
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వేంబు టెక్నాలజీ మార్కెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చుట్టూ అలుముకున్న అంచనాలతో కొన్ని టెక్ కంపెనీల వ్యాల్యుయేషన్లు ఆకాశాన్నంటాయని, ఇది 1999 నాటి డాట్-కామ్ బబుల్‌ను మించిన సంక్షోభానికి దారితీయవచ్చని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏఐపై పెట్టుబడిదారుల ఉత్సాహం మార్కెట్‌లో ఒక భారీ బుడగను సృష్టిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన తన ఆందోళనలను పంచుకున్నారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల 'ధర-విక్రయాల నిష్పత్తి' (ప్రైస్-టు-సేల్స్ రేషియో) విపరీతంగా పెరిగిపోయిందని, కంపెనీల అసలు వ్యాపార పనితీరుకు, వాటి మార్కెట్ విలువకు మధ్య పొంతన లేకుండా పోయిందని విశ్లేషించారు. కొన్ని కంపెనీల వార్షిక ఆదాయానికి కొన్ని రెట్లు అధికంగా వాటి షేర్ల విలువ ఉండటం ప్రమాదకరమని స్పష్టం చేశారు.ఉదాహరణగా కొన్ని కంపెనీల వివరాలను ఆయన పంచుకున్నారు. ఎన్విడియా షేర్ ధర దాని అమ్మకాలకు 20 రెట్లు ఎక్కువగా ఉందని, మైక్రాన్ టెక్నాలజీ షేర్ 19 రెట్లు అధికంగా ట్రేడ్ అవుతోందని తెలిపారు. అలాగే, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్), మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నిష్పత్తి 10 నుంచి 11 రెట్లు ఉండగా, మెటా (ఫేస్‌బుక్) నిష్పత్తి 7.5 రెట్లుగా ఉందని ఆయన వివరించారు.ఈ సందర్భంగా 2000వ దశకం ప్రారంభంలో డాట్-కామ్ బబుల్ పగిలిపోయిన తర్వాత సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు స్కాట్ మెక్‌నీలీ చేసిన వ్యాఖ్యలను శ్రీధర్ వేంబు గుర్తుచేశారు. "ఒక కంపెనీ ఆదాయానికి 10 రెట్లు
