
హైదరాబాద్: మతపరమైన విభజన పైన.. మతం అనే సౌధంపైన భాజపా నిలబడి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ముగ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. భాజపా తెలంగాణాలో దండయాత్ర, జైత్రయాత్ర చేయబోతోందని ఆ పార్టీ నేతలు ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో భాజపా కొన్ని సీట్లు గెలవొచ్చేమో కానీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశంలో, రాష్ట్రంలో ప్రజల అసంతృప్తిని చూస్తున్నాం. అందుకే, సీపీఐ శ్రేణులు పోరాటాలు చేయాలి. సమస్య ఎక్కడ ఉంటే.. అక్కడ మనం ఉండాల్సిందే. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటే కనీసం ఐదు స్థానాల్లో, లేకుంటే కనీసం 15 స్థానాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు వేధింపులపై 4న, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై జూన్ 15న ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు చేపట్టాలి. రాష్ట్రంలో బలమైన 40 నియోజకవర్గాలను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టాలి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర.. రాష్ట్ర వైఫల్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యలను పాదయాత్రల్లో ప్రస్తావించాలి. సెప్టెంబర్ 28వ తేదీన చలో దిల్లీ కార్యక్రమం ఉంటుంది’’ అన్ని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి
