translateexpand_more

Mea India Foreign Policy News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu02 Jun, 11:58 am
భారత్ సాయానికి చేతులెత్తి మొక్కుతున్న ఆఫ్రికా

ఆఫ్రికా ఖండంలో కలకలం రేపుతున్న ఎబోలా మహమ్మారిని కట్టడి చేయడానికి భారతదేశం ముందంజ వేసింది. ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ ప్రత్యేకంగా కోరిన వెంటనే స్పందించిన భారత్, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Africa CDC) సంస్థకు తక్షణ వైద్య సహాయాన్ని అందజేసింది. ఆఫ్రికా దేశాలలో ఎబోలా వ్యాప్తిని అరికట్టడంతో పాటు, అక్కడి ప్రజారోగ్య సంసిద్ధతను మరింత బలోపేతం చేయడానికి ఈ సాయం ఎంతో కీలకంగా మారుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.ఎబోలా మహమ్మారి తీవ్రతను బట్టి భారతదేశం రెండు విడతల్లో ఈ వైద్య సామాగ్రిని ఆఫ్రికాకు తరలించింది. మొదటగా మే 24వ తేదీన సుమారు 2.5 టన్నుల బరువుగల అత్యవసర వైద్య సామాగ్రిని ఉగాండాలోని కంపాళాకు భారత్ పంపించింది. ఇందులో ఎబోలా రోగుల చికిత్సకు అవసరమయ్యే మందులు, సప్లిమెంట్లు, వైద్యుల రక్షణ పరికరాలు , పర్యవేక్షణ ఉపకరణాలు ఉన్నాయి.ఆ తర్వాత Africa CDC ఇచ్చిన వివరణాత్మక జాబితా ఆధారంగా విదేశాంగ శాఖ ఏకంగా 43 టన్నుల భారీ సరుకును సిద్ధం చేసింది. ఇందులో ప్రత్యేక రక్షణ వస్త్రాలు (PPE కిట్లు), వ్యాధి నిర్ధారణ పరికరాలు, నమూనా (శాంపిల్) కిట్‌లు, అంటువ్యాధి నివారణ సామాగ్రితో పాటు కీలకమైన మందులను పంపింది. ఈ భారీ సరుకు 2026 జూన్ 2వ తేదీన కంపాళాకు చేరుకుని, అక్కడ Africa CDC అధికారులకు అధికారికంగా అందజేయబడుతుంది.తూర్పు కాంగోకు చేరనున్న సాయం.. Africa CDC ధన్యవాదాలు!డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతాలలో ఎబోలా ప్రతిస్పందన కోసం భారత ప్రభుత్వం అందించిన ఈ అత్యవసర వైద్య సామాగ్రిని Africa CDC సంస్థ సోమవారం మనస్ఫూర్తిగా స్వాగతించింది. భారతదేశం పంపిన సరుకులు Africa CDC యొక్క తూర్పు ప్రాంతీయ సమన్వయ కేంద్రం ద్వారా ఉగాండాకు చేరుకున్నాయి. ఇవి తూర్పు కాంగో (DRC)లో ఎబోలా నియంత్రణ ప్రయత్నాలకు ఎంతగానో మద్దతుగా నిలుస్తాయి అని ఆ సంస్థ X (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్‌లో ప్రత్యేకంగా పేర్కొంది.మళ్లీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ.. కేంద్రం అత్యవసర ప్రయాణ హెచ్చరికలు!ఈ క్లిష్ట సమయంలో ఆఫ్రికా దేశాలకు సంఘీభావం ప్రకటించిన భారత ప్రభుత్వానికి, ఇక్కడి ప్రజలకు తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆ ప్రజారోగ్య సంస్థ కొనియాడింది. ఈ వైద్య సహాయం వల్ల ఎబోలా వ్యాప్తి కట్టడిలోకి రావడమే కాకుండా, వైరస్ బారిన పడిన ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.ఆఫ్రికా దేశాలతో చెడనవని బంధం!ఆఫ్రికా ఖండం అంతటా వ్యాధుల నివారణ, అత్యవసర వైద్య ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో ఆఫ్రికన్ యూనియన్ ప్రజారోగ్య సంస్థ (Africa CDC) కీలక పాత్ర పోషిస్తోంది. కష్టకాలంలో ఆఫ్రికా దేశాలకు అండగా నిలవడం, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడం ఆఫ్రికా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన భాగస్వామ్య నిబద్ధతను ప్రతిబింబిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ? రష్యా వ్యాక్సిన్ ఎంత పవర్ ఫుల్?ప్రస్తుతం అడిస్ అబాబా, కంపాళాలోని భారత మిషన్లు (రాయబార కార్యాలయాలు) ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ , Africa CDC సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆఫ్రికా ఆరోగ్య అధికారులతో న్యూఢిల్లీ నిరంతర పరిచయంలో ఉందని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని వైద్య సేవలు, లాజిస్టికల్ సహాయం అందించడానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది.

Mea India Foreign Policy News Keyword | Telugu Digital