translateexpand_more

Oath Taking On June 3 New Chief Minister News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu03 Jun, 02:03 am
సిద్ధరామయ్య తనయుడికి కీలక పదవి

కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలో అధికార బదిలీ ప్రక్రియను కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది. నేడు బెంగళూరులో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 13 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. కొత్త కేబినెట్ కూర్పులో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించినట్టు కనిపిస్తోంది. ప్రాంతీయ, సామాజిక సమీకరణలను సమన్వయం చేసే టీమ్ ను రూపొందించడమే దీని ఉద్దేశం. కొత్త కేబినెట్‌ను ఖరారు చేయడానికి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశం నిర్వహించింది.డీకే శివకుమార్, సిద్ధరామయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలతో ఇద్దరు నాయకులు విస్తృతంగా చర్చించారు. కొత్త కేబినెట్ నిర్మాణం, అధికార సమతుల్యత, సంస్థాగత సమీకరణలను ఖరారు చేశారు.మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో..జీ పరమేశ్వరసిద్ధరామయ్య తనయుడు యతీంద్రకేహెచ్ మునియప్పయూటీ ఖాదర్కేజే జార్జ్కృష్ణ బైరే గౌడ,ఎంబీ పాటిల్ప్రియాంక్ ఖర్గే సతీష్ జార్కిహోళిరామలింగారెడ్డిదినేష్ గుండూ రావుబైరాతి సురేష్ఈశ్వర్ ఖండ్రే ఉన్నారు.యతీంద్ర, బైరాతి సురేష్ మినహా మిగిలిన వారందరూ కూడా ఇదివరకు సిద్ధరామయ్య మంత్రివర్గంలో కొనసాగినవాళ్లే. 

Oath Taking On June 3 New Chief Minister News Keyword | Telugu Digital