translateexpand_more

Mamata Banerjee News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 06:59 am
ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో

కోల్‌కతా, మే 31: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనార్‌పూర్‌లో స్థానికులు అభిషేక్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను సిబ్బంది కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి నుంచి బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. మేనల్లుడిపై దాడి జరిగిన విషయం తెలియగానే మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆస్పత్రికి వెళ్లారు. అభిషేక్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

తీవ్రంగా గాయపడ్డ అభిషేక్‌కు చికిత్స అందించవద్దంటూ డాక్టర్లపై, ఆస్పత్రి యాజమాన్యంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, హింస, ఆయుధాలు, భయంతో రాజకీయాలకు సమాధానం చెప్పకూడదని హితవు పలికారు. ఆస్పత్రి లోపల బెల్ వ్యూ సీఈఓ ప్రదీప్ టాండన్‌తో మమతా బెనర్జీ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మమతా బెనర్జీ ఆస్పత్రి సీఈఓకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా వాయిస్ ఉంది.

ఆ వీడియోలో.. ‘టాండన్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు చేసిన సాయాన్ని దయచేసి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించడు. మీరు తప్పుదోవపట్టిస్తున్నారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుండాలి. ప్రతీ ఒక్కరు మీ దురుసు ప్రవర్తనను గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. రేపు ఉండదు. అప్పుడు మేము చేయాల్సింది చేస్తాం’ అని మమతా అన్నట్లుగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

<a target="_blank"

Samayam Telugu31 May, 06:18 am
చికిత్సపొందుతున్న అభిషేక్ బెనర్జీ.. ఆస్పత్రి సీఈఓకు దీదీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమైందంటే

Mamata Banerjee Warning Audio Leak : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఉదంతం సరికొత్త రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ దాడి అనంతరం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఓ వార్నింగ్ ఆడియో క్లిప్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆ దవాఖాన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)పైనే దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఫోన్ చేసి మరీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరి ఆమె ఆయనపై ఎందుకు ఫైర్ అయ్యారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. బెల్ వ్యూ ఆసుపత్రి సీఈఓకు దీదీ గట్టి వార్నింగ్..సోనార్‌పూర్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ అభిషేక్ బెనర్జీని చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ప్రసిద్ధ 'బెల్ వ్యూ' ఆసుపత్రికి తరలించారు. అయితే అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. ఆయన్ను తక్షణమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు ఒక సీనియర్ పోలీసు అధికారి కూడా ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మమతా బెనర్జీ నేరుగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌తో మమత మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది.లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం.. మమతా బెనర్జీ సదరు సీఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "టాండన్.. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. గతంలో మీకు మేము చేసిన సహాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ అనాలోచిత చర్యకు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని

Zee Telugu30 May, 05:25 pm
అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడి.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన మమత బెనర్జీ.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rulers became killers Mamata Banerjee fire on west Bengal bjp govt: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సౌత్ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లలో గాయపడ్డ టీఎంసీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు అభిషేక్ వెళ్లారు. దీంతో స్థానికులు కొంత మంది అభిషేక్ ను అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాళ్లు,గుడ్లతో దాడులు చేశారు. అప్పటికే అభిషేక్ బెనర్జీ హెల్మెట్ పెట్టుకొని ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారు. తలకు గాయాలుకాకుండా మాత్రంతప్పించుకున్నారు. అల్లరిమూకలు ఆయన చొక్కాను చింపేసి, పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతికష్టం మీద అభిషేక్ ను పోలీసులు, టీఎంసీ కార్యకర్తలు అక్కడి నుంచి అభిషేక్ బెనర్జీని బైటకు తీసుకొని వచ్చారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ తన మేనల్లుడ్ని చూసేందుకు ఆస్పత్రికి మమతా బెనర్జీ పరుగులు పెట్టారు. మేనల్లుడ్ని ఆస్థితిలో చూసి మమతా ఎమోషనల్ అయ్యారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ మమతా బెనర్జీ.. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై

Indian Express31 May, 09:38 am
You Should Be Ashamed Mamatas Heated Hospital Exchange Hours After Abhishek Banerjee Faces Stone Pelting

Former West Bengal chief minister Mamata Banerjee has alleged that a private hospital was pressured into not admitting TMC MP Abhishek Banerjee after he faced stone-pelting on Saturday in Sonarpur, South 24 Parganas, where he went to meet the family of a party...

Andhra Jyothy30 May, 03:00 pm
పాలకులే హంతకులుగా మారారు.. మేనల్లుడిపై దాడిని ఖండించిన మమత

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.

'అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితుడైన సంజు కర్మాకర్‌ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇచ్చిన మాటకు అభిషేక్ బెనర్జీ కట్టుబట్టారు. సోనార్‌పూర్ వెళ్లారు. బీజేపీ దన్నుతో కొందరు దుండగులు మా జాతీయ ప్రధాన కార్యదర్శిపై అమానుషంగా దాడి చేశారు. అయినప్పటికీ ఆయన బీజేపీ గూండాల దాడిలో నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచారు. కనికరంతో కూడిన రాజకీయాలకూ, విద్వేషంతో కూడిన రాజకీయాలకు ఉన్న తేడా ఇదే. సువేందు హయాంలో చోటుచేసుకుంటున్న బెదిరింపులు, హింస, ప్రతీకార రాజకీయాలు మరోసారి ఇవాళ బహిర్గతమయ్యాయి' అని ఆ ట్వీట్‌లో మమత పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే..?

ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో భాదితులను పరామర్శించేందుకు సోనార్‌పూర్ వెళ్లిన అభిషేక్‌పై స్థానికులు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు ఆయనపై చేయి చేసుకున్నారు. 'దొంగ' అంటూ నినాదాలు చేస్తూ దాడికి దిగారు. ఆ సమయంలో హెల్మెట్ ధరించిన అభిషేక్‌కు భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచారు. కాగా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిపారని, తనను చంపేందుకు ప్రయత్నించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదన్నారు. తనపై జరిగిన దాడిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఘటన అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు.

ఇవి కూడా చదవండి..

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో

TeluguOne31 May, 08:08 am
అభిషేక్ బెనర్జీపై దాడి...సీఈవోకు మమత వార్నింగ్

పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ఉదంతం.. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడినట్లు చెబుతున్న ఒక ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలపాలైన అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం కోల్‌కతాలోని ప్రఖ్యాత బెల్ వ్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, డిశ్చార్జ్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు ఒక సీనియర్ పోలీస్ అధికారి ఆసుపత్రి యాజమాన్యంపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌తో మమతా బెనర్జీ మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. తన మేనల్లుడి ప్రాణాలకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా దానికి పూర్తి బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానిదేనంటూ ఆమె ఆ ఫోన్ సంభాషణలో గట్టిగా హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది. వైద్య సేవల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవడంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన సాయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రస్తుత ప్రవర్తనను దేవుడు కూడా క్షమించడని సదరు సీఈవోకు ఆమె స్పష్టం చేసినట్లు ఆడియో ద్వారా తెలుస్తోంది. బీజేపీ నాయకుల మాటలు విని తప్పుదోవ పట్టవద్దని, ఇప్పుడు వారు అధికారంలో ఉన్నంత మాత్రాన శాశ్వతం కాదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినప్పుడు తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని సంచలన హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా

Samayam Telugu31 May, 01:19 am
మేనల్లుడిపై జరిగిన దాడిపై మమతా బెనర్జీ ఫైర్, ఆస్పత్రికి పరుగులు

Mamata Banerjee on Abhishek Assault : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం నాడు భౌతిక దాడి జరిగింది. దక్షిణ 24 పరగణాల పరిధిలోని సోనార్‌పూర్‌లో పర్యటిస్తున్న సమయంలో.. ఒక గుంపు ఆయనను చుట్టుముట్టి తోసివేస్తూ, దాడికి పాల్పడింది. అయితే దీనిపై స్పందించిన మాజీ సీఎం మమతా బెనర్జీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలకులే హంతకులుగా మారారంటూ సంచలన కామెంట్లు చేశారు. అలాగే మేనల్లుడిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. హెల్మెట్ ధరించినా తప్పని దాడి..!ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత స్థానికంగా హింసను ఎదుర్కొంటున్న తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోనార్‌పూర్ వెళ్లారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించే జనంలోకి వెళ్లారు. అయినప్పటికీ.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఒక గుంపు ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసురుతూ దాడికి తెగబడింది. ఆయనను నెట్టివేస్తూ.. చెంప దెబ్బలు వేశారు. శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పిడి గుద్దులు గుద్దారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది దాడికి పాల్పడుతున్న వారిని అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బీజేపీ స్పాన్సర్డ్ దాడంటూ మమతా బెనర్జీ ఫైర్..ఈ దాడిని మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా.. ‘బీజేపీ స్పాన్సర్డ్’ కుట్రగా అభివర్ణించారు. 15 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఈ నెలలోనే అధికారాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ తీవ్రంగా స్పందిస్తూ.. "పాలకులే హంతకులుగా మారారు. సిగ్గుపడండి

Andhra Jyothy01 Jun, 04:10 pm
ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ

టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు. కోల్‌కతా: టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని అన్నారు. మంగళవారంనాడు తాము చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఢిల్లీ వెళ్లి ఒంటరిగానే తాను నిరసన తెలుపుతానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సోమవారంనాడు వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. 'కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్డులో మంగళవారంనాడు నిరసన చేపట్టేందుకు పోలీసుల అనుమతి కోరాం. అందుకు పోలీసులు నిరాకరించారు. రాజకీయ దురుద్దేశంతోనే అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆందోళన ఆపేది లేదు. అవసరమైతే ఢిల్లీలో నిరసనకు కూర్చుంటాను. రాణి రష్మోని రోడ్డు అంతా క్లియర్‌గా ఉంది. కేవలం 100 మందితో నిరసన చేపట్టాలనుకున్నాం. పోలీసులకు లెటర్ కూడా ఇచ్చాం. అక్కడ అనుమతించకుంటే మరో వేదిక సూచించాలి. అంతేకానీ అనుమతి నిరాకరిస్తామంటే ఢిల్లీలోనే ఒంటరిగా నిరసన సాగిస్తా' అని అన్నారు. దాడులతో టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీని చంపేందుకే ప్రయత్నించారని, రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ఒక పద్దతి ప్రకారం టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటోందని బీజేపీపై మమత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకుండా పోయిందన్నారు. పార్టీ కార్యకర్తలను సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కానీ, ఇళ్ల నుంచి బయటకు రావడానికి కానీ అనుమతించడం లేదని ఆరోపించారు. 'వాళ్లు 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు.