translateexpand_more

Indian Stock Market News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 11:33 am
ఎఫ్ ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు కుదేలయ్యాయి. మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508.40 పాయింట్లు నష్టపోయి 74,267.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165.15 పాయింట్ల పతనంతో 23,382.60 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.45 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ 0.88 శాతం నష్టపోయింది.నిఫ్టీలో హిందుస్థాన్ యూనిలీవర్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ, ఎన్టీపీసీ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ స్టాక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ 2.83 శాతం వరకు నష్టపోయాయి.అయితే, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి ఐటీ షేర్లు లాభపడటంతో సూచీల పతనం కొంతమేర పరిమితమైంది.సాంకేతిక విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీ 23,500 స్థాయిని కోల్పోవడంతో సమీప భవిష్యత్తులో బలహీనపడింది. తక్షణ నిరోధకం 23,500 వద్ద, బలమైన నిరోధకం 23,600-23,750 జోన్‌లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దిగువన 23,300-23,250 స్థాయి తదుపరి కీలక మద్దతుగా పనిచేయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు, జీడీపీ గణాంకాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని వారు పేర్కొన్నారు.

Andhra Jyothy27 May, 04:35 am
ఫ్లాట్ గా మొదలైన సూచీలు.. బలహీనపడిన రూపాయి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,009)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్ల నష్టంతో 75,864 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 36 పాయింట్ల నష్టంతో 23,876 వద్ద కదలాడుతోంది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో సీజీ పవర్, స్విగ్గీ, హిందాల్కో, వెర్నోవా టీడీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌ఐసీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 255 పాయింట్ల లాభంతో ఉంది. స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..

Andhra Jyothy26 May, 04:17 am
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సోమవారం భారీగా కోలుకున్న రూపాయి మంగళవారం కాస్త బలహీనపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.39గా ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 76,224 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 76,588 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 37 పాయింట్ల లాభంతో 24,068 వద్ద కదలాడుతోంది. చాలా రోజుల తర్వాత నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో వేదాంత, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, బంధన్ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, హిటాచీ ఎనర్జీ, రైల్ వికాస్, బ్లూ స్టార్, ఆల్కెమ్ ల్యాబ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 110 పాయింట్ల లాభంతో ఉంది. ఐపీఎల్

Andhra Jyothy26 May, 11:12 am
సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.68) బలహీనపడడం నెగిటివ్‌గా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత పైకి వచ్చింది. అయితే చివర్లో అమ్మకాల వల్ల సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద స్థిరపడింది (stock market news today). సెన్సెక్స్‌, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇన్ఫో ఎడ్జ్, అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, రైల్ వికాస్, కేన్స్ టెక్, టొరెంట్ ఫార్మా, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 332 పాయింట్లు ఆర్జించింది. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప