translateexpand_more

Buchibabu Sana News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 10:25 am
ఎన్టీఆర్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తా.. బుచ్చిబాబు కామెంట్స్ వైరల్

Buchibabu Sana : బుచ్చిబాబు సాన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ప్రస్తుతం బుచ్చిబాబు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. గతంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పాడు. ఆ సినిమా ఓకే అయింది చేస్తారు అనుకున్నారు కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఆ తర్వాతే పెద్ది మొదలయింది. అయితే ఎన్టీఆర్ పెద్ది కథని రిజెక్ట్ చేసాడని, ఆ కథనే రామ్ చరణ్ చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. Also Read : Ram Charan : జనసేన కోసం రామ్ చరణ్ త్యాగం.. బాబాయ్ కోసమే అబ్బాయి తప్పుకున్నాడా? బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి నేను చెప్పిన కథ వేరు, పెద్ది కథ వేరు. ఆ రెండూ ఒకటి కాదు. ఎన్టీఆర్ కి చెప్పిన కథతో సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సర్ పిలిస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి సినిమా చేస్తాను. ఎన్టీఆర్ సర్ చేతిలోనే ఉంది. పెద్ది తర్వాత ఇంకా ఏది ఓకే చేయలేదు. ఓ నాలుగు మంచి కథలు అయితే ఉన్నాయి అని తెలిపారు. దీంతో భవిష్యత్తులో బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఆశించొచ్చు అని తెలుస్తుంది.

10TV Telugu01 Jun, 04:50 pm
అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు.. పడినా లేచి నిలబడిన మనిషి కథ.. బుచ్చిబాబు స్పీచ్ వైరల్

Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తెలుగులో మాట్లాడిన జాన్వీ కపూర్.. జాన్వీ స్పీచ్ ఇక్కడ వినేయండి.. ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా తర్వాత ఐదేళ్లు టైం తీసుకున్నా. ఎందుకు అంటే పెద్ది కోసమే. ఉప్పెన స్టోరీ ఇక్కడే విజయవాడలో రాసుకున్నా. నేను తండ్రిని అయ్యాను అని ఇక్కడే విజయవాడలో చెప్పారు. నాకెప్పుడూ విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. పెద్ది కథ ఎవరికి చెప్పాలి అనుకుంటున్నప్పుడు సుకుమార్ గారు చరణ్ సర్ ని కలిపించారు. దత్తాత్రేయస్వామిని దండం పెట్టుకున్నా ఈ సినిమా ఓకే చెయ్యాలని. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా చరణ్ గారు ఓకే చేసారు. ఇది కమర్షియల్ కథ కాదు. ఒక ఎమోషనల్ డ్రామా. ఆటగాడి జర్నీ. ఆట అంటే ఆకతాయితనం కాదు గౌరవం, గుర్తింపు తీసుకొచ్చి చుట్టూ ఉన్న మనుషులను మార్చే కథ పెద్ది. పెద్ది అంటే అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు పడినా లేచి నిలబడిన మనిషి కథ. నిజాయితీ గల హీరో నమ్మి చేస్తే పెద్ది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను ఇప్పటికే 50 సార్లు చూసాను సినిమా. చివరి 40 నిమిషాలకు ఎమోషనల్ అయిపోతారు. పెద్ది అంటే ఆటంకం వస్తే ఆగిపోయే కుర్రాడి కథ కాదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగే కుర్రాడి కథ. ఇది చాలా ఇన్‌స్పిరేషనల్ జర్నీ. నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు లైఫ్ లో ఎప్పటికి రుణపడి ఉంటాను చరణ్ సర్ కి. క్లైమాక్స్ లో జాన్వీ పర్ఫార్మెన్స్ ని కూడా మర్చిపోరు. అప్పలసూరి పర్ఫార్మెన్స్ కి మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నేను బుచ్చిబాబు పేరు మార్చుకుంటాను. చరణ్ సర్ మీరు లేకపోతే బుచ్చిబాబు లేడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి చరణ్ సర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఏడుస్తారు అని అన్నారు. Also Read : Kesineni Chinni : బాబాయ్‌ని మించిన అబ్బాయి.. ఇంద్ర తర్వాత ఇదే.. పెద్ది ఈవెంట్లో విజయవాడ ఎంపీ స్పీచ్ వైరల్..