
Donald Trump | AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇక నుంచి ఆ పేరుతోనే పిలువాలంట..!
Donald Trump | AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇక నుంచి ఆ పేరుతోనే పిలువాలంట..!
© 2026 telugu.digital

Donald Trump | AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇక నుంచి ఆ పేరుతోనే పిలువాలంట..!

Donald Trump | కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడి సంతకం.. భారత్, చైనాలపై సుంకాలకు ట్రంప్‌కు ఫుల్ పవర్..!

Donald Trump | 'వాళ్ల నిఘా మాపై మా నిఘా వాళ్లపై'.. జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు ముందు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సహాయకురాలు నటాలీ హార్ప్ (Natalie Harp)ను ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉన్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ( వివాహానంతర వేడుకలకు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఉమర్ క్రెమ్లెవ్ ఆర్థిక సహాయం చేసినట్లు వచ్చిన నివేదికలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. పుతిన్‌తో సంబంధాలున్న వ్యక్తిగా పేర్కొంటున్న క్రెమ్లెవ్ బహామాస్‌లో జరిగిన ప్రైవేట్ ఐలాండ్ వేడుకలు, బాణసంచా వంటి ఏర్పాట్లకు భారీగా ఖర్చు చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. దీనిపై ట్రంప్ కుటుంబం వివరణ ఇవ్వగా, అమెరికా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది.

Donald Trump | హౌతీలపై దాడులు చేయండి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరిన సౌదీ రాజు

Donald Trump | రిపబ్లికన్లను గెలిపిస్తే ఒక్కొక్కరికి 4.75 లక్షలు.. అమెరికా వయోజనులకు ట్రంప్ ఉచిత హామీ

Donald Trump | రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి ఒక్కరికి రూ.4 లక్షలు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ

Donald Trump | అమెరికాలో మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్ యుద్ధాన్ని ఆపుతుంది : డొనాల్డ్ ట్రంప్

Trump Dollar Ccoins : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ ముఖం కనిపించే ఈ ఒక డాలర్ నాణెంను యూఎస్ మింట్ విక్రయానికి ఉంచింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత జీవించి ఉన్న అమెరికా అధ్యక్షుడి చిత్రం దేశ కరెన్సీపై కనిపించడం ఇదే తొలిసారి. కొత్త నాణెంపై ట్రంప్ ముఖచిత్రంతో పాటు లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్ చేశారు. దీనిని ఈ ఏడాది యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆమోదం తెలియజేసింది. ఈ కమిషన్ సభ్యులను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నియమించారు. గంటల్లోనే స్టాక్ ఖాళీ.. ఈ ఒక డాలర్ నాణేలు భారీ ధరకు విక్రయానికి ఉంచారు. 25 నాణేలున్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.5,500)గా, 100 నాణేలున్న ఒక బ్యాగ్ ధర 154.50 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.14,000)గా నిర్ణయించారు. అయితే అమ్మకాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే యూఎస్ మింట్ వెబ్సైట్లో ఈ నాణేలు ప్రస్తుతం స్టాక్‌లో లేవు అని కనిపించింది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ మింట్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన వెండింగ్ మెషీన్ల ద్వారా కూడా ఈ నాణేలను విక్రయిస్తున్నారు. నాణెంలో బంగారం లేదు.. ఇదిలాఉంటే.. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ నాణెం బంగారు రంగులో కనిపించినప్పటికీ ఇందులో అసలు బంగారం లేదని యూఎస్ మింట్ తెలిపింది. నాణెంలో 88.5 శాతం రాగి ఉండగా, మిగిలిన భాగంలో జింక్, మాంగనీస్, నికెల్ వంటి లోహాలను ఉపయోగించారు. ఇదిలా ఉండగా, ట్రంప్ చిత్రాన్ని అమెరికా నోటుపై ముద్రించే అంశం కూడా గతంలో చర్చకు వచ్చింది. మే నెలలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్.. ట్రంప్ చిత్రంతో కూడిన కొత్త 250డాలర్ల నోటును

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ప్రారంభించిన యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని చాలా సులువుగా మొదలుపెట్టిన ట్రంప్.. ఎలా ముగించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అటు ఇరాన్ మాత్రం దృఢంగా బదులిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికన్లు ఇరాన్ యుద్దంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ (donald trump) సతమతం అవుతున్నారు.US-Iran War: అమెరికా దాడి- ఇరాన్ ప్రతి దాడులు- మళ్లీ మొదలైన వార్..!ఎన్నికల తరుణంలో ఈ యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవాలని ట్రంప్ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇరాన్ వార్ వల్ల వల్ల ఓటర్లలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో నష్టపోకుండా చూసుకోవాలని ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న సుదీర్ఘ యుద్దంపై అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన ఒక పోలింగ్ విశ్లేషణ ప్రకారం కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధాన్ని సమర్థిస్తుండగా, 63 శాతం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పెరిగిన పెట్రోలు ధరలు కూడా ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెనేట్, ప్రతినిధుల సభలో తమ స్వల్ప మెజారిటీని కాపాడుకోవాలని చూస్తున్న రిపబ్లికన్లకు ఈ వార్ పెద్ద సవాలుగా మారింది.ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక చర్యల కంటే ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడమే మేలని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా భవిష్యత్తులో జరిగే చర్చల సమయానికి ఇరాన్‌పై బలమైన ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వంటి కీలక నేతలు కూడా ఎన్నికలు ముగిసే వరకు ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలను సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచడానికే మొగ్గు చూపుతున్నారు.H-4

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్‌పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు. అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’ ఆరు

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పోటీచేసే అవకాశాలపై మాట్లాడిన అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఆ విషయమై ఇప్పుడే చర్చ అక్కర్లేదని సమాధానాన్ని దాటవేశారు. 'హెగ్సెత్ అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుంది. ముందుగా నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలను పూర్తి చేయాలి' అని ట్రంప్ అన్నారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే అవకాశమున్న ట్రంప్.. 2029లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆయన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఉద్యమాన్ని ముందుకు నడిపించే తదుపరి నేత ఎవరన్న దానిపై రిపబ్లికన్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నా.. తాజాగా ఆ లిస్ట్‌లో హెగ్సెత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఐయోవా స్టేట్ ఫెయిర్‌లో రిపబ్లికన్ల తరఫున హెగ్సెత్ ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది. అయితే ఈ వార్తలను హెగ్సెత్ ఖండించారు. అవి '100 శాతం అవాస్తవం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారాయన. హెగ్సెత్ గతంలో ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ ఛానల్లో టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ భవితవ్యంపై ట్రంప్ మరింత ఆసక్తికరంగా స్పందించారు. 'ప్రస్తుతం ఆయనకు సైన్యం, సైనికుల సంక్షేమం తప్ప మరేదీ ముఖ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు 2028 అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు నేతలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేరు మార్పునకు సంబంధించిన వార్తల్లో నిలిచారు. యూఎస్, కెనడా మధ్య ఉన్న లేక్ ఒంటారియో పేరును మ్యాప్స్‌లో 'లేక్ అమెరికా'గా మార్చాలని ట్రంప్ యాపిల్‌ను కోరినట్లు ఆయన ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల అధిపతి డగ్ బర్గుమ్ ఫాక్స్ తెలిపారు. లేక్ అమెరికా మార్నింగ్స్ విత్ మరియా కార్యక్రమంలో డగ్ బర్గుమ్ ఫాక్స్ మాట్లాడుతూ, ట్రంప్ నేరుగా యాపిల్‌ను సంప్రదించారని, త్వరలోనే వారి ప్లాట్ఫామ్లో లేక్ అమెరికా పేరు కనిపిస్తుందని నమ్మకం తనకు ఉందని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై.. యాపిల్ స్పందించలేదు. ప్రస్తుతం యాపిల్ మ్యాప్స్‌లో లేక్ ఒంటారియా పేరు కనిపిస్తోంది. కానీ గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే అమెరికాలోని యూజర్లకు ఈ సరస్సును లేక్ అమెరికాగా చూపించడం ప్రారంభించింది. కెనడాలో ఉన్నవారికి లేక్ ఒంటారియోగా చూపిస్తోంది. దేశాలను బట్టి వేర్వేరు పేర్లు ఉన్నప్పుడు ఇదే విధానాన్ని తాము పాటిస్తున్నామని గూగుల్ తెలిపింది. ట్రంప్ చర్యపై విమర్శ డొనాల్డ్ ట్రంప్ లేక్ ఒంటారియో పేరును యూఎస్ జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో మార్చాలని ఆదేశించారు. దీనిపై కెనడా తన వ్యతిరేకతను చూపింది. న్యూయార్క్‌లోని సెనెకా నేషన్ నాయకుడు కూడా ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ, పేరు మార్పు అనేది ఒంటారియో సరస్సుకు ఆ పేరును ఇచ్చిన ఆదిమవాసుల పట్ల గౌరవం చూపించకపోవడం అని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ట్రంప్ తన దేశంలో లేక్ ఒంటారియో పేరును మార్చాలని ఆదేశించవచ్చు. కానీ కెనడాలో కూడా పేరును మార్చాలని ఆదేశించలేరు. అమెరికా, కెనడా మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల సమయంలో పేరు మార్పు వ్యవహారం వెలుగులోకి రావడం మరింత చర్చకు దారితీసింది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ పేర్లను మార్చడానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని యాపిల్, గూగుల్ సంస్థలను ఆదేశించారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Donald Trump New New Decisions: డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం మనలాంటి వర్ధమాన దేశాలకు బాధ కలిగిస్తున్న ఆ దేశ పౌరులకు మాత్రం ఆయనలో ఓ దేవుడుని చూస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు పొలో మంటూ అమెరికాకు క్యూ కట్టకుండా కట్టడి చేస్తున్నాడని అనుకుంటున్నారు. మొత్తంగా అమెరికా ప్రపంచ దేశాల్లో సంపన్న దేశంగా విరాజిల్లుతుంది. ఆదేశానికి అధ్యక్షుడు కావడంతో అగ్రరాజ్యానికి అధినేతగా రాణిస్తున్నాడు ట్రంప్. చేతిలో అధికారం ఉందని ఆయన ఏంచేయాలనుకుంటే అదే చేస్తాడు. ఎవడిమాటా వినడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ అగ్రరాజ్యధినేతకు ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఆయనను సపోర్ట్ చేసేవారు. H-1B వీసా ఫీజులు రికార్డు స్థాయికి.. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైనపుడు… కామెడీ పీస్ అనుకున్నారు. తొలిదశలో ఆయన ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే చర్యలకు దూరంగా ఉన్నారు. 2017లో పదవిలోకి వచ్చిన వెంటనే కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ప్రయాణ నిషేధాలు విధించారు. ఐటీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు గట్టి షాక్ ఇస్తూ, H-1B వీసా ఫీజులను రికార్డు స్థాయికి పెంచాలని ప్రతిపాదించారు. అక్రమ వలసదారులను అమెరికానుంచి పంపించి వేయడానికి, సరిహద్దుల వద్ద కఠిన చర్యల కోసం భారీ నిధులను కేటాయించారు. రిపబ్లికన్ పార్టీ నేతగా ప్రజా మద్ధతుతో రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చరిత్రను సృష్టించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించారు. వలస విధానంపై సంచలన నిర్ణయం

అమెరికా, ఇరాన్‌ల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు రగులుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంటల్లో ఆజ్యం పోశాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) అమెరికా భూభాగంగా అభివర్ణించిన ట్రంప్, ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని తయారు చేయకూడదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.సౌత్ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చలకు తమకేమీ తొందరలేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి నేను అమెరికా సొంత భూభాగంగానే భావిస్తున్నాను. ఆ ప్రాంతంపై , అక్కడ ఉన్న దిగ్బంధనంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది అని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అయితే అమెరికాకు ఆమోదయోగ్యమైన షరతులకు ఆ దేశం ఇంకా సిద్ధంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించిన ఒక ఏఐ (AI) చిత్రాన్ని కూడా తన ట్రూత్ సోషల్ ఖాతాలో పంచుకున్నారు. ఆ పని చేస్తే నష్టపోతారు: ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్!చమురు రవాణాకు జీవనాడి వంటి ప్రాంతంప్రపంచ ఇంధన సరఫరాలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్లో దాదాపు ఐదవ వంతు ఈ సరుకుల మార్గం గుండానే వెళుతుంది. అలాంటి వ్యూహాత్మక ప్రాంతంపై తమకు పూర్తి ఆధిక్యం ఉందని అమెరికా క్లెయిమ్ చేయడం అంతర్జాతీయ రాజకీయంలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు , సైనిక ఒత్తిడిని మరింత పెంచే వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికాలో భాగంగానే హర్మూజ్ జలసంధి.. సంచలన ఫొటో షేర్ చేసిన ట్రంప్ట్రంప్కు భ్రమలు ఎక్కువ: తిప్పికొట్టిన ఇరాన్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికాతో వాణిజ్య చర్చలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిపివేశారు. చివరి దశ చర్చల్లో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అన్యాయంగా, ఆర్థికంగా నష్టదాయకంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కెనడా నుంచి వచ్చే సుమారు 2,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించేందుకు అమెరికా సిద్ధమైంది.అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. కెనడాకు ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు అమెరికా ముందుకొచ్చిందన్నారు. అయితే కెనడా చివరి నిమిషంలో కొత్త డిమాండ్లు చేయడంతో పాటు గతంలో ఇచ్చిన కొన్ని హామీల నుంచి వెనక్కి తగ్గిందని ఆరోపించారు.కెనడా ప్రధాని కార్నీ మాత్రం అమెరికా చివరి నిమిషంలో మార్చిన నిబంధనలు న్యాయబద్ధంగా లేవని అన్నారు. వాటితో ఆర్థికంగా నష్టమేనని పేర్కొన్నారు. కెనడా కార్మికులు, వ్యాపారాలకు అదనపు మద్దతు ప్రకటించనున్నట్లు తెలిపారు.అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్‌లు కెనడా నుంచి అమెరికాకు ఏటా వెళ్లే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 5 శాతాన్ని ప్రభావితం చేయనున్నాయి. హాకీ స్టిక్స్ నుంచి వైద్య పరికరాల వరకు పలు ఉత్పత్తులపై ఈ ప్రభావం పడనుంది.చర్చలు కొనసాగేందుకు ట్రంప్ టారిఫ్ గడువును మూడు రోజులు పొడిగించినా ఒప్పందం కుదరలేదు. గత ఏడాది అమెరికా-కెనడా మధ్య వస్తువులు, సేవల వాణిజ్యం 880 బిలియన్ డాలర్లకు చేరింది. కెనడా ఎగుమతుల్లో దాదాపు 72 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ సన్నిహిత

