
ఊహించినట్టే దేశంలో వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగించాయి.అదే సమయంలో దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ఈ మిశ్రమ ధోరణిని కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,030 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,43,940 రూపాయలుగా ఉంది. ఈ ధరలలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు లేవు.ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం 0.54 శాతం తగ్గి రూ. 1,60,050 వద్దకు చేరుకుంది. దీనికి విరుద్ధంగా వెండి రేట్లు పరుగులు పెట్టాయి. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో కంపేర్ చేస్తే 0.21 శాతం పెరిగింది. కిలో 2,67,560 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,57,180గా, 22 క్యారెట్లది రూ. 1,44,090గా నమోదైంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ. 1,57,080 వద్ద, 22 క్యారెట్లు రూ. 1,43,990 వద్ద పలికింది.






