translateexpand_more

Biggest Six In Ipl News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 06:42 am
వైభవ్ ఎన్ని సిక్సులు బాదితేనేం.. మన తెలుగోడు సింగిల్ సిక్స్ తోనే రఫ్పాడించాడుగా

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్‌లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు.. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఏకంగా 72 సిక్సులు బాది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డునే బద్దలుగొట్టాడు. ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ అనేక అవార్డులు పొందాడు. అయితే సిక్సర్ల మోత మోగించిన వైభవ్ నే ఆశ్చర్యపర్చేలా మన హైదరాబాదీ ప్లేయర్ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఐపిఎల్ ఇదే అత్యంత భారీ సిక్స్. ఇంతకూ ఈ ఐపిఎల్ సీజన్లో అత్యంత దూరం సిక్స్ బాదిన ప్లేయర్లు ఎవరు..? అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ కూపర్ కాన్హొలి భారీ సిక్సర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను ఏకంగా 103 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కాన్హొలి అదిరిపోయే ఆరంభాలు ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ జేకబ్ బెథెల్ భారీ సిక్సర్లు బాదినవారిలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 104 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ సిక్సర్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై అతను 106 మీటర్ల సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మిల్లర్ ఈ ఆకాశమంత సిక్సర్ కొట్టాడు. ఐపిఎల్ 2026 విజేత ఆర్‌సీబీకి చెందిన మరో హిట్టర్ టిమ్ డేవిడ్ భారీ సిక్సర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ ఈ భారీ షాట్ ఆడాడు. ఇది ఈ సీజన్‌లో రెండో అతిపెద్ద సిక్సర్. ఐపిఎల్ సీజన్‌ 2026 లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన రికార్డు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పేరు మీద ఉంది. పంజాబ్ కింగ్స్‌ బౌలర్ యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో అతను ఏకంగా 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ దెబ్బకు బంతి ఏకంగా స్టేడియం బయట పడింది.

Biggest Six In Ipl News Keyword | Telugu Digital