
itel Aqua Mobile : ఐటెల్ కొత్త ఇన్నో సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో IP67 రేటింగ్‌తో వస్తున్న ఏకైక ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ ఐటెల్ ఫోన్ వాటర్, డస్ట్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే, ఈ ఫోన్లో ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ కూడా ఉంది. సౌండ్, నాయిజ్ ఎక్కువగా ఉండే వాతావరణంలో కాలింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ప్రకారం.. రోజువారీ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కొత్త ఇన్నో సిరీస్‌ను రూపొందించారు. ధర, లభ్యత విషయానికి వస్తే.. ఐటెల్ ఆక్వా ఫోన్ ధర రూ. 1,799గా ఉంది. ఈ ఫీచర్ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో నుంచి కొనుగోలు చేయవచ్చు. 30 నిమిషాలు నీటిలో మునిగినా.. : దాదాపు 42 శాతం ఫీచర్ ఫోన్లు నీళ్లలో తడిసి పాడైన కారణంగానే యూజర్లు మార్చేస్తున్నారని తమ ఇంటర్నల్ సర్వేలో తేలిందని ఐటెల్ ప్రకటనలో పేర్కొంది. అందుకే ఐటెల్ ఆక్వాకు IP67 రేటింగ్ అందిస్తోంది. ఈ ఐటెల్ ఫోన్ 30 నిమిషాల వరకు నీటిలో మునిగినా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. దుమ్ము, బురద, తేమతో కూడిన వాతావరణంలో కూడా ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. Read Also : Vivo X Fold 6 : వివో లవర్స్ కోసం 200MP కెమెరాతో వివో X ఫోల్డ్ 6 వచ్చేస్తోంది.. శాంసంగ్, హానర్ ఫోన్లకు దబిడి దిబిడే.. కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫోన్లో ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్