translateexpand_more

Buchibabu News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu01 Jun, 04:50 pm
అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు.. పడినా లేచి నిలబడిన మనిషి కథ.. బుచ్చిబాబు స్పీచ్ వైరల్

Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తెలుగులో మాట్లాడిన జాన్వీ కపూర్.. జాన్వీ స్పీచ్ ఇక్కడ వినేయండి.. ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా తర్వాత ఐదేళ్లు టైం తీసుకున్నా. ఎందుకు అంటే పెద్ది కోసమే. ఉప్పెన స్టోరీ ఇక్కడే విజయవాడలో రాసుకున్నా. నేను తండ్రిని అయ్యాను అని ఇక్కడే విజయవాడలో చెప్పారు. నాకెప్పుడూ విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. పెద్ది కథ ఎవరికి చెప్పాలి అనుకుంటున్నప్పుడు సుకుమార్ గారు చరణ్ సర్ ని కలిపించారు. దత్తాత్రేయస్వామిని దండం పెట్టుకున్నా ఈ సినిమా ఓకే చెయ్యాలని. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా చరణ్ గారు ఓకే చేసారు. ఇది కమర్షియల్ కథ కాదు. ఒక ఎమోషనల్ డ్రామా. ఆటగాడి జర్నీ. ఆట అంటే ఆకతాయితనం కాదు గౌరవం, గుర్తింపు తీసుకొచ్చి చుట్టూ ఉన్న మనుషులను మార్చే కథ పెద్ది. పెద్ది అంటే అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు పడినా లేచి నిలబడిన మనిషి కథ. నిజాయితీ గల హీరో నమ్మి చేస్తే పెద్ది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను ఇప్పటికే 50 సార్లు చూసాను సినిమా. చివరి 40 నిమిషాలకు ఎమోషనల్ అయిపోతారు. పెద్ది అంటే ఆటంకం వస్తే ఆగిపోయే కుర్రాడి కథ కాదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగే కుర్రాడి కథ. ఇది చాలా ఇన్‌స్పిరేషనల్ జర్నీ. నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు లైఫ్ లో ఎప్పటికి రుణపడి ఉంటాను చరణ్ సర్ కి. క్లైమాక్స్ లో జాన్వీ పర్ఫార్మెన్స్ ని కూడా మర్చిపోరు. అప్పలసూరి పర్ఫార్మెన్స్ కి మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నేను బుచ్చిబాబు పేరు మార్చుకుంటాను. చరణ్ సర్ మీరు లేకపోతే బుచ్చిబాబు లేడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి చరణ్ సర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఏడుస్తారు అని అన్నారు. Also Read : Kesineni Chinni : బాబాయ్‌ని మించిన అబ్బాయి.. ఇంద్ర తర్వాత ఇదే.. పెద్ది ఈవెంట్లో విజయవాడ ఎంపీ స్పీచ్ వైరల్..

Chitrajyothy24 May, 04:10 am
పెద్ది ఓకే.. వాట్ నెక్స్ట్ బుచ్చిబాబు | after peddi movie impact what is buchi babu next step srk

- Home » Tollywood » after peddi movie impact what is buchi babu next step srk ABN , Publish Date - May 24 , 2026 | 09:40 AM డెబ్యూ మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాడు దర్శకుడు బుచ్చిబా... - 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతూనే సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సాన (Buchi Babu Sana). - డెబ్యూ మూవీతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాడు.