translateexpand_more

Donald Trump News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 09:34 am
ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే

Trump – Netanyahu : లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్‌తో జరుగుతున్న సున్నితమైన చర్చలకు ఈ సంఘర్షణ ఆటంకం కలిగించకుండా వాషింగ్టన్ నివారించేందుకు ప్రయత్నిస్తోంది. Also Read : Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఆ పరికరాల తయారీ రంగానికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ధరలు బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు ఆదేశించండం, దక్షిణ లెబనాన్‌లో భూతల కార్యకలాపాలను విస్తరించడం వంటి చర్యల తరువాత ఈ అసాధారణ ఘర్షణ చోటు చేసుకుంది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులుచేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని, ఇరాన్ తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నీకు పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. దీనికారణంగా అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అంటూ ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఇరాన్ విషయంలో ఇన్నాళ్లూ ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు భిన్న దిశల్లో పయణిస్తున్నట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గుతుందా.. లేదంటే ట్రంప్ ను ధిక్కరించి తన వ్యూహాన్ని అమలు చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Eenadu02 Jun, 03:19 am
నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి.. నెతన్యాహుపై ట్రంప్ ఫైర్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్‌ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్‌ (Iran) బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు (Benjamin Netanyahu)తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. టెల్‌అవీవ్‌ చర్యలు.. ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారనేది ఆ మీడియా కథనాల సారాంశం. ‘నువ్వు పిచ్చివాడివి. నేను లేకుంటే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్‌ను కూడా ఇష్టపడటం లేదు’ అని నెతన్యాహుపై ట్రంప్‌ మండిపడినట్లు అవి పేర్కొన్నాయి. అదే సమయంలో ‘అసలు నువ్వు ఏం చేస్తున్నావు..?’ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధానిపై ట్రంప్‌ గట్టిగా అరిచినట్లు వెల్లడించాయి. ఈ సందర్భంగా నెతన్యాహు నిర్ణయాలను కూడా ప్రశ్నించారని పేర్కొన్నాయి. ఆయన నిర్ణయాలతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్నాయని, ఇజ్రాయెల్‌ (Israel) ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపాయి. ఒక హెజ్‌బొల్లా (Hezbollah) కమాండర్‌ను హతమార్చేందుకు టెల్‌అవీవ్‌ చేస్తున్న సైనిక చర్యల్లో అనేకమంది లెబనీస్‌ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించాయి. ఇక, నెతన్యాహుతో సానుకూలమైన సంభాషణ జరిగిందని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. బీరుట్‌ వైపు ఇజ్రాయెల్‌ దళాలు వెళ్లవని హామీ ఇచ్చారు. ఈమేరకు హెజ్‌బొల్లా నాయకులతోను మాట్లాడినట్లు ట్రంప్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌పై సైనిక కాల్పులను ఆపేందుకు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ కూడా వారిపై కాల్పులకు దూరంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, నెతన్యాహు ప్రకటన ఇందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్‌ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగితే హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌నకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu02 Jun, 03:01 am
పరికరాల తయారీ రంగానికి శుభవార్త

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యవసాయం, పరిశ్రమల్లో వాడే ఉపకరణాల దిగుమతుల విషయంలో అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్‌ (Trump) కొంత మెత్తబడ్డారు. వాటిపై విధించిన టారిఫ్‌లను 25% నుంచి 15%కు తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే ఏడాది చివరివరకు ఉండనుంది. దీంతో హార్వెస్టర్ల వంటి యంత్రాలు, ఇతర పరికరాలకు వర్తించనుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడికి అండగా ఉండేందుకు.. ఉత్పత్తిదారుల వ్యయాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ట్రంప్‌ కార్యవర్గం పేర్కొంది. దీంతోపాటు తాజాగా సుంకం తగ్గింపు వర్తించే పరికరాల పరిధిని కూడా గణనీయంగా పెంచింది. పారిశ్రామిక రంగంలో వాడే బుల్‌డోజర్లు, ఫోర్క్‌ లిఫ్ట్‌లు వంటి వాటి దిగుమతులు మరింత చౌక కానున్నాయి. అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్న దేశాలకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. తమ దేశ లోహరంగంలో ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అమెరికా మరో తాయిలాన్ని ప్రకటించింది. విదేశీ తయారీ సంస్థలు ఏవైనా మూలధన పరికరాలను దిగుమతి చేసుకొంటే.. వాటి బరువులో 85% అమెరికా నుంచి దిగుమతి చేసుకొన్న స్టీల్‌, అల్యూమినియం వంటివి వినియోగిస్తే.. 10% సుంకం మాత్రమే వర్తిస్తుంది. ఈ తగ్గింపులు మొత్తం డిసెంబర్‌ 2027 వరకు కొనసాగుతాయని శ్వేతసౌధం వెల్లడించింది. అమెరికా పారిశ్రామిక రంగం పునర్‌ నిర్మాణానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. అమెరికా జాతీయ భద్రత కోసం అధ్యక్షుడు విదేశాల నుంచి అల్యూమినియం, స్టీల్‌, కాపర్‌ దిగుమతిపై టారిఫ్‌లు విధించినట్లు వివరణ ఇచ్చింది. అమెరికా పరిశ్రమలు, వ్యాపారులను విదేశీ చౌకబారు దిగుమతుల నుంచి కాపాడటానికి చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించింది. భారత్ నుంచి మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీఏఎఫ్‌ఈ, శక్తిమాన్‌, ఫీల్డ్‌కింగ్‌, జైన్‌ ఇరిగేషన్‌ వంటి సంస్థలు అమెరికాకు వ్యవసాయ పరికరాలను ఎగుమతి చేస్తాయి. ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారత పరిశ్రమలకు కొంతమేరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Andhra Jyothy02 Jun, 01:49 am
ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్ తో చర్చలు సానుకూలం

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు శాశ్వతంగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగిపోవడంతో శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు (Israel Hezbollah ceasefire).

'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చాలా మంచి సంభాషణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి (Israel Lebanon conflict).

కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో దాడులు, రాకెట్ ప్రయోగాల వార్తలు వెలువడ్డాయి (Lebanon conflict). దీంతో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Sakshi02 Jun, 01:26 am
నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్‌కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. బీరూట్‌పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు. నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదు అయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి. యుద్ధం తాజా పరిస్థితి ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్‌పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ చర్చలకు బ్రేక్? లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్‌గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు. వాషింగ్టన్-టెల్‌అవీవ్ మధ్య విభేదాలా? ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా..