
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Samantha Shares Special Video: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. నేటి రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన బాడీని చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చూసి సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీంతో పెద్ది సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు పెద్దికి శుభాకాంక్షలు తెలుపుతుండగా తాజాగా సమంత అల్ ది బెస్ట్ చెప్తూ స్పెషల్ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ.. నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది సమయం. రామ్ చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పెద్ది సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. నాకు పెద్ది బ్లాక్ బస్టర్ వైబ్ కనిపిస్తుంది అని తెలిపింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ సమంతకు థ్యాంక్స్ చెప్తున్నారు. గతంలో సమంత, రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథ, మాటలు అందించడం విశేషం. అంతేకాదు ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్‌నిడిమోరు నిర్మించారు. సమంత చివరగా `ఖుషి` చిత్రంతో మెరిసింది. 2023లో ఇది రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మూడేళ్లు బ్రేక్ వచ్చింది. మయోసైటిస్ అనే వ్యాధిని ఎదుర్కొని సినిమాలు చేసే క్రమంలో.. తన తండ్రి చనిపోయాడు. దీంతో మరింతగా కుంగిపోయింది సమంత. దాన్ని తట్టుకుని, అనేక అడ్డంకులను దాటుకుని ఈ మూవీ చేసింది సామ్. మూడేళ్ల తర్వాత థియేట్రికల్ రిలీజ్‌తో వస్తోన్న మా ఇంటి బంగారం సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. Also Read: Ranveer Singh Ban: ఇక సహించేది లేదు.. ఫిల్మ్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు పంపించిన హీరో రణ్‌వీర్ సింగ్ Also Read: Aamir Khan Gauri Wedding: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..అతిథులుగా షారుక్, సల్మాన్! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి