translateexpand_more

Gadala Srinivasa Rao News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 03:37 am
జనసేనలోకి మాజీ డీహెచ్ గడల శ్రీనివాసరావు.. సోషల్ మీడియా పోస్టుతో హింట్, అక్కడి నుంచే గా పోటీ

తెలంగాణ మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ చర్చకు దారితీసింది. ఆ పోస్టులో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటో ఉండటమే ఈ చర్చకు ప్రధాన కారణం. దీంతో డాక్టర్ శ్రీనివాసరావు త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.గడల శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీపై గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో ఆయన హెల్త్ డైరెక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయం నుంచే రాజకీయ రంగప్రవేశంపై బలమైన ప్రచారం సాగింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారు. జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు, విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే.. ఆ సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది.ఆయన హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న కాలంలో కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా.. పలు రాజకీయ వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఒక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడం, కేసీఆర్ వల్లే దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేయడం, ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మంగళవారం నాటి ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న జనసేన.. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బలం పుంజుకోవాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన సమయంలోనే గడల శ్రీనివాసరావు పవన్ కల్యాణ్ ఫోటోతో కూడిన పోస్టును తన స్టేటస్‌గా పెట్టుకోవడం యాదృచ్ఛికం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఆంధ్రా మూలాలున్న ఓటర్లు, అలాగే పవన్ కల్యాణ్ సామాజికవర్గంతో పాటు యువతలో ఉన్న క్రేజ్ జనసేనకు కలిసివస్తుందని శ్రీనివాసరావు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆయన.. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారనే సంకేతాలు ఈ పోస్టు ద్వారా స్పష్టమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. తెలంగాణలో జనసేన తరఫున ఒక బలమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉన్న నాయకుడు బరిలోకి దిగినట్లవుతుందని అంటున్నారు. కాగా, ఈ వ్యవహారంపై డాక్టర్ గడల శ్రీనివాసరావు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి మరి.

Gadala Srinivasa Rao News Keyword | Telugu Digital