translateexpand_more

Delhi Capitals News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu02 Jun, 01:05 pm
పాండ్యా ఒక్కడే కాదు.. వచ్చే సీజన్ కు ముందే మరో ఇద్దరు కెప్టెన్లను కూడా సాగనంపనున్న యాజమాన్యాలు

IPL : ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన రెండో టైటిల్ గెలవడంతో ఎంతో గ్రాండ్‌గా ముగిసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో కొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో అలరిస్తే.. మరికొన్ని జట్లు మాత్రం అంచనాలను అందుకోలేక ఘోరంగా విఫలమయ్యాయి. ఐపీఎల్ లాంటి హై-కాంపిటీషన్ టోర్నీలో కెప్టెన్సీ అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫలితాలు అనుకూలంగా రానప్పుడు ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనకాడవు. ఈ క్రమంలోనే తాజా సీజన్‌లో తమ జట్లను సక్సెస్ వైపు నడిపించలేకపోయిన ముగ్గురు స్టార్ కెప్టెన్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందే ఆయా ఫ్రాంచైజీలు వారిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, జట్టు నుంచి కూడా రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కు భారంగా మారిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ లాంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను పక్కనపెట్టి.. ముంబై ఇండియన్స్ (MI) జట్టు హార్దిక్ పాండ్యాకు భవిష్యత్తు లీడర్‌గా భావించి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ ఆయన నాయకత్వంలో ముంబై జట్టు పూర్తిగా చతికిలపడింది. మొదటి సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై.. ఆ తర్వాతి సీజన్‌లో క్వాలిఫైయర్-2 వరకు వెళ్లినా.. ఐపీఎల్ 2026 లో మళ్లీ పాత కథనే రిపీట్ చేసింది. ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి టేబుల్‌లో 9వ స్థానంతో ఘోరంగా ముగింపు పలికింది. గత మూడు సీజన్లుగా బలమైన కోర్ టీమ్ ఉన్నప్పటికీ ముంబై ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. కెప్టెన్‌గా విఫలమవడమే కాకుండా ఆల్‌రౌండర్‌గా కూడా హార్దిక్ పాండ్యా జట్టుకు ఎలాంటి న్యాయం చేయలేకపోయారు. ఈ సీజన్‌లో ఆయన ఆడిన 10 మ్యాచుల్లో కేవలం 206 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టారు. దీనికి తోడు నడుము నొప్పి కారణంగా పలు కీలక మ్యాచ్‌లకు దూరం కావడంతో జట్టు బ్యాలెన్స్ దెబ్బతింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సక్సెస్ కోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదు కాబట్టి.. ఐపీఎల్ 2027 కి ముందే హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని యాజమాన్యం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసిన అక్షర్ పటేల్ ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ఎన్నో ఆశలతో అక్షర్ పటేల్‎కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. కానీ, ఆయన నాయకత్వంలో ఢిల్లీ జట్టు వరుసగా రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. దీనితో అక్షర్ కెప్టెన్సీ వ్యూహాలతో పాటు జట్టుకు ఆయన అందిస్తున్న కాంట్రిబ్యూషన్ పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైదానంలో కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడనే టాక్ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 112.50 స్ట్రైక్ రేట్‌తో కేవలం 100 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒకే మ్యాచ్‌లో చేసిన 56 పరుగులు తీసేస్తే.. మిగిలిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి ఆయన చేసింది కేవలం 44 పరుగులు మాత్రమే. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ ఈ స్థాయి ప్రదర్శన జట్టుకు మైనస్‌గా మారింది. ఇక బౌలింగ్‌లోనూ 12 మ్యాచుల్లో 36 ఓవర్లు వేసి 10 వికెట్లు మాత్రమే తీశారు. ఈ సీజన్‌లో ఢిల్లీ 7 విజయాలతో 5వ స్థానంలో నిలిచినప్పటికీ, పీటీఐ నివేదికల ప్రకారం ఢిల్లీ యాజమాన్యం తమ మొదటి టైటిల్ కోసం సరికొత్త లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్ట్రక్చర్‌తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారమైన అజింక్య రహానే శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసుకున్న తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు కెప్టెన్సీ అప్పగించింది. రహానే అనుభవం జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తుందని భావించినప్పటికీ ఫలితం దక్కలేదు. 2024 లో టైటిల్ గెలిచిన కేకేఆర్.. ఆ తర్వాతి సీజన్‌లో 8వ స్థానంలో, ఇక ఈ ఐపీఎల్ 2026 లో 14 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోవడం వారి వైఫల్యానికి అద్దం పట్టింది. టి20 ఫార్మాట్‌లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో రహానే విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఆధునిక టీ20 క్రికెట్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటే.. రహానే మాత్రం కేవలం 135.08 స్ట్రైక్ రేట్‌తోనే పరుగులు చేశారు. ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 25.76 సగటుతో 335 పరుగులు చేసి రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ, అవి జట్టు విజయాలకు సరిపోలేదు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రహానే రికార్డులు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఆయన కెప్టెన్సీ వహించిన 27 మ్యాచ్‌లలో కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, 14 మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఆయన విన్నింగ్ పర్సంటేజ్ కేవలం 37.03 మాత్రమే ఉండటంతో.. కేకేఆర్

