translateexpand_more

Iran Us Peace Deal News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 09:39 am
శాంతి ఒప్పందం అంతా తుస్సేనా..ట్రంప్ మళ్ళీ స్టాంగ్ వార్నింగ్

Iran-America War: పశ్చిమాసియాలో నెత్తుటి యుద్ధాన్ని ముగించేందుకు తెరవెనుక తీవ్ర దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇటు ఇరాన్, అటు అమెరికాలు క్షేత్రస్థాయిలో మాత్రం తగ్గేదేలేదన్నట్లుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ ఆరంభంలో తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ఇరు దేశాల మధ్య దాడుల పరంపర, తీవ్రమైన రాజకీయ విభేదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వారాంతంలో ఇరాన్ (Iran) యొక్క రాడార్, డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై తాము విజయవంతంగా ఆత్మరక్షణ దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ ‘MQ-1’ డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడానికి ప్రతిస్పందనగానే తాము ఇరాన్‌లోని గోరుక్ నగరం, ఖేష్మ్ ద్వీపాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. Read Also: Masoud Pezeshkian: మితిమీరిన సైనిక జోక్యం తో ఇరాన్ ప్రధాని రాజీనామా? ఈ దాడిలో Iran ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, రెండు వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతికారంగా, హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్ ద్వీపంలో ఉన్న తమ టెలికమ్యూనికేషన్స్ టవర్‌పై అమెరికా జరిపిన దాడి మూలాన్ని, అంటే వారి వైమానిక స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సోమవారం ఉదయం కువైట్ సైన్యం తాము శత్రు క్షిపణి, డ్రోన్ ముప్పులకు ప్రతిస్పందిస్తున్నామని సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కువైట్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాన్నే ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఇరాన్ నిజంగానే ఒక ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, అది అమెరికాకు, తమ మిత్రదేశాలకు