#PEDDI గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడకు చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వార్తకు సంబంధించిన
Latest updates from Telugu Digital news sources.

#PEDDI గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడకు చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వార్తకు సంబంధించిన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi) దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi) బిగ్గెస్ట్ స్టార్. ఆయన స్థాయిని అందుకోవడం అంత తేలిక కాదు. అయితే ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఐడెంటిటీ, ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ ఆయన వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టాడు రామ్ చరణ్. నా వారసుడు కూడా సంగీతంలో ఇలానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు చెప్పినప్పుడు నాకు చాలా స్ఫూర్తిగా అనిపించింది. చాలా మంచి కథ, మట్టి కథ ఇది. ఈ చిత్రానికి పని

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ మేరకు జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి అల్లరి పనులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు బాగా సిస్టర్స్ కంటే బాగా అల్లరి చేసేవాడినని, అమ్మను కూడా బాగా ఇబ్బంది పెట్టే కొడుకునని చరణ్ నవ్వుతూ ఒప్పుకున్నారు. ‘‘ఒకసారి అమ్మ వచ్చి.. రామ్, భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరికీ అబద్ధాలు చెప్పకు’’ అని మందలించగా.. ‘ఎందుకు మమ్మీ?’ అని ప్రశ్నించానని, ‘‘ఎందుకంటే నువ్వు సరిగ్గా అబద్ధం చెప్పలేవు, దొరికిపోతావు’’ అని సరదాగా అన్నట్లు గుర్తుచేసుకున్నారు.

ఇక స్కూల్ బంక్ కొట్టడం, ఇంకా చిన్న చిన్న అబద్ధాల నుంచి మొదలైన తన అల్లరి, ఆ తర్వాత మరింత శృతిమించిందని రామ్ చరణ్ తెలిపారు. తను, తన స్నేహితుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి రాత్రిపూట ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళడానికి ఒక ప్లాన్ వేసేవారట. తమ బెడ్‌రూమ్ కిటికీ గ్రిల్స్ యొక్క స్క్రూలను ఊడదీసి, రాత్రి వేళల్లో కిటికీ గుండా బయటకు దూకేసేవారట. బయట ఫ్రెండ్స్‌తో కలిసి కార్ డ్రైవింగ్‌లు, ఐస్‌క్రీమ్‌లు తింటూ నైట్ అవుట్స్ చేసి, తెల్లవారేసరికి మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా లోపలికి వచ్చి ఆ గ్రిల్స్‌ని యథావిధిగా బిగించేసేవారట.

అయితే, ఒకరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ కిటికీ గ్రిల్స్‌ని పూర్తిగా మేకులతో కొట్టేసి సీల్ చేయడాన్ని చూసి షాక్ అయ్యామని చరణ్ చెప్పారు. వారు చేస్తున్న ఈ దొంగచాటు నైట్ అవుట్ ప్లాన్‌ను కనిపెట్టడానికి వాళ్ళ ఇంట్లో వారికి రెండు మూడు నెలల సమయం పట్టిందట. ఈ విషయాలన్నీ మెగాస్టార్ చిరంజీవికి తెలుసా అని యాంకర్

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ "పెద్ది". జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ఆమె స్టేజ్ ఎక్కినప్పటి నుంచి దిగిపోయే వరకు తన మాటలతో, హావభావాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ముద్దుముద్దుగా ఆమె తెలుగులో మాట్లాడిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మీరు చూపించే ప్రేమే మాకు బలం.. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "నమస్కారం.. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమే మేము రాత్రి పగలు కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.. మీ జీవితానికి అర్థం ఏంటి? మీ ఐడెంటిటీ ఏంటి? అనేది కనుక్కోవడమే ఈ చిత్రం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా మీ అందరితో చాలా డీప్‌గా కనెక్ట్ అయి ఉంది. ఐ హోప్.. నేను మిమ్మల్ని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేస్తాను" అని ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ ఒక ‘జెమ్’.. బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్ సినిమా విశేషాల గురించి చెప్తూ.. "ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. రామ్ చరణ్ సార్‌తో వర్క్ చేసే అవకాశం ఇచ్చింది. హి ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ జెమ్ ఆఫ్ ఎ పర్ఫామర్. జై చరణ్! ఇక బుచ్చిబాబు సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. ఆయన చాలా సాదాసీదాగా, సింపుల్‌గా కనిపిస్తారు కానీ ఆయనో రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ..). ప్రతి టేక్ తర్వాత ఆయన నన్ను ఇమిటేట్ చేస్తారు. 'అదిరిపోయింది మా.. అదిరిపోయింది.. కానీ మళ్లీ ఒకసారి టేక్' అంటారు. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్లీ ఇంకో టేక్ అడుగుతారన్నమాట. మా డీపీఐ రాండీ సార్, లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు, మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారు, ప్రవీణ్ సార్.. ఇలా ఎంటైర్ టీమ్ మీకోసం బెస్ట్ ఇచ్చారు" అని పేర్కొన్నారు. స్టేజ్ పై ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ డైలాగ్! యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు జాన్వీ. "తెలుగు ప్రేక్షకుల గురించి అమ్మ మీకు ఏం చెప్పేది?" అని యాంకర్ అడగ్గా.. "ఆడియన్స్ ఈజ్ గాడ్ (ప్రేక్షకులే దేవుడు).. అమ్మ నాకు ఎప్పుడూ ఇదే చెప్పేది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమ నాకు సర్వస్వం" అని జాన్వీ బదులిచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని ఇంద్రజ (అతిలోకసుందరి) ఐకానిక్ డైలాగ్‌ను స్టేజ్ పైన జాన్వీ కపూర్ రీ-క్రియేట్ చేశారు. స్క్రీన్ పై విజువల్స్ చూసిన అనంతరం జాన్వీ మైక్ అందుకుని.. "మానవా.. ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా.." అంటూ శ్రీదేవి స్టైల్లోనే డైలాగ్ చెప్పి అందరినీ మెప్పించారు. జాన్వీ నోట ఆ డైలాగ్ వినగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మొత్తానికి ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ స్పీచ్, ఆమె అచ్చ తెలుగు ముచ్చట్లు అభిమానులను మస్త్ ఖుషీ చేశాయి.