
99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. జూన్ 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్, జూన్ 2: 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు ఈరోజు(మంగళవారం) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జూన్ 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభల్లో పంటల వైవిధ్యీకరణపై రైతులకు సూచనలు చేయాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నీటి నిల్వల నివారణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎస్‌హెచ్‌జీ(SHG) సభ్యుల భాగస్వామ్యంతో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు సూచనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్ గౌడ్ 2028 డిసెంబర్లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్