Eenadu02 Jun, 10:20 am
ఏకపక్ష మ్యాచ్ లతో ఐపీఎల్ ప్రభ తగ్గుతోందా

ఆర్థికంగా ప్రతి ఏడాదీ ఐపీఎల్ స్థాయి ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతోంది. ప్రస్తుతం ఈ క్రికెట్ లీగ్ విలువ రూ.లక్షన్నర కోట్ల పైమాటే! ప్రపంచంలో ఉన్న మిగతా క్రికెట్ లీగ్‌లన్నీ కలిపినా.. ఇంత విలువ చేయవంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్ రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉన్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఈ లీగ్ అంత ఆసక్తికరంగా సాగుతోందా? అభిమానులను అలరిస్తోందా? అంటే మాత్రం ఔనని సమాధానం చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఈ 2026 ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అనాసక్తికర సీజన్ అనదగ్గట్లుగా సాగింది. భారీ అంచనాలున్న పెద్ద జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. స్టార్ ఆటగాళ్ల మెరుపులు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఉత్కంఠభరిత మ్యాచ్‌లు సరిపడా లేక లీగ్ కళ తప్పింది. హోరాహోరీ సమరాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు పట్టుమని పది కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ టై అయి, సూపర్ ఓవర్‌కు మళ్లినా.. మ్యాచ్‌కు చప్పటి ముగింపే లభించింది. సూపర్ ఓవర్‌లో లఖ్‌నవూ ఒక్క పరుగే చేయడంతో కోల్‌కతా సునాయాసంగా గెలిచేసింది. ముంబయిపై బెంగళూరు చివరి బంతికి గెలిచిన మ్యాచ్ లాంటి కొన్ని మాత్రమే అభిమానులను అలరించాయి. ఐపీఎల్‌లో లీగ్ దశ అంతా ఒకెత్తయితే.. ప్లేఆఫ్స్ ఇంకో ఎత్తు. అవి ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగాలని అభిమానులు ఆశిస్తారు. కానీ ఈసారి ప్లేఆఫ్స్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఉత్కంఠ లేదు. నాలుగు మ్యాచ్‌లూ ఏకపక్షంగానే సాగాయి. క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ ఏకంగా 254 పరుగులు చేయడంతో ముందే మ్యాచ్ ఫలితం మీద ఒక అంచనా వచ్చేసింది. గుజరాత్ కనీస పోటీ ఇవ్వకుండా 162 పరుగులకే కుప్పకూలింది. ఎలిమినేటర్‌ మ్యాచ్ కూడా దాదాపు ఇలాగే సాగింది. రాజస్థాన్ రాయల్స్ 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 196కే పరిమితమైంది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ 214 పరుగులు చేయడంతో మ్యాచ్ పోటాపోటీగా ఉంటుందనుకుంటే.. గుజరాత్ 3 వికెట్లే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఫైనల్లో మొదట గుజరాత్‌ 155 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ మీద ఆసక్తి సన్నగిల్లింది. మరీ ఏకపక్షంగా కాకపోయినా.. బెంగళూరు సులువుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇలా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లన్నింట్లోనూ వార్ వన్ సైడ్ అయిపోయి ఐపీఎల్-19కు పేలవ ముగింపు దక్కింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లయిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేయడం ఈ సీజన్ మీద ఆసక్తిని బాగా తగ్గించింది. ముంబయి కేవలం నాలుగే విజయాలు సాధించింది. చాలా ముందే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది. చెన్నై ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. లీగ్‌ను పేలవంగా ఆరంభించి, మధ్యలో పుంజుకున్న చెన్నై, చివరికి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. ముంబయి జట్టులో సూపర్ స్టార్లయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ గాయంతో అయిదు మ్యా‌చ్‌లకు దూరమయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో చాలా వరకు ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బరిలోకి దిగాడు. 9 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలతో 283 పరుగులే చేశాడు హిట్ మ్యాన్. 360 డిగ్రీల్లో అదిరిపోయే షాట్లు ఆడే సూర్యకుమార్ 13 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలతో 270 పరుగులే చేశాడు. హార్దిక్ పాండ్య (206 పరుగులు, 4 వికెట్లు), బుమ్రా (4 వికెట్లు) సైతం అంచనాలను అందుకోలేకపోయారు. ఇక చెన్నై జట్టు తరఫున ఎం.ఎస్.ధోని అసలు బరిలోకే దిగకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లఖ్‌నవూ జట్టులో రిషబ్ పంత్ తేలిపోయాడు. దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాయి. పంజాబ్ ప్రథమార్ధంలో అదరగొట్టి, ద్వితీయార్ధంలో తుస్సుమనిపించింది. పెద్ద జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడితే.. సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. స్టార్ ఆటగాళ్లలో కోహ్లి, శుభ్‌మన్ గిల్ మాత్రమే అభిమానుల అంచనాలను అందుకున్నారు. 2026 ఐపీఎల్ పూర్తిగా కళ తప్పకుండా చూసిన ఘనత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే దక్కుతుంది. గత సీజన్లో 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి 35 బంతుల్లో శతకంతో ఔరా అనిపించిన వైభవ్.. తాను వన్ సీజన్ వండర్ కాదని రుజువు చేస్తూ, ఈ సీజన్‌లో ఉత్తమ బ్యాటర్‌గా అవతరించాడు. 776 పరుగులతో అతనే ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎంతో కీలకమైన చివరి రెండు మ్యాచ్‌ల్లో 97, 96 పరుగుల ఇన్నింగ్స్‌లతో అతను బ్యాటర్‌గా ఎన్నో మెట్లు ఎక్కేశాడు. వైభవ్ కోసమే లక్షల మంది స్టేడియాలకు వచ్చారు! అతడి కోసమే కోట్ల మంది టీవీలు, మొబైళ్లలో మ్యాచ్‌లు చూశారు. కోహ్లీ సహా సూపర్ స్టార్లను మించి ఈ సీజన్‌లో ఆకర్షణ సంపాదించి, ఐపీఎల్ అభిమానుల దృష్టినంతా తన వైపు తిప్పుకొన్న ఘనత వైభవ్ సొంతం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి

Delhi Capitals News Keyword | Telugu Digital