translateexpand_more

Chandrababu Visit News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 02:58 pm
తాటికల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. గీత కార్మికులు ఎంతో నైపుణ్యంతో తాటి చెట్టుపైకి ఎక్కి సాంప్రదాయ పద్ధతిలో కల్లు తీసే ప్రత్యేక విధానాన్ని ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో గీత కార్మికులు అప్పుడే తాటి చెట్టు నుంచి స్వచ్ఛంగా తీసిన తాజా తాటి కల్లును ఆయన స్వయంగా రుచి చూడటం అక్కడ ఉన్న స్థానికులను, అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది.