translateexpand_more

Rowdy Janardhana News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 09:36 am
రాజశేఖర్ కోసం విజయ్ సేతుపతిని తీసేశారా.. 'రౌడీ జనార్ధన' టీం షాకింగ్ డెసిషన్

Rowdy Janardhana: తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అది అయన నటనకు, డేట్స్‌కు ఉన్న డిమాండ్. ఈ కారణంగానే చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు ఈ నటుడు. ఇటీవల, స్టార్ దర్శకుడు సుకుమార్ సైతం ‘పుష్ప’ చిత్రం కోసం చాలా కాలం వేచి చూశారు. అయినప్పటికీ సేతుపతి అందుబాటులోకి రాకపోవడంతో ఆ పాత్ర ఫాహద్ ఫాజిల్‌ను వరించింది. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నుండి కూడా ఆయనకు భారీ ఆఫర్లు వస్తుంటాయి. Arjun Sarja: ఫేక్ కలెక్షన్స్ వేసి మోసం చేయలేను.. అర్జున్ సర్జా సంచలన కామెంట్స్.. నెటిజన్స్ ఫిదా కానీ, బయటి భాషా చిత్రాల ఎంపికలో సేతుపతి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్లమ్ డాగ్’ మినహా ఆయన మరే ఇతర చిత్రానికి సులువుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘రౌడీ జనార్ధన(Rowdy Janardhana)’. ఈ చిత్రంలోని పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదటి నుండి విజయ్ సేతుపతినే అనుకున్నారు టీం. ఆయనను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఆ పాత్రను మలిచారు. సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అడిగినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాత దిల్ రాజు కూడా సిద్ధపడ్డారు. అందుకే, ఆయన కోసం వెయిట్ చేస్తూ, విలన్ సీన్లను మినహాయించి మిగతా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. కానీ, సేతుపతి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ నిరీక్షణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులోనే సినిమాను విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టుకోవడంతో, ఇక ఆలస్యం చేయడం కుదరదని ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఆ విలన్ పాత్ర కోసం సంప్రదించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలే రాజశేఖర్ ‘బైకర్’ చిత్రంలో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తన రూట్‌ను మార్చుకుంటున్న రాజశేఖర్ ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తే సినిమాకు ఖచ్చితంగా సరికొత్త మైలేజ్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఇంతకాలం హీరోగా, నటుడిగా మెప్పించిన రాజశేఖర్, విలన్ గా ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

SkyC Media03 Jun, 11:17 am
రౌడీ జనార్దన మూవీలో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం రౌడీ జనార్దన టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం దీనికి సంబంధించిన బలమైన రిపోర్ట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విలన్ రోల్ కోసం రౌడీ జనార్ధనలో రాజశేఖర్ కాంబినేషన్ సెట్ కావడం విశేషం. రాజశేఖర్ తన పాత ఇమేజ్‌కు తగ్గట్టుగా చాలా పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం చిత్ర బృందం మొదట విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించింది. దర్శకుడు అతనికి పూర్తి స్క్రిప్ట్ నెరేట్ చేసి కథను కూడా వివరించడం జరిగింది. ఈ విలన్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతికి ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. భారీ ఆఫర్ ఉన్నప్పటికీ అతను నెగెటివ్ రోల్ చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆ ప్రతిపాదనను విజయ్ సేతుపతి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. చిత్ర యూనిట్ వెంటనే ప్రత్యామ్నాయంగా సీనియర్ హీరో రాజశేఖర్ వైపు మొగ్గు చూపింది. రౌడీ జనార్ధనలో రాజశేఖర్ కలయికలో సినిమా చేయడానికి కథను అతనికి వినిపించడం జరిగింది. రాజశేఖర్ ఈ స్క్రిప్ట్‌కు మరియు తన నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజశేఖర్‌కు చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ దక్కింది. ఇది అతని కెరీర్‌లో ఒక బంపర్ అవకాశంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఈ సినిమాలో హీరో, విలన్ మధ్య వచ్చే సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ తన పాత యాంగ్రీ మ్యాన్ లుక్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లో ఈ సరికొత్త కాంబినేషన్ మరియు రాజశేఖర్ విలనిజం అందరిని ఆకర్షిస్తోంది. రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. విజయ్ దేవరకొండ మార్కెట్‌కు రాజశేఖర్ క్రేజ్ తోడవడంతో బిజినెస్ పరంగా కూడా క్రేజ్ పెరుగుతోంది. ఈ పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌తో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ మరింత స్పీడందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu Cinema30 May, 12:24 pm
ఎందుకు ఇంత దూకుడు? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే, కొత్త చిత్రాలు ప్రకటిస్తున్నాడు. రష్మికను పెళ్లాడిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తాడనుకుంటే, మరింత వేగం పెంచాడు. మొన్నటికిమొన్న శౌర్యువ్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన ఈ హీరో, తాజాగా విక్రమ్ కుమార్ తో సినిమా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి ‘రణబాలి’ కాగా, రెండోది ‘రౌడీ జనార్థన’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రణబాలి. 1854 నాటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అటు ‘రౌడీ జనార్థన’ షూటింగ్ కూడా సాగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్. ఈ రెండింటిలో ‘రణబాలి’ ఈ ఏడాదే విడుదల అవుతుంది. ఇక ‘రౌడీ జనార్ధన’ వచ్చే ఏడాది తొలి నెలల్లో రిలీజ్ అవుతుంది. అలాగే శౌర్యువ్ దర్శకత్వంలో ప్రకటించిన సినిమా షూటింగ్ ని కూడా త్వరలోనే మొదలుపెట్టి. ఈ సినిమాలతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ గతంలో పాన్ ఇండియా మోజులో పడి టైం వేస్ట్ చేసుకున్నాడు. దాంతో, మార్కెట్ పెరగలేదు. పైగా ఫ్లాపులు ఎక్కువ అయ్యాయి. అందుకే ఇప్పుడు స్పీడ్ పెంచి సక్సెస్ శాతం పెంచే విధంగా ప్రయత్నిస్తున్నాడు.

NTV Telugu27 May, 06:37 am
రౌడీ కోసం కన్నప్ప’ బ్యూటీ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవి కిరణ్ కోలా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ జనార్ధన’. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ‘కన్నప్ప’ చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరిపిందని, దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఒకవేళ ఖరారైతే, ఇది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. కాగా, ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని, విజయ్ దేవరకొండ మేనరిజమ్స్, రవి కిరణ్ మార్క్ టేకింగ్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని టీమ్ గట్టి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మరి రౌడీ జనర్థాన ఎలా ఉంటుందో చూడాలి.