translateexpand_more

India Crime News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy30 May, 02:05 am
కర్ణాటక విజయపుర జిల్లాలో దారుణం.. ఆరుగురిని నరికి చంపిన ప్రత్యర్థులు

కర్ణాటక: విజయపుర జిల్లా గోవిందపురలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదానికి సంబంధించి ప్రత్యర్థులు ఆరుగురిని హత్య చేశారు. పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన చడచాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమా నదీ పరివాహక ప్రాంతంలో జరిగింది. మృతులను గోవిందపుర గ్రామానికి చెందిన చందు నిరాలే (55), దుండప్ప నిరాలే (65), శివపుత్ర నిరాలే (58), రాహుల్ నిరాలే (25), సమర్థ నిరాలే (23), షబ్బీర్ నదాఫ్ (45)గా పోలీసులు గుర్తించారు.

ఈ దాడిలో అరవింద్ కటగే (72), సందీప్ మానే (33) అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిరాలే, గోలగి కుటుంబాల మధ్య భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీంతో శుక్రవారం నాడు గోలగి వర్గీయులు నిరాలే కుటుంబంపై దాడికి దిగారు. మరోవైపు, 2015లో జరిగిన ఓ హత్య కేసుతోనూ ప్రస్తుత దాడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందినప్పటికీ, మృతదేహాలను పరిశీలించగా ఎలాంటి తుపాకీ గాయాలు కనిపించలేదు.

చెరకు కోయడానికి ఉపయోగించే కోయితా అనే పదునైన ఆయుధాలతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి స్పందించారు. ఆరుగురి హత్య జరిగిన విషయాన్ని నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

వేశ్యావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు

‘ప్రైవేటు’లో 66శాతం సిజేరియన్లే!

Sakshi29 May, 09:34 am
పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

ముంబై: పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. శివారు ప్రాంతమైన పింప్రి చించ్వాడ్‌లో ఈ ఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్‌లోని వాన్వాడి ప్రాంతంలో అక్రమ మద్యం సేవించి గురువారం ఎనిమిది మంది మరణించగా.. ఇవాళ (శుక్రవారం) ఉదయం మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11కి చేరింది. మద్యం సేవించిన తర్వాత బాధితులు స్పృహ తప్పి పడిపోయారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎన్సీపీ నేత యోగేష్ బహాల్ డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారుల అండదండలతోనే అక్రమ, కల్తీ మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని.,. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 11 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దందాలో వారు కూడా భాగమయ్యారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే, ఎండతీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పేర్కొంటూ... ఈ 11 మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ధృవీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారని.. దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

Andhra Jyothy29 May, 02:16 am
గుజరాత్ లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి

గుజరాత్ సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గుజరాత్‌: సాంకేతిక యుగంలో మనుషులు చంద్ర మండలంపైకి వెళ్తున్నా కొంత మందిని మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. ఓ వైపు పూజల పేరుతో దొంగ బాబాలు అమాయకులను మోసం చేస్తుంటే.. మరోవైపు చేతబడి, బాణామతి పేరుతో పలువురిపై మూకదాడులు జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. మంత్రగత్తె పేరుతో ఓ మహిళపై దాడి చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా.. అడ్డుకోబోయిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ గ్రామంలో వదంతులు వ్యాపించాయి. కొంత మంది గ్రామస్థులు ఆ పుకార్లను నమ్మారు. ఆ కుటుంబంపై దాడి చేసి ఊరి నుంచి తరిమేయాలని నిర్ణయించారు. దీంతో పదుల కొద్దీ జనం ఒక్కసారిగా కమ్లాబెన్ ఇంటిపైకి దూసుకెళ్లారు. ఆమె నివాసంపై రాళ్లు విసురుతూ భయాందోళనలు సృష్టించారు. భార్య, పిల్లలను కాపాడేందుకు మనుభాయ్ బయటకు వచ్చారు. దాడికి వచ్చిన వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత కుటుంబంపై ఒక్కసారిగా గ్రామస్థులు మూకదాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో మనుభాయ్‌పై దాడి చేశారు. ఈ ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలు కాగా.. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించే లోపే మనుభాయ్ మృతిచెందాడు. రంగంలోకి దిగిన పోలీసులు మూకదాడికి పాల్పడిన 12 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు. ఎనిమిది

Zee Telugu28 May, 12:05 pm
స్టార్ హీరోయిన్ మృతి కేసులో మాజీ జడ్జి అరెస్టు

Twisha Sharma Case:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే ఈ చర్యలు తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.భోపాల్‌లోని గిరిబాలా సింగ్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం గిరిబాలా సింగ్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ ఆమెను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ చాట్స్, సీసీటీవీ వీడియోలు కూడా కీలకంగా మారాయి. ఈ కేసులో ఇంకా మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విషా కుటుంబ సభ్యుల ఆరోపణలు ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. వివాహం తర్వాత ట్విషాను తరచూ వేధించేవారని, అదనపు కట్నం కోరేవారని వారు ఆరోపిస్తున్నారు. ట్విషా గర్భవతి అయిన తర్వాత కుటుంబంలో గొడవలు పెరిగాయని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అబార్షన్ చేయాలని ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ జడ్జి అరెస్టు కావడం, సీబీఐ దర్యాప్తు చేపట్టడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. గిరిబాలా సింగ్‌కు ముందుగా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ట్విషా శరీరంపై ఏడు గాయాలున్నాయని, వాటిని కోర్టులో సీబీఐ ప్రస్తావించింది. అలాగే వాట్సాప్ చాట్స్ ద్వారా ట్విషాపై మానసిక వేధింపులు జరిగినట్లు ఆధారాలు

Andhra Jyothy26 May, 02:04 am
Home » National » Court Threat Turns Two assasination Within Hours Shock Bihars Nawada bvr ABN , Publish...

Home » National » Court Threat Turns Two assasination Within Hours Shock Bihars Nawada bvr ABN , Publish Date - May 26 , 2026 | 07:34 AM బిహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్య...

Andhra Jyothy26 May, 03:09 am
Home » National » Drunk Father attacked Son In Lakhimpur Kheri Uttar Pradesh suri ABN , Publish Date...

Home » National » Drunk Father attacked Son In Lakhimpur Kheri Uttar Pradesh suri ABN , Publish Date - May 26 , 2026 | 08:39 AM ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడ...

Andhra Jyothy23 May, 04:06 pm
ట్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్..

- Home » Video Gallery » ABN Videos » Twisha Sharma Case Samarth Singh Sent To Remand suri ABN, Publish Date - May 23 , 2026 | 09:36 PM సంచలనం సృష్టించిన ట్విషా శర్మ కేసులో విచారణ వేగవంతం అయ్యింది. - నిందితుడు సమర్థ్‌సింగ్‌కు భోపాల్ కోర్టు రిమాండ్ విధించింది. - ఇంటర్నెట్ డెస్క్: సంచలనం సృష్టించిన ట్విషా శర్మ కేసులో విచారణ వేగవంతం అయ్యింది.

Sakshi27 May, 02:09 pm
గుజరాత్ లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. విలువ వెయ్యి కోట్లకు పైగా

గాంధీనగర్‌: గుజరాత్‌లో భారీ డ్రగ్స్‌ ముఠాను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు గుట్టు రట్టుచేశారు. కచ్‌లో సుమారు రూ.1180 కోట్ల విలువైన 118 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు విదేశీయులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్‌ రవాణా జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్, పలు లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కరాచీ (పాకిస్థాన్‌) మీదుగా ప్రయాణించి గుజరాత్ తీరానికి ఓ ఓడ చేరుకుంది. ముంద్రా తీరానికి సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆ ఓడ నుంచి అనుమానాస్పదంగా ప్యాకెట్లు సముద్రంలోకి విసురుతున్నట్లు కోస్ట్‌ గార్డులు గుర్తించారు. వెంటనే గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు సమాచారం అందించగా.. ఏటీఎస్‌–కోస్ట్‌ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ సమయంలో ఓడలో ఇద్దరు నైజీరియన్‌ జాతీయులు ఉండగా, వారిలో ఒకరు సముద్రంలోకి దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరిని క్లావిన్‌ చుక్వుమా (టాంజానియా పౌరుడు), బ్యారుహంగా జేమ్స్‌ (ఉగాండా పౌరుడు)గా గుర్తించారు. కంటైనర్ల ద్వారా తెచ్చిన కొకైన్‌ను భారత్‌లో ఎవరికి అందించాలనుకున్నారు. ఏ ప్రాంతానికి తరలించాలనుకున్నారు అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డ్రగ్స్‌ను ఢిల్లీలోని ద్వారకలో నివసిస్తున్న ఇద్దరికి అందజేయాల్సి ఉందని నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ 13న పోర్‌బందర్‌లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 12 రాత్రి జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌, కోస్ట్‌ గార్డ్‌ బృందం, పోర్‌బందర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంది. గుజరాత్‌ ఏటీఎస్‌ సమాచారం మేరకు, కోస్ట్‌ గార్డ్‌ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