
Telangana Summer Holidays: తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడుగా వడగాలులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచే విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సింది. కానీ, ఎండలతో పాటు వడగాలుల తీవ్రత తగ్గకపోవడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ సాంప్రదాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని క్యాంపస్, కాన్‌స్టిట్యుయెంట్ (అనుబంధ), అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికీ ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు.. ఈ మూడు విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు జూన్ 6 వరకు సెలవులను పొడిగించారు. ఈ కాలేజీలు తిరిగి జూన్ 8 (సోమవారం) నాడు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు జూన్ 5 వరకు వేసవి సెలవులను పొడిగించారు. ఇవి తిరిగి జూన్ 6 నుంచే ఓపెన్ కానున్నాయి. విద్యార్థులకు, సాధారణ అధ్యాపకులకు సెలవులు పొడిగించినప్పటికీ.. కాలేజీల ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలలోని ఉన్నతాధికారులు మాత్రం యధావిధిగా విధులకు హాజరుకావాలని యూనివర్సిటీలు స్పష్టం చేశాయి. అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం.. డిగ్రీ కాలేజీలకు ఏటా 10 వారాల పాటు వేసవి సెలవులు ఇచ్చేందుకు అర్హత ఉంటుందని కొలీజియట్ ఎడ్యుకేషన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కాదరు సురేందర్ రెడ్డి తెలిపారు. మొదట మే 1 నుంచి మే
