translateexpand_more

Asian Group News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 02:05 pm
మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Telugu States IMax: సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఎంబీ సినిమాస్ ఇప్పటికే అత్యుత్తమ సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నేతృత్వంలోని ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ ఎన్నో ఆధునిక సాంకేతికతలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమా థియేటర్‌ను తీసుకురావడం, హైదరాబాద్‌లో తొలి హెచ్‌డీఆర్ బై బార్కో స్క్రీన్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేయడం వంటి విజయాలను ఏఎంబీ సినిమాస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో భారీ అడుగు వేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబుతో పాటు ప్రముఖ నటులు వెంకటేశ్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరి సహకారంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సుదర్శన్ థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇక్కడ ఘన విజయాలను నమోదు చేశాయి. సినీ అభిమానుల జ్ఞాపకాలతో ముడిపడిన ఈ ప్రదేశం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐమ్యాక్స్ టెక్నాలజీ

Telugu Times30 May, 01:42 am
హైద రాబాద్ మూవీ ల వ ర్స్ కు గుడ్ న్యూస్

హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ఎట్టకేలకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా పేరుగాంచిన ఐమాక్స్(Imax) ఫార్మాట్ మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నట్లు తాజా సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించగా, తర్వాత అది తొలగించబడటం మూవీ లవర్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా హాలీవుడ్ విజువల్ వండర్స్, భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల‌ను అసలైన ఫార్మాట్‌లో చూడాలనుకునే ప్రేక్షకులు ఈ లోటును ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత, ఏషియన్ గ్రూప్ అధినేత సునీల్ నారంగ్(Suneel Narang) చేసిన ప్రకటన సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హైదరాబాద్‌లో తమ సంస్థకు చెందిన ఒక ప్రాపర్టీలో సరికొత్త ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ మరో నాలుగైదు రోజుల్లో రానుందని చెప్పడంతో సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. ఇప్పటికే ఏషియన్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న మల్టీప్లెక్స్‌లు అత్యాధునిక సదుపాయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, ఇప్పుడు ఐమాక్స్ చేరికతో మరింత ప్రీమియం అనుభూతి అందనుంది. సాధారణ థియేటర్లతో పోలిస్తే ఐమాక్స్ స్క్రీన్లు విజువల్స్, బ్రైట్‌నెస్, సౌండ్ డిజైన్ పరంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. భారీ స్క్రీన్, హై రిజల్యూషన్ ప్రొజెక్షన్, పవర్‌ఫుల్ ఆడియోతో ప్రేక్షకుడిని సినిమా ప్రపంచంలో పూర్తిగా ముంచెత్తే సామర్థ్యం ఐమాక్స్‌కు ఉంది. ముఖ్యంగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత సినిమాల‌కు ఈ ఫార్మాట్ మరింత గ్రాండ్ అనుభూతిని అందిస్తుంది. హైదరాబాద్‌లో మళ్లీ ఐమాక్స్ రాబోతుండటంతో సినీ ప్రేమికులు ఈ అప్డేట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.