translateexpand_more

Ram Charan Peddi Movie News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 05:07 pm
ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం

విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్‌లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్‌లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్‌కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో 'పెద్ది' ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. "బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్‌లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా" అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. "ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది" అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు 'పెద్ది' ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.

NTV Telugu29 May, 03:27 am
ఏపీలో పెరిగిన పెద్ది’ టికెట్ ధర.. స్పెషల్ జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం

మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ దగ్గరపడుతున్ననేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి, సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సినిమా రిలీజ్ రోజు అనగా జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ వరకు (మొదటి వారం రోజుల పాటు) ప్రస్తుతమున్న టికెట్ ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు మేకర్స్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాకు మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ‘పెద్ది’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ సాధించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

NTV Telugu28 May, 02:39 am
పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్.. ఈ కథను ఒప్పుకోవడం ఒక పెద్ద సాహసమే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ సెన్సార్ టాక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దుబాయ్ సెన్సార్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ నుంచి సినిమా వేరే లెవెల్‌కు చేరుకుంటుందని టాక్. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో రామ్ చరణ్, సీనియర్ నటుడు జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. వీరిద్దరి నటనను ప్రేక్షకులు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా బుచ్చిబాబు డిజైన్ చేశారని ఇన్సైడ్ టాక్.ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ‘పెద్ది’ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్ రైడ్‌కు గురి చేస్తుందని సమాచారం. రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించబోతున్నారట. దర్శకుడు బుచ్చిబాబు సన టేకింగ్, కథను నడిపించిన తీరు థియేటర్లలో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇంతటి పవర్‌ఫుల్ ఎమోషనల్ క్లైమాక్స్ రాలేదనే రేంజ్‌లో దుబాయ్ టాక్ వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో అయి ఉండి రామ్ చరణ్ ఇంతటి ఇంటెన్స్ ఎమోషనల్ కథను ఒప్పుకోవడం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. సినిమా మొత్తానికి సెకండాఫ్‌లోని చివరి 45 నిమిషాలు అతిపెద్ద

Zee Telugu03 Jun, 12:59 pm
రేపే గ్రాండ్ గా పెద్ది’ రిలీజ్.. రామ్ చరణ్ కోసం స్పెషల్ వీడియో షేర్ చేసిన సమంత

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Samantha Shares Special Video: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. నేటి రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన బాడీని చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చూసి సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీంతో పెద్ది సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు పెద్దికి శుభాకాంక్షలు తెలుపుతుండగా తాజాగా సమంత అల్ ది బెస్ట్ చెప్తూ స్పెషల్ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ.. నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది సమయం. రామ్ చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పెద్ది సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. నాకు పెద్ది బ్లాక్ బస్టర్ వైబ్ కనిపిస్తుంది అని తెలిపింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ సమంతకు థ్యాంక్స్ చెప్తున్నారు. గతంలో సమంత, రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్‌ నిడిమోరు కథ, మాటలు అందించడం విశేషం. అంతేకాదు ట్రాలాల మూవింగ్‌ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్‌నిడిమోరు నిర్మించారు. సమంత చివరగా `ఖుషి` చిత్రంతో మెరిసింది. 2023లో ఇది రిలీజ్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్‌ తీసుకుంది. మూడేళ్లు బ్రేక్‌ వచ్చింది. మయోసైటిస్‌ అనే వ్యాధిని ఎదుర్కొని సినిమాలు చేసే క్రమంలో.. తన తండ్రి చనిపోయాడు. దీంతో మరింతగా కుంగిపోయింది సమంత. దాన్ని తట్టుకుని, అనేక అడ్డంకులను దాటుకుని ఈ మూవీ చేసింది సామ్‌. మూడేళ్ల తర్వాత థియేట్రికల్‌ రిలీజ్‌తో వస్తోన్న మా ఇంటి బంగారం సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. Also Read: Ranveer Singh Ban: ఇక సహించేది లేదు.. ఫిల్మ్‌ ఫెడరేషన్‌‌కు లీగల్ నోటీసులు పంపించిన హీరో రణ్‌వీర్ సింగ్ Also Read: Aamir Khan Gauri Wedding: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..అతిథులుగా షారుక్, సల్మాన్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి