translateexpand_more

Hyderabad Metro Passenger Fined News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 07:36 am
హైదరాబాద్ మెట్రోలో విండో స్క్రీన్ పై కాళ్లు పెట్టిన ప్రయాణికుడికి షాక్, కేసు నమోదు, జరిమానా

హైదరాబాద్ మెట్రో రైలులో నిబంధనలు ఉల్లంఘిస్తూ, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించిన ఒక ప్రయాణికుడికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. మెట్రో రైలు లోపల ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా, క్రమశిక్షణ తప్పి, సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తించినందుకు గానూ ఆ వ్యక్తిపై చర్యలకు హైదరాబాద్ మెట్రో ఉపక్రమించింది.మెట్రో ప్రయాణికుడి దుశ్చర్యహైదరాబాద్ మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో రెండ్రోజుల క్రితం చైతన్య అనే ప్రయాణికుడు ప్రయాణించాడు. ఆ వ్యక్తి సీట్లో కూర్చుని, తన రెండు కాళ్లను మెట్రో కోచ్ కిటికీకి ఉన్న గ్లాస్ స్క్రీన్‌పై పైకి పెట్టి చాలా నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. పక్కనే ఇతర ప్రయాణికులు ఉన్నప్పటికీ అతను ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ప్రయాణించాడు.సోషల్ మీడియాలో వైరల్ వీడియో అక్కడ ఉన్న ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా పట్టించుకోకుండా అదే ధోరణిలో ప్రవర్తించాడు. మెట్రో ఆస్తులను పాడుచేసేలా, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉన్న ఈ దృశ్యాన్ని అదే కోచ్‌లో ఉన్న మరొక ప్రయాణికుడు తన మొబైల్‌లో వీడియో తీశాడు.సదరు ప్రయాణికుడు ఆ వీడియోను ఎక్స్ వేదికగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.జరిమానా విధించిన మెట్రో మెట్రోలో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్య ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో మెట్రో అధికారులు తక్షణమే స్పందించారు. సిసిటివి ఫుటేజ్ మరియు ప్రయాణికుడి ప్రయాణ వివరాల ఆధారంగా అతనిని గుర్తించిన అధికారులు, మెట్రో చట్టాల ప్రకారం సదరు ప్రయాణికుడికి రూ. 250 జరిమానా విధించారు.తెలంగాణా బరాబర్ మా అయ్య జాగీరే: పవన్ కళ్యాణ్ కు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్!పోలీస్ కేసు నమోదు.. ప్రయాణికులకు మెట్రో విజ్ఞప్తి ప్రభుత్వ ఆస్తులను గౌరవించాలని, మెట్రో అనేది అందరిదని గుర్తుంచుకోవాలని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అంతేకాదు అతనిపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో అధికారులు మెట్రో ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మెట్రో రైళ్లు మరియు స్టేషన్ల ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా, మెట్రో నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Samayam Telugu03 Jun, 05:17 am
ప్రయాణికుడి తిక్క కుదిర్చిన హైదరాబాద్ మెట్రో.. అలా కూర్చున్నందుకు ఫైన్, పోలీస్ కేసు నమోదు

ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కనీస పౌరస్పృహ, బాధ్యత కలిగి ఉండాలని అధికారులు నెత్తినోరూ కొట్టుకొని చెబుతున్నా కొందరు ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఓ ప్రయాణికుడికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఫైన్ విధించటంతో పాటు పోలీసు కేసు కూడా నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో రెండ్రోజుల క్రితం చైతన్య అనే ప్రయాణికుడు ప్రయాణించాడు. అయితే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా తన కాలును కిటికీ అద్దంపై ఆనించి అనాగరికంగా ప్రవర్తించాడు.ట్రైన్‌లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు అతడి తీరును గమనించి.. ఇది పద్ధతి కాదని, కాలు కిందకు దించాలని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. సదరు ప్రయాణికుడు ఏమాత్రం సిగ్గులేకుండా.. రివర్స్‌లో వారితోనే వాదనకు దిగాడు. తాను ఇలాగే కూర్చుంటానని.. ఏం చేసుకుంటారో చేసుకోండనే పద్ధతిలో దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో విసిగిపోయిన ఒక ప్రయాణికుడు ఈ తతంగం మొత్తాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేయడమే కాకుండా.. వెంటనే మెట్రో రైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన అధికారులు సమాచారాన్ని రాయదుర్గం మెట్రో స్టేషన్ భద్రతా సిబ్బందికి చేరవేశారు.ట్రైన్ రాయదుర్గం స్టేషన్‌కు చేరుకోగానే ముందే సిద్ధంగా ఉన్న పోలీసులు, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పట్టుకున్నారు. అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ జీఎం సెక్యూరిటీ శ్రీనాథ్‌ రెడ్డి స్పందిస్తూ.. నిందితుడిని నగరానికే చెందిన చైతన్యగా గుర్తించామని చెప్పారు. మెట్రోరైలు నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు ప్రవర్తనకు పాల్పడినందుకు చట్టం ప్రకారం రూ.250 జరిమానా విధించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతం కాకుండా హెచ్చరించామన్నారు.ఇదిలా వుండగా.. సదరు ప్రయాణికుడు పౌరస్పృహ లేకుండా ప్రవర్తించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వందలాది మంది నెటిజన్లు, నిత్యం మెట్రోలో ప్రయాణించే వారు ఆ వ్యక్తిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మెట్రో వంటి ఆధునిక రవాణా వ్యవస్థల్లో ఇలాంటి అనాగరిక పనులు చేయడం సరికాదని మండిపడ్డారు. రూ.250 జరిమానా చాలా తక్కువని, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులను మళ్లీ ఎప్పుడూ మెట్రో రైళ్లలోకి రాకుండా జీవితకాలం నిషేధించాలనే డిమాండ్లు కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.