
అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) సమస్య ఉన్నవారు ఇంటివద్దే బీపీని పర్యవేక్షించుకోవడం సాధారణమైంది. అయితే, చాలామంది సరైన పద్ధతి పాటించకపోవడం వల్ల తప్పుడు రీడింగులు వస్తున్నాయని, ఇది అనవసర ఆందోళనకు లేదా తప్పుడు రోగ నిర్ధారణకు దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరికరాల లోపం కన్నా, వాడే విధానంలో చేసే పొరపాట్లే రీడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.బీపీ పరీక్షించే సమయం, కూర్చునే భంగిమ, వాడే పరికరం వంటివి రీడింగ్ కచ్చితత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు.కచ్చితమైన ఫలితాల కోసం, పరీక్షకు కనీసం 5 నిమిషాల ముందు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. 30 నిమిషాల ముందు కెఫిన్, ధూమపానం, వ్యాయామం వంటివి చేయరాదు. వెన్నెముకకు ఆసరాగా కూర్చొని, పాదాలను నేలపై ఆన్చి, కాళ్లను ముడుచుకోకుండా చూసుకోవాలి. చేతిని గుండె స్థాయికి సమానంగా టేబుల్‌పై ఉంచి, పైచేతికి సరైన సైజు కఫ్‌ను చర్మానికి తగిలేలా బిగించాలి.సాధారణంగా ప్రజలు చేసే పొరపాట్లను నిపుణులు వివరిస్తున్నారు. మణికట్టు లేదా వేలికి అమర్చే పరికరాలు వాడటం, పరీక్ష సమయంలో మాట్లాడటం, నిద్ర లేవగానే లేదా తిన్న వెంటనే బీపీ చూడటం వంటివి తప్పుడు రీడింగ్‌లకు కారణమవుతాయి. ఒకే రీడింగ్‌పై ఆధారపడకుండా, ఒకటి రెండు నిమిషాల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు రీడింగ్ తీసుకుని, వాటి సగటును పరిగణనలోకి తీసుకోవాలి.అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సీడీసీ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. దుస్తుల పైనుంచి కఫ్ బిగించడం లేదా మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు బీపీ చూడటం