translateexpand_more

Stock Market News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne03 Jun, 06:15 am
సెన్సెక్స్ 900, నిఫ్టీ 250 పాయింట్లు పతనం.. అసలు కారణాలివే

భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. దలాల్ స్ట్రీట్‌లో ఎలుగుబంటి పంజా విసరడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు ట్రేడింగ్‌లో బాంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 250 పాయింట్ల మేర భారీగా పతనమైంది. ఈ హఠాత్ పతనంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సంపదకు భారీ గండి పడింది. నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయిలను కోల్పోవడంతో ట్రేడర్లలో ఆందోళన మరింత పెరిగింది. అయితే ఈ అకస్మాత్తు పతనానికి వెనుక కేవలం ఒకే ఒక్క కారణం లేదు, అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో చోటుచేసుకున్న 5 ప్రధాన అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. మార్కెట్ పతనానికి మొదటి మరియు అత్యంత కీలకమైన కారణం దేశంలో వర్షపాతంపై భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నివేదిక. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని, ఇది లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) లో కేవలం 90 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. గత 11 ఏళ్లలో ఇదే అత్యంత బలహీనమైన రుతుపవనాల అంచనా కావడం గమనార్హం. ఎల్ నినో పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోతుందని, ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) విపరీతంగా పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. రెండవది, అంతర్జాతీయంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి. ఇరు దేశాల మధ్య ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ, తుది ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారిక ముద్ర వేయకపోవడం అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలపై సందిగ్ధత కొనసాగుతుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీనికి తోడు ముడి చమురు (Crude Oil) ధరలు బ్రెంట్ క్రూడ్ బారెల్‌కు 93 డాలర్ల పైనే కొనసాగుతుండటం, భారతదేశం తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడటం వల్ల దేశీయ ద్రవ్యోల్బణ భయాలు ఎక్కువయ్యాయి. మూడవ కారణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీల్లో నెట్ సెల్లర్స్‌గా మారారు. కేవలం మే నెలలోనే వీరు రూ. 55,963 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, జూన్ ప్రారంభంలో కూడా కేవలం ఒకే రోజున రూ. 8,362 కోట్ల మేర భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) కొంతవరకు కొనుగోళ్లు జరిపి మార్కెట్‌ను ఆదుకోవాలని ప్రయత్నించినప్పటికీ, విదేశీ నిధుల వెల్లువలాంటి అమ్మకాల ఒత్తిడిని వారు పూర్తిగా అడ్డుకోలేకపోయారు. నాల్గవది, మార్కెట్ ముగిసే చివరి అరగంటలో జరిగిన MSCI (Morgan Stanley Capital International) ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ప్రక్రియ. ఈ మే 2026 ఇండెక్స్ మార్పుల కారణంగా ప్యాసివ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేసుకునే క్రమంలో మార్కెట్లో తీవ్రమైన అస్థిరత (Volatility) చోటుచేసుకుంది. తాజా రీబ్యాలెన్సింగ్ ఫలితంగా ఎంఎస్‌సిఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భారతదేశ వెయిటేజీ గతంలో ఉన్న 20 శాతం నుండి దాదాపు 11.2 శాతానికి పడిపోవచ్చనే అంచనాలు మార్కెట్ పతన వేగాన్ని పెంచాయి. ఐదవ కారణం, మార్కెట్ వ్యాల్యుయేషన్లు (Valuations) చాలా ఖరీదుగా మారడం మరియు బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి. గత కొన్ని నెలలుగా భారత మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే ప్రీమియం వ్యాల్యుయేషన్లలో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ మరింత పైకి వెళ్లడానికి ఎలాంటి బలమైన పాజిటివ్ ట్రిగ్గర్లు లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపారు. ముఖ్యంగా నిఫ్టీలో దాదాపు 20 శాతం వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు ద్రవ్యోల్బణ భయాలతో భారీగా నష్టపోయి మార్కెట్‌ను కిందకు లాగాయి. ఈ ఐదు కారణాల వల్లే దలాల్ స్ట్రీట్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. మార్కెట్ క్రాష్‌లోనూ వోడాఫోన్ ఐడియా సంచలనం.. నెలలోనే 40% జంప్! బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు!

AP7AM03 Jun, 01:22 pm
సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు

బుధవారం నాడు భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనమయ్యాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌యూ), ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రా-డే కనిష్ట స్థాయిల నుంచి మార్కెట్లు గణనీయంగా కోలుకున్నాయి. దీంతో నష్టాలు కొంతమేర తగ్గాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 303.67 పాయింట్లు నష్టపోయి 74,346.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 77.95 పాయింట్లు తగ్గి 23,405.60 వద్ద ముగిసింది. సెషన్ మొత్తంలో మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కనిపించాయి.రంగాలవారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతానికి పైగా పతనమై అత్యంత బలహీనంగా నిలిచింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు సెన్సెక్స్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. మరోవైపు, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు కూడా మార్కెట్లకు మద్దతునిచ్చాయి. అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు లాభపడ్డాయి.మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, నిఫ్టీకి 23,500 కీలక నిరోధక స్థాయిగా ఉంది. ఈ స్థాయిని దాటితే 23,800 వరకు రికవరీకి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, తక్షణ మద్దతు 23,300-23,350 వద్ద ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా, భారత రూపాయి విలువ వరుసగా రెండో సెషన్లోనూ పడిపోయింది. విదేశీ పెట్టుబడుల తరలిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రతిపాదనలపై ఆందోళనలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. టెక్నికల్‌గా స్పాట్ యూఎస్‌డీ-ఐఎన్‌ఆర్‌కు 96.50 వద్ద నిరోధం, 95.10 వద్ద మద్దతు ఉన్నాయని విశ్లేషకులు

Sakshi01 Jun, 04:28 am
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 23,585 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 162 పాయింట్లు పుంజుకొని 74,937 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.05 బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 92.9 డాలర్లు యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.46 శాతానికి

AP7AM01 Jun, 11:33 am
ఎఫ్ ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు కుదేలయ్యాయి. మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508.40 పాయింట్లు నష్టపోయి 74,267.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165.15 పాయింట్ల పతనంతో 23,382.60 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.45 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ 0.88 శాతం నష్టపోయింది.నిఫ్టీలో హిందుస్థాన్ యూనిలీవర్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ, ఎన్టీపీసీ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ స్టాక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ 2.83 శాతం వరకు నష్టపోయాయి.అయితే, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి ఐటీ షేర్లు లాభపడటంతో సూచీల పతనం కొంతమేర పరిమితమైంది.సాంకేతిక విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీ 23,500 స్థాయిని కోల్పోవడంతో సమీప భవిష్యత్తులో బలహీనపడింది. తక్షణ నిరోధకం 23,500 వద్ద, బలమైన నిరోధకం 23,600-23,750 జోన్‌లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దిగువన 23,300-23,250 స్థాయి తదుపరి కీలక మద్దతుగా పనిచేయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు, జీడీపీ గణాంకాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని వారు పేర్కొన్నారు.

Andhra Jyothy27 May, 04:35 am
ఫ్లాట్ గా మొదలైన సూచీలు.. బలహీనపడిన రూపాయి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,009)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్ల నష్టంతో 75,864 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 36 పాయింట్ల నష్టంతో 23,876 వద్ద కదలాడుతోంది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో సీజీ పవర్, స్విగ్గీ, హిందాల్కో, వెర్నోవా టీడీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌ఐసీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 255 పాయింట్ల లాభంతో ఉంది. స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..

Andhra Jyothy26 May, 04:17 am
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సోమవారం భారీగా కోలుకున్న రూపాయి మంగళవారం కాస్త బలహీనపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.39గా ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 76,224 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 76,588 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 37 పాయింట్ల లాభంతో 24,068 వద్ద కదలాడుతోంది. చాలా రోజుల తర్వాత నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో వేదాంత, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, బంధన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, హిటాచీ ఎనర్జీ, రైల్ వికాస్, బ్లూ స్టార్, ఆల్కెమ్ ల్యాబ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 110 పాయింట్ల లాభంతో ఉంది. ఐపీఎల్

Andhra Jyothy26 May, 11:12 am
సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.68) బలహీనపడడం నెగిటివ్‌గా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత పైకి వచ్చింది. అయితే చివర్లో అమ్మకాల వల్ల సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద స్థిరపడింది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇన్ఫో ఎడ్జ్, అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, రైల్ వికాస్, కేన్స్ టెక్, టొరెంట్ ఫార్మా, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 332 పాయింట్లు ఆర్జించింది. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప

Zee Telugu26 May, 06:00 am
Taiwan stock market: వణుకుతున్న చైనా.. స్టాక్‌ మార్కెట్‌లో ప్రభంజనం సృష్టిస్తోన్న Taiwan.. కారణాలు ఇవే..!!

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Taiwan stock market: గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సాక్ష్యమిస్తోంది. ఆర్టిఫికషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అపూర్వమైన విజ్రుంభణ, ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ అయిన తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ భారీ వృద్ధి కారణంగా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా తైవాన్ భారత్ ను అధిగమించింది. తాజాగా బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన డేటా ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ 4.95 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 415 లక్షల కోట్లు. భారత మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్లకు పడిపోయింది. ఈ చారిత్రాత్మక విజ్రుంభణతో అమెరికా, చైనా, జపాన్, హాంగ్ కాంగ్ ల తర్వాత చైనా ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరించింది. అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ 77.53 ట్రిలియన్లు కాగా.. దాని తర్వాత చైనా 15.61 ట్రిలియన్లు, జపాన్ 8.70 ట్రిలియన్లు, హాంగ్ కాంగ్ 7. 25 ట్రిలియన్లతో ఉన్నాయి. అయితే తైవాన్ సాధించిన ఈ విజయం వెనక TSMC వన్ మ్యాన్ షోగా నిలిచిందని చెప్పాలి. ఈ ఒకే ఒక కంపెనీ ఎందుకంటే తైవాన్ ప్రధాన సూచీ అయిన బెంచ్ మార్క్ ఇండెక్స్ లో ఒక టీఎస్ఎంసీ కంపెనీకే 42శాతం మేర భారీ వాటా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ విప్లవంలో ఉపయోగించే అధునాతన సెమీకండక్టర్ల రంగంలో కూడా ఈ కంపెనీదే పూర్తి ఆధిపత్యం కొనసాగుతోంది. ఫలితంగా

Sakshi24 May, 02:22 am
ఐపీఓకు దూత్‌ ట్రాన్స్‌మిషన్‌

- May 24 2026 7:32 AM | Updated on May 24 2026 7:36 AM ముంబై: ఆటో విడిభాగాల తయారీ సంస్థ దూత్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైంది. - ఇందులో భాగంగా కంపెనీ సెబీకి సవరించిన ముసాయిదా పత్రాలు (యూడీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. - దాఖలు చేసిన యూడీఆర్‌హెచ్‌పీ ప్రకారం..

Sakshi27 May, 04:23 am
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు తగ్గి 23,886 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 149 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.11 బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 97.9 డాలర్లు యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.61 శాతం పెరిగింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు) హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు) ‘సిస్టమ్‌’ మేకింగ్‌ ఫోటోలను షేర్‌ చేసిన జ్యోతిక (ఫొటోలు) పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి (ఫొటోలు) మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ 15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్

Sakshi26 May, 02:01 pm
భారత్‌ను అధిగమించిన తైవాన్!

గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ డేటా వెల్లడించింది. తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, క్వాల్‌కామ్ ఉపయోగించే అధునాతన చిప్‌లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది. అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్‌కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ

TeluguOne03 Jun, 06:18 am
మార్కెట్ క్రాష్ లోనూ వోడాఫోన్ ఐడియా సంచలనం.. నెలలోనే 40 జంప్

భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. నిఫ్టీ 250 పాయింట్లు, సెన్సెక్స్ 900 పాయింట్ల మేర భారీగా కుప్పకూలిపోవడంతో మదుపరులలో ఆందోళన నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) షేరు మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, వోడాఫోన్ ఐడియా షేరు ధర బిఎస్‌ఇ (BSE) లో 0.91 శాతం లాభపడి ₹14.29 స్థాయిని తాకింది. ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన కొనుగోళ్ల మద్దతు లభించడమే ఇందుకు ప్రధాన కారణం. గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తున్న ఈ టెలికాం కంపెనీలో హఠాత్తుగా ఇంతటి సానుకూల మార్పు రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వోడాఫోన్ ఐడియా సాధించిన వృద్ధి గణాంకాలు పరిశీలిస్తే ఈ షేరు ఎంత వేగంగా పుంజుకుందో స్పష్టమవుతుంది. కేవలం గత ఒక్క నెల రోజుల్లోనే వోడాఫోన్ ఐడియా షేరు ధర ఏకంగా 40 శాతం మేర లాభపడింది. ఈ ఏడాది ప్రారంభం (YTD) నుండి ఇప్పటివరకు చూసుకుంటే ఈ స్టాక్ 21 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా గత ఆరు నెలల్లో 34 శాతం రాలీ చేసిన ఈ షేరు, గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు ఏకంగా 108 శాతం బంపర్ రిటర్న్స్ ఇచ్చి మల్టీబ్యాగర్‌గా నిలిచింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల విషయానికి వస్తే, గత మూడేళ్లలో ఈ షేరు ధర 97 శాతం, అలాగే ఐదేళ్ల కాలంలో 51 శాతం మేర పెరిగింది. ఈ అద్భుతమైన మార్కెట్ రాలీకి ప్రధాన కారణం ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ (ICRA) ఈ సంస్థకు ఇచ్చిన క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్. వోడాఫోన్ ఐడియా యొక్క క్రెడిట్ రేటింగ్‌ను ఐసిఆర్‌ఎ గతంలో ఉన్న బిబిబి (BBB) నుండి సానుకూలమైన A- స్థాయికి పెంచింది. అలాగే కంపెనీ భవిష్యత్తు దృక్పథాన్ని (Outlook) కూడా పాజిటివ్ నుండి స్టేబుల్ కి మార్చింది. ప్రమోటర్ గ్రూప్ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ అందిస్తున్న బలమైన మద్దతు, అలాగే బోర్డు ఛైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా తిరిగి నియమితులు కావడం ఈ రేటింగ్ మెరుగుపడటానికి కీలక కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు 2024 మే నెలలో ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీకి ప్రిఫరెన్షియల్ వారెంట్ల కేటాయింపు ద్వారా దాదాపు ₹4,730 కోట్ల ఈక్విటీ నిధుల సమీకరణకు ప్రతిపాదించడం సంస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న ఏజీఆర్ (AGR) బకాయిల నిలిపివేత, ఈక్విటీ మార్పిడి నిర్ణయాలు కూడా దేశంలో ముగ్గురు ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు ఉండాలనే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీ (Citi) కూడా వోడాఫోన్ ఐడియా భవిష్యత్తుపై భారీ అంచనాలను వ్యక్తం చేసింది. ఈ స్టాక్‌కు గతంలో ఉన్న బయ్ / హై రిస్క్ రేటింగ్‌ను మార్చి, కేవలం బయ్ (Buy) రేటింగ్‌గా అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాకుండా దీని టార్గెట్ ధరను ₹14 నుండి ₹17 కి పెంచింది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే ఈ షేరు ఇంకా 20 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని సిటీ అంచనా వేస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ సమకూర్చిన ₹4,700 కోట్ల నిధులు కంపెనీకి ఉన్న బ్యాంకింగ్ లోన్ల సమస్యను పరిష్కరించడంలో తోడ్పడతాయని బ్రోకరేజ్ సంస్థ భావిస్తోంది. మరో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Crisil) కూడా వోడాఫోన్ ఐడియా ప్రతిపాదిత బ్యాంకింగ్ వసతులకు A-/Stabl రేటింగ్ ఇచ్చింది. అయితే, భవిష్యత్తులో బ్యాంక్ నిధుల సేకరణలో ఆలస్యం, పోటీ తీవ్రత పెరగడం, 4G/5G కస్టమర్ల చేరిక మందగించడం వంటి అంశాలు ఈ షేరు వృద్ధికి కొంత అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ క్రాష్‌లోనూ వోడాఫోన్ ఐడియా సంచలనం.. నెలలోనే 40% జంప్! షేర్ మార్కెట్ క్రాష్: సెన్సెక్స్ 900, నిఫ్టీ 250 పాయింట్లు పతనం.. అసలు కారణాలివే!

TeluguOne03 Jun, 06:16 am
మార్కెట్ క్రాష్ లోనూ వోడాఫోన్ ఐడియా సంచలనం.. నెలలోనే 40 జంప్

భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. నిఫ్టీ 250 పాయింట్లు, సెన్సెక్స్ 900 పాయింట్ల మేర భారీగా కుప్పకూలిపోవడంతో మదుపరులలో ఆందోళన నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) షేరు మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, వోడాఫోన్ ఐడియా షేరు ధర బిఎస్‌ఇ (BSE) లో 0.91 శాతం లాభపడి ₹14.29 స్థాయిని తాకింది. ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన కొనుగోళ్ల మద్దతు లభించడమే ఇందుకు ప్రధాన కారణం. గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తున్న ఈ టెలికాం కంపెనీలో హఠాత్తుగా ఇంతటి సానుకూల మార్పు రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వోడాఫోన్ ఐడియా సాధించిన వృద్ధి గణాంకాలు పరిశీలిస్తే ఈ షేరు ఎంత వేగంగా పుంజుకుందో స్పష్టమవుతుంది. కేవలం గత ఒక్క నెల రోజుల్లోనే వోడాఫోన్ ఐడియా షేరు ధర ఏకంగా 40 శాతం మేర లాభపడింది. ఈ ఏడాది ప్రారంభం (YTD) నుండి ఇప్పటివరకు చూసుకుంటే ఈ స్టాక్ 21 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా గత ఆరు నెలల్లో 34 శాతం రాలీ చేసిన ఈ షేరు, గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు ఏకంగా 108 శాతం బంపర్ రిటర్న్స్ ఇచ్చి మల్టీబ్యాగర్‌గా నిలిచింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల విషయానికి వస్తే, గత మూడేళ్లలో ఈ షేరు ధర 97 శాతం, అలాగే ఐదేళ్ల కాలంలో 51 శాతం మేర పెరిగింది. ఈ అద్భుతమైన మార్కెట్ రాలీకి ప్రధాన కారణం ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ (ICRA) ఈ సంస్థకు ఇచ్చిన క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్. వోడాఫోన్ ఐడియా యొక్క క్రెడిట్ రేటింగ్‌ను ఐసిఆర్‌ఎ గతంలో ఉన్న బిబిబి (BBB) నుండి సానుకూలమైన A- స్థాయికి పెంచింది. అలాగే కంపెనీ భవిష్యత్తు దృక్పథాన్ని (Outlook) కూడా పాజిటివ్ నుండి స్టేబుల్ కి మార్చింది. ప్రమోటర్ గ్రూప్ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ అందిస్తున్న బలమైన మద్దతు, అలాగే బోర్డు ఛైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా తిరిగి నియమితులు కావడం ఈ రేటింగ్ మెరుగుపడటానికి కీలక కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు 2024 మే నెలలో ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీకి ప్రిఫరెన్షియల్ వారెంట్ల కేటాయింపు ద్వారా దాదాపు ₹4,730 కోట్ల ఈక్విటీ నిధుల సమీకరణకు ప్రతిపాదించడం సంస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న ఏజీఆర్ (AGR) బకాయిల నిలిపివేత, ఈక్విటీ మార్పిడి నిర్ణయాలు కూడా దేశంలో ముగ్గురు ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు ఉండాలనే ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీ (Citi) కూడా వోడాఫోన్ ఐడియా భవిష్యత్తుపై భారీ అంచనాలను వ్యక్తం చేసింది. ఈ స్టాక్‌కు గతంలో ఉన్న బయ్ / హై రిస్క్ రేటింగ్‌ను మార్చి, కేవలం బయ్ (Buy) రేటింగ్‌గా అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాకుండా దీని టార్గెట్ ధరను ₹14 నుండి ₹17 కి పెంచింది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే ఈ షేరు ఇంకా 20 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని సిటీ అంచనా వేస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ సమకూర్చిన ₹4,700 కోట్ల నిధులు కంపెనీకి ఉన్న బ్యాంకింగ్ లోన్ల సమస్యను పరిష్కరించడంలో తోడ్పడతాయని బ్రోకరేజ్ సంస్థ భావిస్తోంది. మరో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Crisil) కూడా వోడాఫోన్ ఐడియా ప్రతిపాదిత బ్యాంకింగ్ వసతులకు A-/Stabl రేటింగ్ ఇచ్చింది. అయితే, భవిష్యత్తులో బ్యాంక్ నిధుల సేకరణలో ఆలస్యం, పోటీ తీవ్రత పెరగడం, 4G/5G కస్టమర్ల చేరిక మందగించడం వంటి అంశాలు ఈ షేరు వృద్ధికి కొంత అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్‌కు భారీ షాక్.. రెండో వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం! మార్కెట్ క్రాష్‌లోనూ వోడాఫోన్ ఐడియా సంచలనం.. నెలలోనే 40% జంప్!