NTV Telugu28 May, 04:55 pm
Health Tips : వేసవి సెలవులు అంటే సరదా ప్రయాణాలు, బయట ఫుడ్, చల్లటి పానీయాలు, రాత్రిళ్లు ఆలస్యంగా మెలకువలు. అయితే ఈ చిన్న చిన్న అలవాట్లే సెలవులు ముగిసేసరికి శరీరాన్ని పూర్తిగా అలసటలోకి నెట్టేస్తుంటాయి. ముఖ్యంగా మండే ఎండల్లో ప్రయాణాలు చేసిన తర్వాత చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బయట కనిపించేది కేవలం అలసట మాత్రమే అయినా… లోపల జీర్ణవ్యవస్థ మాత్రం పూర్తిగా ఒత్తిడిలో పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది వెంటనే క్రాష్ డైట్లు, హార్డ్ వర్కౌట్లు మొదలుపెడతారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ మాత్రం శరీరాన్ని ఇబ్బంది పెట్టేకన్నా, సమతౌల్యంలో ఉంచుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. కరీనా కపూర్‌కు సంవత్సరాలుగా న్యూట్రిషన్ గైడ్‌గా ఉన్న రుజుతా దివేకర్ ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని సులభమైన చిట్కాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వేసవి తర్వాత జీర్ణవ్యవస్థను తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఇంట్లోనే చేయగల అలవాట్లను ఆమె సూచించారు. సెలవుల్లో ఎక్కువగా వేయించిన ఆహారం, స్వీట్లు, కోల్డ్ డ్రింక్స్, టీ, కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ శరీరంలో వేడిని పెంచడమే కాకుండా, గట్ హెల్త్‌ను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో మధ్యాహ్న భోజనంలో చిక్కుడుకాయలను చేర్చుకోవాలని రుజుతా సూచిస్తున్నారు. క్లస్టర్ బీన్స్‌గా పిలిచే ఈ కూరగాయలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. తేలికపాటి మసాలాలతో చేసిన చిక్కుడుకూర కడుపుకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా శరీరానికి శక్తిని కూడా అందిస్తుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. అలాగే సెలవుల నుంచి వచ్చేసరికి వెంటనే కఠినమైన