ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక కథానాయికగా దీపికా పదుకొణెని అధికారికంగా ప్రకటించారు. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి మరో ముగ్గురు అందాల భామలు ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాలో ఓ మలయాళ హీరోయిన్ నటిస్తోందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ‘రాకా’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మలయాళ నటి ఫెమినా జార్జ్ ఈ సినిమాలో భాగమయ్యారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 2021లో 'మిన్నల్ మురళి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మోడల్ ఫెమినా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది. అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. తన పాత్ర చిన్నదే అయినా, ఇలాంటి పెద్ద సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.''రాకా' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతానని నేను అసలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా చూశాను. అప్పటినుంచే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. 'రాకా' సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే అయినా.. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో నా డ్రీమ్ నిజమైనట్లుగా ఉంది'' అని ఫెమినా జార్జ్ చెప్పింది. అల్లు అర్జున్ కు మలయాళంలో ఉండే
Femina George Instagram News
Latest updates from Telugu Digital news sources.

Femina George In Raaka News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మలయాళీ బ్యూటీని ఎంపిక చేశారట. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'పుష్ప' సిరీస్‌లోని రెండు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సైన్స్-ఫిక్షన్ సినిమా 'రాకా' నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో దీపికా పదుకొణెతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ భోర్సే వంటి వారు మరో హీరోయిన్‌గా నటిస్తున్నారని పుకార్లు వచ్చాయి. కానీ, చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఫెమినా జార్జ్..'రాకా' సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ సినిమాలో అవకాశం రావడం పట్ల ఆమెకు చెప్పలేనంత ఖుషీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో అల్లు అర్జున్ ఈ సినిమాలో కథానాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇందులో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఓ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్.. దాదాపుగా రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో హాలీవుడ్‌కు తగ్గట్టుగా నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ 3 నుంచి 4 గెటప్స్‌లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే అల్లు ఫ్యాన్స్‌కు ఇక