translateexpand_more

Liquor Shops News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu03 Jun, 09:25 am
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం షాపులు, బార్ల వద్ద ఆ బోర్డులు పెట్టొద్దు

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్ల వద్ద వివిధ మద్యం బ్రాండ్ల పేర్లతో ఉండే బోర్డులు, హోర్డింగులు, ప్లెక్సీల ఏర్పాటును నిషేధించింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్రతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. Also Read : KTR Political Counter Pawan kalyan : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్‌.. ఆ నిర్ణయం సరైందికాదు.. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజారోగ్యం, సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిషేధాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు మద్యం దుకాణాలు, బార్ల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. రాష్ట్రంలోని చాలా వరకు మద్యం షాపుల వద్ద ఏదో ఒక బ్రాండ్ పేరుతోనే బోర్డులు ఉన్నాయి. వారి బ్రాండ్లను ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఆయా బ్రాండ్ల పేరు, లైసెన్సీ పేరుతో కలిపి బోర్డులు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం.. మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదు. అయితే, కంపెనీలన్నీ ప్రచారంకోసం అదే బ్రాండ్ పేరుతో మంచినీళ్లు, సోడాలు అమ్మేలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. షాపుల వద్ద పెట్టే బోర్డులో ఆ బ్రాండ్ పేరు పెద్దగా చూపించి.. చిన్నగా మంచినీళ్లు, షోడా బాటిల్స్‌ను ముద్రిస్తారు. ఇది సాంకేతికంగా నిబంధనల ఉల్లంఘన కాదు. అందుకే షాపు వద్ద ఆయా కంపెనీలు వారి బ్రాండ్ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. మద్యం బాటిళ్ల సైజులో రూల్స్ సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ఎన్నేసి సీసాలు ఉండాలో కూడా ఖరారు చేసింది. దీంతో కొత్త పరిమాణంలో మద్యం సీసాలు రానున్నాయి. చాలాకాలంగా వీటి పరిమాణం 180, 375, 750 మిల్లీ లీటర్లలోనే ఎక్కువగా ుంది. ఇవి కాకుండా.. లీటరు, 90ఎంఎల్ సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 150, 200 ఎంఎల్ పరిమాణంతో సీసాలు తయారు చేస్తామని, అనుమతివ్వాలని ఇటీవల కొన్ని మద్యం కంపెనీలు కోరాయి. అందుకు అనుగుణంగా చౌకమద్యం (ఐఎంఎఫ్ఎల్) రూల్స్ ను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఒక కేసుకు క్వార్టర్ సీసాలైతే 48, హాఫ్ బాటిళ్లు 24, ఫుల్ బాటిళ్లు 12 ఉంటాయి. కొత్తగా రాబోయే 150ఎంఎల్ సీసాలైతే 60, అదేవిధంగా 200 ఎంఎల్ సీసాలు అయితే ఒక కేసులో 45 ఉంటాయి.