translateexpand_more

Telangana Government News

Latest updates from Telugu Digital news sources.

AP7AM30 May, 11:28 am
బాల్క సుమన్ పై పీడీ యాక్ట్ పెట్టాలి

సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ పరిణామంపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్క సుమన్ అరెస్ట్ కావడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని, దీని వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర దాగి ఉందని వెంకట్ ఆరోపించారు. "మీకు కోపం ఉంటే మాపై దాడి చేయండి, కానీ సామాన్య పేద ప్రజలు ప్రయాణించే రైళ్లపై మీకెందుకు అంత అక్కసు? మీకు ఓట్లేయలేదనే కక్షతోనే పేదలపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ ఒక్కొక్కరికి ఒక్కో వివాదాస్పద బాధ్యత అప్పగించారని.. సుమన్‌కు రైలు పట్టాలు కోసే శాఖ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని, సుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు.

NTV Telugu01 Jun, 05:08 pm
వాహనదారులకు అలర్ట్ .. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక

Telangana Traffic Challans: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరేలా రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై చలాన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకోడానికి వాహనదారులు తమ వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని స్పష్టం చేసింది. రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. వాహనదారులు ఈ గడువులోగా తమ వివరాలను vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాఫిక్ చలాన్లు, ఇతర రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు మరియు ఈ-మెయిల్ ద్వారా నేరుగా వాహన యజమానులకు పంపించనున్నారు. దీంతో చలాన్ల విషయంలో పారదర్శకత పెరగడమే కాకుండా, పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపిన సమాచారం సంబంధిత వాహన యజమానికి చేరినట్లుగానే ప్రభుత్వం పరిగణించనుంది. ఈ నేపథ్యంలో "మాకు చలాన్ సమాచారం రాలేదు", "మెసేజ్ అందలేదు", "విషయం తెలియదు" వంటి కారణాలను ఇకపై అధికారులు అంగీకరించబోరని స్పష్టం చేశారు. వాహనదారులు తమ వివరాలను సకాలంలో నవీకరించుకోవడం ద్వారా చలాన్ల సమాచారం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చెల్లింపులను కూడా సకాలంలో పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. అందువల్ల అన్ని వాహన యజమానులు నిర్దేశిత గడువులోగా వాహన్ పోర్టల్‌లో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ సూచించింది. ఈ కొత్త విధానం ద్వారా చలాన్ల వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. దీంతో భవిష్యత్తులో చలాన్లకు సంబంధించిన వివాదాలు, అపోహలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

NTV Telugu01 Jun, 04:32 pm
పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ

Janasena: హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న జనసేన పార్టీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభకు అనుమతి ఇవ్వకపోవడానికి పోలీసులు చూపిన కారణాలు సమంజసంగా లేవని, అవి కేవలం సాకుల్లా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు విమర్శించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొనడాన్ని జనసేన ప్రశ్నించింది. ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు, వాటికి ఇచ్చిన సమాధానాలు ఎలా లా అండ్ ఆర్డర్ సమస్యగా మారతాయని పార్టీ నేతలు ప్రశ్నించారు. అసలు ప్రాంతీయ భావోద్వేగాలను చర్చలోకి తీసుకువచ్చింది ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సభ నిర్వహించాలనుకున్న జనసేనపై మాత్రమే ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని పార్టీ అభిప్రాయపడింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సెలెక్టివ్ నేరేటివ్స్, హాఫ్ కట్ వీడియోలను ప్రచారం చేస్తూ ముందుగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. అలాగే, కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విరాళం అందించినప్పుడు ప్రాంతీయత గుర్తుకు రాలేదా అని పార్టీ ప్రశ్నించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సభ నిర్వహించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాంతీయ భావోద్వేగాల అంశాన్ని ముందుకు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీసింది.

10TV Telugu30 May, 05:56 am
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5వేల పోస్టుల భర్తీకి సర్కార్ నిర్ణయం

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా దాదాపు 5వేల పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పోలీసు శాఖ నుంచి ఆర్థికశాఖకు చేరినట్లు సమాచారం. Also Read : Indiramma Illu : రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యత వారికే.. క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ పోలీసుశాఖలో 19వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దశల వారీగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ముందుగా 5వేల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మిగిలిన 14వేల ఖాళీలను ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోలీసుశాఖలో ఇటీవల ప్రతి ఏడాది సుమారు 2వేల మందికిపైగా వివిధ హోదాల్లోని పోలీసులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం అధికమవుతోంది. ఈ క్రమంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి చేపట్టబోయే పోలీసు రిక్రూట్మెంట్ లో ఎంపికైన వారిలో అత్యధికులను దేశానికి సవాలుగా మారిన సైబర్ నేరాలు, మత్తు మందుల కట్టడికి సంబంధించిన విభాగాల్లో వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Vaartha30 May, 06:51 pm
మహిళా శక్తి సూపర్ మార్కెట్లు

Mahila Shakti Super Markets; మహబూబ్‌నగర్, మే 30: మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ప్రతి నియోజకవర్గంలో “మహిళా శక్తి సూపర్ మార్కెట్లు” ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములుగా, షేర్‌హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగరంలోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం కలుగుతుందని ఆయన చెప్పారు. మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. Mahila Shakti Super Markets: ఈ కార్యక్రమంలో

Vaartha30 May, 06:20 pm
మహాలక్ష్మి కార్డు ఫేక్

Mahalaxmi Smart Card Telangana: హైదరాబాద్: సోషల్ మీడియాలో మహాలక్ష్మి పథకం స్మార్ట్ కార్డులపై జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెలంగాణ ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసింది. జూన్ 2వ తేదీ నుండి రూ. 50 ల రుసుముతో ఈ పథకానికి ప్రత్యేక స్మార్ట్ కార్డ్‌లు జారీ చేస్తారంటూ చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అయితే, భవిష్యత్తులో రాబోయే ఒకే ఒక్క మల్టీ-పర్పస్ కార్డ్‌తోనే ఈ సేవలు అందనున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘ఇంటిగ్రేటెడ్ కార్డ్స్’ లోనే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచనుంది. ఈ ఇంటిగ్రేటెడ్ కార్డ్ అనేది ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, సేవలను ఒకే గొడుగు కిందికి తెచ్చే సరికొత్త విధానం. భవిష్యత్తులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి వేరే ఏ ఇతర ప్రత్యేక కార్డులు అవసరం లేకుండా, ఈ ఒక్క ‘ఇంటిగ్రేటెడ్ కార్డ్’ ద్వారానే ప్రయాణించే అద్భుత సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ చిత్రం ప్రభుత్వ అధికారిక డిజైన్ కాదు. అది కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా ఎవరో సృష్టించిన నమూనా మాత్రమే. ఈ కార్డుల జారీ ప్రక్రియ, వాటి విధివిధానాలు, ప్రారంభ తేదీ లేదా దానికి అయ్యే ఖర్చుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు మరియు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త కార్డుల(Mahalaxmi Smart Card Telangana) జారీ ప్రక్రియ మరియు విధివిధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు మహిళలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం మహిళలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా

Andhra Jyothy30 May, 01:40 pm
రైతు ముసుగులో కేసీఆర్ రాజకీయం

రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సవాల్‌కు బీఆర్ఎస్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్, మే 30: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేసినా, మోటార్లకు మీటర్లు పెట్టినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఈ సవాల్‌కు బీఆర్ఎస్ సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటుతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర (MSP) ప్రకటించి వదిలేసిందే తప్ప ఒక్క గింజ కూడా కొనడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను తమ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తోందని, ఇప్పటివరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పిస్తున్నామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ నేతలు ఢిల్లీకి బస్సులు వేసుకుని వెళ్తే, తాము వారి ఇళ్ల ముందుకే ట్రాక్టర్లతో వడ్లు తెచ్చి పోస్తామని ఆయన హెచ్చరించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధాని మోదీ మాటలు చెబుతున్నా, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆక్షేపించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీదేనని ఆరోపించిన సీఎం, హరీష్ రావు ఇదులకుంట చెరువు అక్రమాలపై

Andhra Jyothy23 May, 03:10 pm
హెచ్ఐఎల్‌టీపీ విధివిధానాలు విడుదల చేసిన మంత్రి శ్రీధర్ బాబు

- Home » Telangana » Hyderabad » Telangana HILTP Policy Clears Transformation Of Industrial Lands Around Hyderabad ORR suri ABN , Publish Date - May 23 , 2026 | 08:40 PM హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప... - రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్‌టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. - ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Samayam Telugu27 May, 01:42 am
చేయూత పెన్షన్ల పంపిణీ విధానం మార్పు.. ఐఏఎస్ అధికారుల తరహాలోనే పంచాయతీ సిబ్బందికీ, సీఎం కీలక నిర్ణయం

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2022లో సమయంలో చేరిన సందీప్ పూల.. గత నాలుగేళ్లుగా ఏపీ, తెలంగాణ వార్తలు, విశ్లేషణలతో కూడిన న్యూస్ రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను సందీప్ పూల ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఆకట్టుకునే కథనాలు రాసినందుకు గానూ 2025 మార్చిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. సందీప్ పూల ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్‌లో నాలుగేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కుటుంబం, ప్రకృతితో గడపటానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Andhra Jyothy27 May, 04:05 pm
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, మే 27: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు కూడా పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను, వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వర్షానికి తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుత రబీలో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రంలోని 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, ఇందుకుగాను రూ. 10,097 కోట్ల చెల్లింపులను కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొనుగోలు

10TV Telugu27 May, 03:15 am
విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ ఊరట.. పుస్తకాల ధరలు భారీగా తగ్గాయ్.. ప్రస్తుతం ధరలివే

Textbooks Prices : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా విద్యార్థుల త్లలిదండ్రులకు భారీ శుభవార్త చెప్పింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు, పుస్తకాల భారంతో సతమతమవుతున్న పేరెంట్స్‌కు సర్కార్ ఊరటనిచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ పాఠ్య పుస్తకాల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో పుస్తకంపై సుమారు 15 నుంచి 20శాతం మేర ధరలను తగ్గించింది. Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి అదిరిపోయే శుభవార్త.. రాష్ట్రంలో 11వేల వరకూ ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. వాటిలో 38లక్షల మంది చదువుతున్నారు. అయితే, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన సిలబస్ పుస్తకాలు, ప్రభుత్వం ప్రింట్ చేసిన పుస్తకాలనే విద్యార్థులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో తాజాగా.. ప్రభుత్వం పుస్తకాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలిగించే అంశం. పుస్తకాల ధరలు తగ్గించిన క్వాలిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో గతంకంటే మెరుగైన క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికిగాను పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గింది. తరగతుల వారీగా గతేడాదితో తగ్గిన పుస్తకాల ధరలను పరిశీలిస్తే.. ♦ 10వ తరగతి సెట్ ధర గతేడాది రూ.1,078 కాగా.. ప్రస్తుతం రూ.900కు తగ్గింది. ♦ 9వ తరగతి సెట్ ధర గతేడాది రూ.927 కాగా.. .ప్రస్తుతం రూ.776కు తగ్గింది. ♦ 8వ తరగతి సెట్ ధర గతేడాది రూ.825 కాగా.. .ప్రస్తుతం రూ.690కు తగ్గింది. ♦ 7వ తరగతి సెట్ ధర గతేడాది రూ.654

Andhra Jyothy24 May, 06:58 am
జొన్న, మెుక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్..

- Home » Telangana » Hyderabad » Telangana government allocates 1800 crore more for maize procurement farmer relief suri ABN , Publish Date - May 24 , 2026 | 12:28 PM తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. - జొన్న, మెుక్కజొన్న కొనుగోళ్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. - ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

10TV Telugu26 May, 07:28 am
ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.5లక్షలు ఉచిత బీమా.. అర్హులు వీరే.. అమల్లోకి ఎప్పటి నుంచంటే?

Indiramma Bheema Scheme : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అన్నివిధాలుగా అండగా నిలిచేందుకు తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే, జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున మరికొన్ని కొత్త పథకాలను రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. వీటిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. Also Read : Degree Students : డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. నెలకు రూ.7వేలు.. ఆ తరువాత ఉద్యోగ అవకాశం కూడా..! తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ఠ ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్యవ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది. ఈ పథకంలో నమోదైన ఏ కుటుంబంలోనైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ప్రాణనష్టం సంభవిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం బీమా రూపంలో అందుతుంది. సాధారణంగా బీమా పాలసీలకు ప్రతీయేటా వేల రూపాయల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఇందిరమ్మ బీమా పథకానికి అయ్యే పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే పేద ప్రజల నుంచి పట్టణాల్లోని పేద వర్గాల వరకు ఒకేసారి ఈ స్కీమ్ వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకంకు సంబంధించిన లబ్ధిదారుల

10TV Telugu24 May, 11:02 am
Heatstroke Aid: వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం.. దరఖాస్తు ప్రక్రియ, కావాల్సిన పత్రాలు ఇవే..

- Heatstroke Aid: వడదెబ్బతో చనిపోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. - బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. - మరి ఈ పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Andhra Jyothy28 May, 05:55 am
ఫ్యూచర్ సిటీలో నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ మంత్రులు

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్‌సీడీఏ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. హైదరాబాద్, మే 28: ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు(గురువారం) ఫ్యూచర్ సిటీలో ఎఫ్‌సీడీఏ(FCDA) కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ పనులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులపై మార్గనిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శ్రీధర్ బాబు, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవడం ఖాయమని మంత్రులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

Andhra Jyothy23 May, 01:09 pm
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

- Home » Telangana » Hyderabad » Telangana Cabinet Approves Midday Meals In Junior Colleges And Funds For Godavari Pushkaralu suri ABN , Publish Date - May 23 , 2026 | 06:39 PM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క... - రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలి చర్చించింది. - ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

TV9 Telugu24 May, 03:56 am
ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. వారికి కూడా డబ్బులు..

- ఇళ్ల పండుగ షురూ కానుంది.. - రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. - రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Andhra Jyothy31 May, 02:22 pm
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం

<p><strong>హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): </strong>విద్యే అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా తానే చేపట్టానని తెలిపారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యకు ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు పెట్టారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><strong><span style="color: #fe0101"> రెండేళ్ల కృషికి నిదర్శనం..</span></strong></p><p>పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)’లో పేర్కొనడం తమ ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, విద్యా వికాస పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. అయితే తాజా ఫలితాలతో సంతృప్తి చెందకుండా మరింత మెరుగైన ఫలితాల కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే విశ్వాసం తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర నివేదికలో వచ్చిన తాజా ఫలితాలు మరింత ప్రేరణనిచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p style="text-align: start"><strong>ఈ వార్తలు కూడా చదవండి...</strong></p><p style="text-align: start"><a

Andhra Jyothy31 May, 12:39 am
మరో రూ.5,500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

<ul><li><p><strong>ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణల తొలగింపు</strong></p></li><li><p><strong>వైఎస్‌ హయాం నుంచే చెరువునుకబళించే ప్రయత్నాలు</strong></p></li><li><p><strong>స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా ఆపరేషన్‌</strong></p></li></ul><p><strong>నార్సింగ్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్ర</strong>భుత్వ భూములు, చెరువులను కబ్జాకోరల నుంచి రక్షించడంలో హైడ్రా దూకుడు పెంచింది. శనివారం ఐటీ కారిడార్‌లో ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని సుమారు రూ.5,500 కోట్ల విలువైన భూములను కబ్జా చెర నుంచి విడిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-నార్సింగ్‌ గ్రామాల మధ్య ముష్కిన్‌ చెరువు ఉంది. ఇక్కడ అభివృద్ధి పేరిట చెరువు మధ్యలో మట్టికట్ట నిర్మించారు. దానికి ఒకవైపున ఉన్న ప్రాంతంలో మట్టిని నింపి చదును చేశారు. మొత్తంగా చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 35.10 ఎకరాల భూమి ఆక్రమించారు. తాత్కాలిక షెడ్లు, పేదల గుడిసెలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు సుమారు ఏడాది క్రితం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ముష్కిన్‌ చెరువును మట్టితో నింపుతున్నారని.. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో చెరువును అభివృద్ధి చేస్తున్నవారే చెరువు పరిధిని తగ్గించి ఆక్రమణలకు ఆస్కారం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై హైడ్రా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులతో కలిసి విచారణ చేపట్టింది. గ్రామ రికార్డుల మేరకు చెరువు విస్తీర్ణం 59.11 ఎకరాలుగా ఉన్నట్టు గుర్తించింది. అందులో సర్వే నంబరు 259లో 20.23 ఎకరాలు ప్రభుత్వ శిఖం భూమికాగా.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సర్వే నంబర్‌ 258లో 13.34 ఎకరాలు, సర్వే నంబర్‌ 260లో 8.19 ఎకరాలు, సర్వే నంబర్‌ 376లో 12.8 ఎకరాలు, సర్వే నంబరు 379లో 29 గుంటలు భూమి ఉందని తేల్చింది. అయితే కేవలం ప్రభుత్వ శిఖం భూమి 20.23 ఎకరాల మేరకు చెరువు అభివృద్ధి చేస్తున్నారని గుర్తించింది. మిగతా భూమి మొత్తాన్ని రక్షించేందుకు

10TV Telugu28 May, 02:22 pm
తెలంగాణలో తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర విమర్శలు

Telangana Tahsildar Transfers: తెలంగాణలో తహసీల్దార్ల బదిలీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేయడమే కాదు.. వారికి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తహసీల్దార్ల బదిలీలు, ప్రమోషన్లను ఉద్యోగ సంఘాలే తప్పుబడుతున్నాయి. తహసీల్దార్లను ఏకంగా డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్లుగా ప్రమోషన్ కల్పిస్తూ.. ట్రాన్స్ ఫర్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం 12 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల రీత్యా ఈ బదిలీలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే బదిలీలు చేయడంలో తప్పు లేదు కానీ… వారిలో కొందరిని డీఆర్వోలుగా, మరి కొందరిని స్పెషల్ కలెక్టర్ పీఏగా, ఎస్డీసీ-ఎల్ఏగా నియమించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్ గా పదోన్నతి పొందాలంటే.. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. తహసిల్దార్ గా ఉన్న వారికి మొదట డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందుతారు. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ గా సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు తహసీల్దార్ల విషయంలో నిబంధనలను పట్టించుకోకుండా… డైరెక్ట్ గా డీఆర్వోలుగా నియమించడం వివాదాస్పదమైంది. ఓ మంత్రి రికమండేషన్ తో.. ఏకంగా ఏడుగురు తహసిల్దార్లను డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్లుగా నియమించారు. అంతేకాదు… ఒకరిని కలెక్టర్ కు పీఏగా..మరో నలుగురిని ఎస్డీసీ-ఎల్ఏగా ఉన్నత స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేశారు. ఈ నిర్ణయమే

10TV Telugu26 May, 05:40 am
డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. నెలకు రూ.7వేలు.. ఆ తరువాత ఉద్యోగ అవకాశం కూడా..!

Degree Students : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ విద్యార్థులకు సంప్రదాయ విద్యతోపాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంకు 11 కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (AEDP) కోర్సును అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్ల కాలపరిమితి గల డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ చివరి సంవత్సరం అంతా క్షేత్ర స్థాయిలో వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ప్రత్యక్షంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. Also Read : Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఉపాధి లభించేలా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత విద్యా సంవత్సరంలో 16రకాల కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం మరో 11 కోర్సులు అందుబాటులోకి తేవడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 94 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 27రకాల ఏఈడీపీ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, గతేడాది 16 కోర్సులకుగాను 6వేల సీట్లు అందుబాటులో ఉండగా.. కేవలం 1,770 మంది మాత్రమే చేరారు. ఈసారి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను చేర్చడంతోపాటు గతంకంటే మరో 5వేలు సీట్లు అందనంగా పెంచారు. దీంతో 11వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2026-27విద్యా సంవత్సరంలో కనీసం 8వేల సీట్లు భర్తీ చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురానున్న 11కోర్సుల ద్వారా విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసుకున్న తరువాత

10TV Telugu28 May, 12:56 pm
తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ప్రతి ఒక్కరికీ ఆల్ ఇన్ వన్’ కార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్

Unified Welfare Card: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్ ఇవ్వనుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ది చేకూరుతుందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ దీనిపై ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరతాయన్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్‌ ఇచ్చేలా ఆలోచన చేయాలని సీఎం రేవంత్ అన్నారు. Also Read: బీఆర్ఎస్‌లోనూ సుమన్ వ్యాఖ్యల కలకలం.. కేసీఆర్ సీరియస్..! ఏం జరగబోతోంది?

Zee Telugu29 May, 05:05 pm
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.2,000 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగుల కోసం రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు ఆర్థిక ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.