ఇంటర్నెట్‌డెస్క్: వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump)తో కెనడా జరుపుతోన్న వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించడంతో చర్చలు (Canada Trade Talks) నిలిచిపోయాయి. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకునే 20 బిలియన్ల విలువైన వస్తువులపై 50 శాతం సుంకాలు విధించనున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. కెనడా ప్రతి ఏడాది ఆ దేశానికి ఎగుమతి చేసే సుమారు 5 శాతం వస్తువులపై ఇవి ప్రభావం చూపుతాయి. వీటన్నింటికీ సిద్ధమైన కెనడా.. చర్చల నుంచి వైదొలిగింది. ‘ఈ వారం ప్రారంభంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించింది. మా మార్కెట్లోకి వస్తువులను ఎగుమతి చేసే దేశాలన్నింటిలోనూ.. కెనడాకు అత్యుత్తమ ప్రాధాన్యత ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ వారు అంగీకరించలేదు. వారు కొత్త డిమాండ్లు లేవనెత్తడంతోపాటు మా నిబంధనల నుంచి వెనక్కి తగ్గడం వల్ల చర్చలు దెబ్బతిన్నాయి’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు. అమెరికా ప్రకటనపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) స్పందిస్తూ.. అగ్రరాజ్యం ప్రతిపాదించిన నిబంధనలలో చివరి నిమిషంలో చేసిన మార్పులు ఆర్థికంగా భారంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము కూడా అదే స్థాయిలో ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటినుంచే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ (Donald Trump) డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని కెనడా సర్కారు ఖండిస్తూ వస్తోంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశంపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్‌లు విధిస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో గరిష్ఠంగా 4.8 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో 24.5 శాతం లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌లను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడం బిట్‌కాయిన్ జోరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో దీర్ఘకాలిక బాండ్ రాబడులు తగ్గాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది.బిట్‌కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి తీసుకున్న భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీంతో క్రిప్టో ధర మరింత వేగంగా పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా మే తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 13 ఈటీఎఫ్‌ల్లోకి ఈ వారం ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.2025 అక్టోబర్‌లో బిట్‌కాయిన్ దాదాపు 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 80 వేల డాలర్లకు చేరువగా దూసుకెళుతోంది

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. అయితే, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదన్నారు. శుక్రవారం నాడు దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌కు బయలుదేరే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. 'ఇరాన్ వద్ద డబ్బు లేదు. వారికి నౌకాదళం, వైమానిక దళం లేదు. ఇరాన్ తన సైనికులు, పోలీసులకూ జీతాలు చెల్లించడం లేదు. అక్కడ 350 శాతం ద్రవ్యోల్బణం ఉంది. హోర్ముజ్ జలసంధి మొత్తం ప్రాంతంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఇరుదేశాల మధ్య ఒప్పందానికి ఇరాన్ ఆసక్తిగా ఉంది. అయితే వాషింగ్టన్ కోరిన షరతులను ఇంకా అంగీకరించ లేదు. నా అభిప్రాయంలో సరైన ఒప్పందం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యలను ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్ చమురు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, ఆర్థిక బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలతో సహా ఆ దేశ ఆర్థిక జీవనాధారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌కు ఆర్థిక, వ్యాపార, ఇతర మార్గాల్లో ప్రభుత్వ మద్దతు అందిస్తున్న దేశాలు భారీ ఆర్థిక పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే, ఇరాన్‌ను ఏకాకిని చేసి ఓడించడానికి మిత్రదేశాలన్నీ అమెరికాకు అండగా నిలబడాలని కోరారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్

అమెరికాతో నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఇరాన్ పిలుపునిచ్చింది. తాము శక్తిమంతమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధాన్ని ముగించడం మేలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం వైద్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. "మనం శక్తిమంతంగా, గౌరవంగా ఉన్న ఈ సమయంలోనే యుద్ధానికి ముగింపు పలకడం ఉత్తమం" అని పెజెష్కియాన్ అన్నారు. ఈ పోరాటంలో ఇరాన్ విజయం సాధించిందని ప్రపంచం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి అమెరికా పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులు చేస్తోందని, అందుకే ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల ద్వేషం పెరిగిపోయిందని ఆరోపించారు.ఈ ఏడాది ఆరంభంలో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ప్రారంభమైన ఈ సంఘర్షణ, ప్రస్తుతం ప్రతిష్ఠంభనలో కొనసాగుతోంది. హర్మూజ్ జలసంధిలో ఇబ్బందులు, అమెరికా నౌకాదళ దిగ్బంధనం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు, వాషింగ్టన్ ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేస్తూ కొత్త ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.జూన్‌లో అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంలో ఇరాన్ లొంగిపోయినట్లు ఎలాంటి నిబంధనలు లేవని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులకు తలొగ్గేది లేదని, అవసరమైతే గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక ఒత్తిళ్లు, అంతర్జాతీయంగా ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో, శక్తిమంతమైన స్థితి నుంచే తాము శాంతి చర్చలకు సిద్ధమనే సంకేతాలు పంపేందుకే టెహ్రాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు