translateexpand_more

Sensex Today News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy27 May, 04:35 am
ఫ్లాట్ గా మొదలైన సూచీలు.. బలహీనపడిన రూపాయి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,009)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్ల నష్టంతో 75,864 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 36 పాయింట్ల నష్టంతో 23,876 వద్ద కదలాడుతోంది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో సీజీ పవర్, స్విగ్గీ, హిందాల్కో, వెర్నోవా టీడీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌ఐసీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 255 పాయింట్ల లాభంతో ఉంది. స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..

Andhra Jyothy26 May, 04:17 am
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సోమవారం భారీగా కోలుకున్న రూపాయి మంగళవారం కాస్త బలహీనపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.39గా ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 76,224 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 76,588 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 37 పాయింట్ల లాభంతో 24,068 వద్ద కదలాడుతోంది. చాలా రోజుల తర్వాత నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో వేదాంత, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, బంధన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, హిటాచీ ఎనర్జీ, రైల్ వికాస్, బ్లూ స్టార్, ఆల్కెమ్ ల్యాబ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 110 పాయింట్ల లాభంతో ఉంది. ఐపీఎల్

Andhra Jyothy26 May, 11:12 am
సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.68) బలహీనపడడం నెగిటివ్‌గా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత పైకి వచ్చింది. అయితే చివర్లో అమ్మకాల వల్ల సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద స్థిరపడింది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇన్ఫో ఎడ్జ్, అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, రైల్ వికాస్, కేన్స్ టెక్, టొరెంట్ ఫార్మా, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 332 పాయింట్లు ఆర్జించింది. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప