translateexpand_more

Healthy Eating News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 01:42 pm
ఫాస్ట్ ఫుడ్ తింటూనే బరువు తగ్గండి.. తమన్నా ఫిట్ నెస్ ట్రైనర్ సింపుల్ టిప్

బరువు తగ్గాలంటే ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నారా? అయితే దాని అవసరం లేదంటున్నారు ప్రముఖ నటి తమన్నా భాటియా ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్. డైటింగ్‌లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మెక్‌డొనాల్డ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో బర్గర్ తినొచ్చని, అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే బరువు పెరగకుండా చూసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఈ విషయంపై ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.సిద్ధార్థ్ సింగ్ ప్రకారం, అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినడం సమస్య కాదు. కానీ, బర్గర్‌తో పాటు భారీ సైజు ఫ్రెంచ్ ఫ్రైస్, పెద్ద సైజు కోక్, డెజర్ట్‌లను ఆర్డర్ చేయడమే అసలు సమస్య. ఇలా అన్నీ కలిపి ఒకేసారి తిన్నప్పుడు క్యాలరీలు 1,500 దాటిపోతాయి. ఇది బరువు తగ్గాలనే లక్ష్యానికి ఆటంకం కలిగిస్తుంది."బర్గర్ తినాలనిపించినప్పుడు, దానితో పాటు వచ్చే అధిక క్యాలరీలున్న ఫ్రైస్, షుగర్ డ్రింక్స్‌ను వదిలేస్తే చాలు. కేవలం బర్గర్‌ను మాత్రమే తింటే మీ క్యాలరీల లెక్క అదుపులో ఉంటుంది," అని ఆయన వివరించారు. ఇలా చేయడం వల్ల ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు డైటింగ్‌ను మధ్యలో ఆపేయాలనే ఆలోచన కూడా రాదని తెలిపారు.తమన్నా కూడా కఠినమైన నియమాలు పాటించకుండా, ఇలాంటి సమతుల్య జీవనశైలితోనే 5 నుంచి 10 కేజీల వరకు బరువు తగ్గారని సమాచారం. దీర్ఘకాలిక ఫిట్‌నెస్ అనేది ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయడంపై కాకుండా, సమతుల్యత పాటించడంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Sakshi27 May, 03:55 am
బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే

నట్స్‌ తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందులోనూ బాదం పప్పులు మరింత ఆరోగ్యప్రదం కూడా. వీటిని ఎవ్వరైనా ధీమాగా తినొచ్చు. బాలింతలు, దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికి మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . అధ్యయనాలు సైతం ఆ మాట నొక్కి చెబుతున్నాయి. నీటిలో నానబెట్టకుండా గట్టిగా ఉన్న బాదం పప్పులనే తింటే జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో కూడా వివరించారు. బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కీలక ఖనిజాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి కూడా. అందువల్ల వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా కనీసం ఓ 12 గంటలైన నానబెట్టి తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆదర్శగౌడ. ఎందుకంటే.. పచ్చిగా ఉండే బాదం పప్పుల్లో ఫైటిక్‌ ఆమ్లం ఉంటుందట. ఇది బాదంలో సహజంగా లభించే సమ్మేళనం. ఇది బాదంలోని జింక్‌, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో బంధం ఏర్పరచుకుని కరగని సమ్మేళనాలను ఏర్పరస్తుంది. ఎప్పుడైతే నానబెట్టకుండా తింటామో..ఫలితంగా జీర్ణవ్యవస్థ గుండా శోషించబడకుండానే ప్రయాణిస్తుందట. ఎప్పుడైతే మనం బాదం పప్పులను 12 గంటల పాటు నానాబెడితే..ఫైటిక్‌ ఆమ్లం పరిమాణం 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతుందట. తద్వారా బంధింపబడే ఉండే ఖనిజాల లభ్యత సులభం అవుతుందట. అంటే నానబెట్టడం వల్ల ఫైటిక్‌ ఆమ్లంలో గట్టిగా బంధిపబడి ఉన్న కీలకమైన ఖనిజాలన్ని శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇలా నానబెట్టడం శరీరానికి కావాల్సిన ఇనుము సులభంగా అందుతుందని పరిశోధనల్లో తేలింది. నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా