Post Office: ప్రస్తుతం అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నప్పటికీ సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలాంటి నష్ టభయం లేని, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో స్థిరమైన రాబడినిచ్చే పోస్టాఫీసు పొదుపు పథకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ రేట్లను కేంద్రం ఈ పథకాల ద్వారా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన భార్య పేరుపై పోస్టాఫీస్‌లో రూ.1 లక్ష మొత్తాన్ని 24 నెలల (2 సంవత్సరాలు) కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంత వస్తుంది అనే పూర్తి లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) మాదిరిగానే పోస్టాఫీసులలో డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు (Time Deposits) అంటారు. ఈ స్కీమ్స్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చినట్లుగా 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల విభిన్న కాల పరిమితులతో అకౌంట్లు తెరిచే వెసులుబాటు ఉంటుంది. పోస్టాఫీస్ నిబంధనల ప్రకారం ఈ ఖాతాను తెరిచేందుకు కనీస పెట్టుబడి మొత్తం కేవలం రూ. 1000 కాగా గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు.సాధారణంగా కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు పురుషులు, మహిళలు లేదా సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పురుషులు, మహిళలు లేదా వృద్ధులు అనే తేడా లేకుండా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్య పేరు మీద పోస్టాఫీస్ లో రూ. 1 లక్ష నగదును పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం 2 ఏళ్ల కాల పరిమితితో డిపాజిట్
Post Office News
Latest updates from Telugu Digital news sources.

ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏది సురక్షితమైనది? ద్రవ్యోల్బణాన్ని అధిగమించి దీర్ఘకాలంలో మంచి సంపదను ఎలా సృష్టించవచ్చు? మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కావడం వల్ల అత్యంత సురక్షితమైనది. ఇందులో ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, దానిపై నిర్ణీత వడ్డీని ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం ఈ పథకంపై సుమారు 7 శాతం వార్షిక రాబడి లభిస్తోంది. క్రెడిట్ రిస్క్ లేకపోవడం వల్ల, రిటైర్డ్ వ్యక్తులు మరియు తక్కువ రిస్క్ కోరుకునే పెట్టుబడిదారులకు ఇది ఒక వరంలాంటిది. అయితే, దీనిలో ప్రధాన సవాలు ద్రవ్యోల్బణం. ధరలు పెరుగుతున్న కొద్దీ, ఈ స్థిరమైన ఆదాయం యొక్క కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గే అవకాశం ఉంది. అలాగే, వచ్చే వడ్డీ మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఆధారిత పెట్టుబడి సాధనాలు. ఇవి దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి మరియు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. రిస్క్ తీసుకోవడం అలవాటున్న వారికి, ఎక్కువ రాబడిని ఆశించే వారికి ఇవి సరైన ఎంపిక. కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ పన్ను పరంగా కూడా కొంత మేర ప్రయోజనాన్ని కలిగి ఉండవచ్చు. నిధుల అవసరాల కోసం వీటి నుండి డబ్బును ఉపసంహరించుకోవడం పోస్ట్ ఆఫీస్ పథకంతో పోలిస్తే సులభంగా ఉంటుంది. అయితే, మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా రాబడులు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. మీ ప్రధాన లక్ష్యం ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందడమే అయితే, పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ ఉత్తమమైన ఎంపిక. దీని ద్వారా మీకు వచ్చే రాబడిపై పూర్తి భరోసా ఉంటుంది. ఒకవేళ మీ లక్ష్యం కేవలం ఆదాయమే కాకుండా, దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడం మరియు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మీకున్నట్లయితే, మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. మీ ఆర్థిక ప్రణాళికలో వైవిధ్యం ఉండటం ఎప్పుడూ మంచిది. అవసరమైతే నిపుణుల సలహాతో ఈ రెండింటి కలయికతో పెట్టుబడులు పెట్టి, స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలిక సంపదను సమతుల్యం చేసుకోవచ్చు. నిర్ణయం తీసుకునే ముందు పన్ను ప్రభావం, అవసరమైన నగదు లభ్యత వంటి అంశాలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం.

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించ...
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో వ్యక్తిగత అకౌంట్ తీసుకునే వారు రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ తీసుకుంటే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తున్నారు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. అయితే వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తారు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా మీరు నెలకు రూ.9,250 మేర పొందవచ్చు. ఇందుకోసం మీరు జాయింట్ అకౌంట్ తీసుకుని ఒకేసారి రూ.15 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. 7.4 శాతం వడ్డీ రేటుతో మీకు నెల నెలా రూ.9,250 వడ్డీ ఆదాయం వస్తుంది. ఏడాది వడ్డీ ఆదాయం రూ.1,11,000 వస్తే నెల నెలా రూ.9.249 అవుతుంది. ఇలా 5 సంవత్సరాల పాటు వడ్డీ నెల నెలా జమ చేస్తారు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే మొత్తం 60 నెలలు ఉంటుంది. జాయింట్ ఖాతా తీసుకుని రూ.15 లక్షలు జమ చేసినట్లయితే నెలకు రూ.9,250 వరకు వడ్డీ లభిస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో మొత్తం రూ.5.55 లక్షల వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ పథకంలో అకౌంట్ తెరిచిన తర్వాత ఏడాది వరకు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసేందుకు అవకాశం ఉండదు. అకౌంట్ తెరిచిన ఏడాది నుంచి 3 ఏళ్లలోపు ముందస్తుగా అకౌంట్ క్లోజ్ చేస్తే పెనాల్టీగా మీ డిపాజిట్ అమౌంట్లో నుంచి 2 శాతం కట్ చేస్తారు. 3 ఏళ్ల తర్వాత అకౌంట్ మూసివేస్తే 1 శాతం మేర పెనాల్టీ పడుతుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్

- పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకాలలో ఒకటి. - ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా ఆదాయం అందుతుంది. - పెట్టుబడిపై భద్రతతో పాటు నెలనెలా నిర్దిష్ట మొత్తంలో వడ్డీ రావడం వల్ల ఈ పథకానికి మంచి ఆదరణ ఉంది.