని రాజు అంటాడు. నీకు నిజంగానే అవసరం ఉంది అని నమ్ముతున్నా.. కాకపోతే అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు అని ఇందు అంటుంది. దీంతో రాజుకి మరింత కోపం వస్తుంది. దీంతో ఈ నాటకానికి స్వస్తి చెబుతాను అని ఇందుతో రాజు అంటాడు. డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ టైపులో చేస్తాడు రాజు. నువ్వు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నేను నటించడం ఆపేస్తాను.ఇది బ్లాక్ మెయిల్ అనుకుంటావో.. ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం.. నేను ఒక పని కోసం డబ్బులు కావాలని ఇదంతా చేస్తున్నాను.. ఇప్పుడు ఆ పని కోసమే డబ్బులు రాకపోతే ఇదంతా చేసి వేస్ట్.. నీకు మళ్లీ నేను ఎప్పటికీ కనిపించను అని రాజు అంటాడు. దీంతో ఇందుకి ఏం చేయాలో పాలుపోదు. మెడలో తన అమ్మ గుర్తుగా వేసుకున్న గోల్డ్ చెయిన్ ఇస్తుంది. దీన్ని తాకట్టు

Samayam Telugu29 May, 05:58 am
మీరు మారిపోయారు సార్.. రాజుని ఏడ్పించిన లక్కీ.. ఇందుకి సర్ ప్రైజ్ గిఫ్ట్

మరో వైపు లక్కీ తన అమ్మ కోసం, అమ్మ ఎక్కడుంది చెప్పు అని ఆంటోనీ గాడ్ని అడుగుతూ ఉంటాడు. వాడేమో పీకలదాక తాగి, తిని కాకమ్మ కబుర్లు చెబుతుంటాడు. అలా లక్కీ బాధపడుతున్న టైంలోనే రాజు ఫోన్ చేస్తాడు. బైక్ తీసుకుని రా రా అని చెబుతాడు. బైక్ మీద కాకపోతే కారులో వస్తానా? అని లక్కీ కౌంటర్ వేస్తాడు. త్వరగా రా రా అని లక్కీని పిలుస్తాడు రాజు. చూస్తుంటే ఆ బైకుని అమ్మి.. తాకట్టు పెట్టిన చైన్ విడిపించాలని రాజు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకో వైపు ఐశ్వర్యకి అప్పు ఇచ్చిన రాకేష్ ఫోన్ చేస్తాడు. ఇంకెన్ని రోజులు పడుతుంది.. మాటి ఇచ్చిన ఇందు కూడా సైలెంట్‌గానే ఉంది.. ఆమెకు ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అని అంటాడు. ఇక ఇందు మాట్లాడి కన్విన్స్ చేసి ఇంకో రెండు రోజులు గడువు అడుగుతుంది. నీ వల్లే ఇదంతా అని ఇందుని తిరిగి తిడుతుంది ఐశ్వర్య. పిచ్చి పనులు నువ్వు చేసి నన్ను అంటున్నావా? అని ఐశ్వర్యని తిడుతుంది ఇందు. మన పరిస్థితి తెలీకుండా అప్పులు చేశావ్.. జల్సాలకు వాడుకున్నావ్ అని తిడుతుంది ఇందు. నా రూం లాక్కుని నాకు నీతులు చెబుతున్నావా అని కసురుకుని వెళ్తుంది ఐశ్వర్య. నువ్వు ఇంత మంచివాడిలా ఎప్పుడు మారిపోయావ్ రా.. ఇవన్నీ మనకు అలవాటే కదరా అని లక్కీ అంటాడు. అది వాళ్ల అమ్మ గుర్తురా.. తెలీక తాకట్టు పెట్టా.. అని ఫీల్ అవుతున్నా అని లక్కీతో చెప్పుకుని రాజు బాధపడతాడు. ఇది మనకు సెట్ కాదు రా అని లక్కీ అంటాడు. డబ్బు కోసం మనం ఏ పనైనా చేస్తాం కద రా.. నువ్వే ఏ రిస్క్ అయినా