translateexpand_more

Nandu News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 12:12 pm
మొన్న అషు.. నేడు నందు.. జనాలని మోసం చేస్తున్న ఇన్ ఫ్లుయెన్సర్లు

సోషల్ మీడియా వచ్చాకా ఇన్‌ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ అకౌంట్ ని ఓపెన్ చేసి.. తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ వీడియో తీసి అప్లోడ్ చేయడం.. సోషల్ మీడియా వచ్చాకా ఇన్‌ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ అకౌంట్ ని ఓపెన్ చేసి.. తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ వీడియో తీసి అప్లోడ్ చేయడం.. దానిని జనాలు చూస్తూ సూపర్.. మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడంతో వారు స్టార్స్ గా మారుతున్నారు. ఇక వారి పాపులారిటీ చూసి ఇండస్ట్రీవాళ్ళు వాళ్ళ సినిమాను ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నారు. అలా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏది ప్రమోట్ చేస్తే అది ఫాలోవర్లు గుడ్డిగా నమ్మేసి మోసపోతున్నారు. అందాల భామ అషురెడ్డి అలాగే ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి రూ.9 కోట్లు లాగేసింది. ఇప్పుడు అతను లబోదిబో అంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదొక మోసం అయితే.. ఇప్పుడు తాజాగా మరో మోసం బయటపడింది. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ నమ్మించి కోట్లు కొల్లగొట్టారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాదాపు 30 మందిని మోసం చేసినట్లు సమాచారం. అసలు ఎవరు వీరు అంటే.. యూట్యూబ్ లో నందు వరల్డ్ పేరుతో నందన అనే తెలుగు మహిళ ఒక ఛానెల్ నడుపుతుంది. ఆమె భర్త యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో రోజు ఏదో ఒక కంటెంట్ చూపిస్తూ ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకుంది. వీరి ఫ్యామిలీ ఎంత గుర్తింపు తెచ్చుకుంది అంటే చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నందన చిరుతో కలిసి నటించింది. రెస్టారెంట్ లో భర్తల గురించి

Telugu Times30 May, 01:48 am
శ్రీవిష్ణు టార్గెట్ అదేనా

టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. సామజవరగమన వంటి సూపర్‌హిట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించిన శ్రీ విష్ణు, అదే డైరెక్ట‌ర్ రామ్ అబ్బ‌రాజు(Ram Abbaraju)తో మరోసారి చేతులు కలిపాడు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి కావడంతో మూవీ టీమ్ మంచి ఉత్సాహంలో ఉన్నట్లు సమాచారం. సామజవరగమన ఇచ్చిన విజయంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెట్స్‌పై హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు ఫుల్ ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ఈసారి కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వినోదం అందించాలనే టార్గెట్ తో కథను డిజైన్ చేసినట్లు సమాచారం. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ సజావుగా సాగుతుండగా, త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ వంటి అప్డేట్స్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు రచయితలుగా భాను భోగ‌వ‌ర‌పు(Bhanu Bhogavarapu), నందు(Nandu) పనిచేస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై న‌వీన్ యేర్నేని(Naveen Yerneni), వై. ర‌విశంక‌ర్(Y. Ravi Shankar) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో వెన్నెల కిషోర్(Vennela Kishore), సుద‌ర్శ‌న్(Sudarshan) కీలక పాత్రల్లో కనిపించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ నటుల సమక్షంలో సినిమా వినోదం డోస్ మరింత పెరగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

NTV Telugu24 May, 06:39 am
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట

- టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) నటనకు, ఆయన ఎంచుకునే వైవిధ్యమైన కథలకు టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. - కేవలం ప్రేక్షకులు, అభిమానులే కాదు.. - పరిశ్రమలోని తోటి నటీనటులు సైతం నాని యాక్టింగ్ స్టైల్‌కు పెద్ద ఫ్యాన్స్ అయిపోతుంటారు.

Zee Telugu26 May, 07:25 am
Hero Nandu: నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గీతా మాధురి భర్త జీవితాన్ని మార్చిన సుకుమార్ మాటలు!

Hero Nandu: హీరో నందు తాజాగా దర్శకుడు సుకుమార్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని నందు చెప్పాడు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఈ విషయాలను చాలా ఓపెన్‌గా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ నందును ఇప్పుడు మీరు చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నారు అని అడిగాడు. దానికి నందు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. గతంలో తాను చాలా సిగ్గుగా ఉండేవాడినని చెప్పాడు. ఒకసారి దర్శకులతో సినిమా చేసిన తర్వాత మళ్లీ వాళ్లను కలవడానికి కూడా ఇబ్బంది పడేవాడినని తెలిపాడు. సుకుమార్, బోయపాటి శ్రీను, దేవా కట్టా లాంటి పెద్ద దర్శకులతో పని చేసినా కూడా వారిని సంవత్సరాల పాటు కలవలేదని చెప్పాడు. ముఖ్యంగా 100% Love సినిమా తర్వాత సుకుమార్‌ను దాదాపు ఏడు సంవత్సరాలు కలవలేదని తెలిపాడు. తర్వాత రంగస్థలం ఈవెంట్ సమయంలో సుకుమార్‌ను మళ్లీ కలిసినట్టు నందు చెప్పాడు. ఆ సమయంలో సుకుమార్ మరుసటి రోజు ఆఫీస్‌కు రావాలని చెప్పారట. అక్కడ జరిగిన మాటలు తన జీవితాన్ని మార్చేశాయని నందు తెలిపాడు. “నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా నిన్ను ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవడానికి,” అని సుకుమార్ అడిగారని చెప్పాడు. అలాగే “నాకు వందల పనులు ఉంటాయి. చాలా మందిని కలవాలి. నువ్వు తరచూ కనిపిస్తేనే గుర్తుంటావు. అప్పుడే నీకు పాత్ర ఇవ్వాలని ఆలోచిస్తాను” అని చెప్పారట. ఆ మాటలు తనకు పెద్ద లైఫ్ లెసన్ అయ్యాయని నందు చెప్పాడు. పని అడగడంలో తప్పు లేదని అర్థమైందని తెలిపాడు. ఎవరినీ మోసం చేయకుండా మన టాలెంట్‌ను మనమే చూపించుకోవాలని తెలుసుకున్నానని అన్నాడు. ఆ రోజు తర్వాత తనలోని