translateexpand_more

Janasena Telangana News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 04:32 pm
పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ

Janasena: హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న జనసేన పార్టీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభకు అనుమతి ఇవ్వకపోవడానికి పోలీసులు చూపిన కారణాలు సమంజసంగా లేవని, అవి కేవలం సాకుల్లా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు విమర్శించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొనడాన్ని జనసేన ప్రశ్నించింది. ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు, వాటికి ఇచ్చిన సమాధానాలు ఎలా లా అండ్ ఆర్డర్ సమస్యగా మారతాయని పార్టీ నేతలు ప్రశ్నించారు. అసలు ప్రాంతీయ భావోద్వేగాలను చర్చలోకి తీసుకువచ్చింది ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సభ నిర్వహించాలనుకున్న జనసేనపై మాత్రమే ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని పార్టీ అభిప్రాయపడింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సెలెక్టివ్ నేరేటివ్స్, హాఫ్ కట్ వీడియోలను ప్రచారం చేస్తూ ముందుగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. అలాగే, కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విరాళం అందించినప్పుడు ప్రాంతీయత గుర్తుకు రాలేదా అని పార్టీ ప్రశ్నించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సభ నిర్వహించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాంతీయ భావోద్వేగాల అంశాన్ని ముందుకు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీసింది.

AP7AM01 Jun, 05:01 pm
జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు, పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన ప్రధాన కార్యదర్శి తమను కలిసి సభకు అనుమతి కోరారని తెలిపారు. ఈ సమావేశానికి సుమారు 2,000 మంది కార్యకర్తలు వస్తారని దరఖాస్తులో పేర్కొన్నారని చెప్పారు. అయితే, ఇటీవల ఏపీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలిపారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు కావడంతో ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని అన్నారు.దీంతో పాటు, సభకు వచ్చే రెండు వేల మందికి సరిపడా పార్కింగ్ సౌకర్యం లేదని కూడా తెలిపారు. జనసేన నేతలు పార్కింగ్ కోసం ఎఫ్‌సీఐకి చెందిన భూమిని ఉపయోగించుకోవాలని భావించినా, ఆ భూమిపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించామని... ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో సభకు అనుమతి నిరాకరించినట్లు డీసీపీ స్పష్టం చేశారు. 

SkyC Media31 May, 06:03 am
తెలంగాణలో జనసేన బలోపేతం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో జనసేన బలోపేతం చేయడంపై ఆయన పూర్తిగా దృష్టి సారించారు. జూన్ 2, 2026 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పొలిటికల్ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా నిర్మించడానికి ఈ ప్రణాళిక ఎంతో కీలకం కానుంది. ఈ వ్యూహంలో భాగంగా జూన్ 2 న పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో ఆయన ఈ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు. పార్టీని గ్రామాల నుంచి నగరాల వరకు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే వ్యూహాలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రానుంది. పార్టీ విస్తరణ మరియు బూత్ స్థాయి బలోపేతంపై జనసేన ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా జనసేన పార్టీ కన్నేసింది. నగర ప్రాంతాల్లో పార్టీ ఉనికిని గట్టిగా చాటడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకోనున్నారు. తెలంగాణలో పార్టీకి మద్దతు పెరుగుతోందని జనసేన అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా, యువత, మధ్యతరగతి మరియు ఉద్యోగార్థుల్లో ఉన్న ఆదరణను సంస్థాగత బలంగా మార్చాలని పవన్ కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, కేవలం అభిమానంగానే కాకుండా దానిని ఓట్ల రూపంలోకి మార్చడానికి బలమైన కమిటీలను వేయనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేనను ఒక ప్రత్యామ్నాయ శక్తీగా నిలబెట్టడమే