translateexpand_more

Pat Cummins News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu29 May, 09:58 am
వైభవ్ ను ఆపాలంటే ఆ రెండే దిక్కు.. లేదంటే నాలాగా పచ్చడైపోతారంతే

Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈరోజు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఈ కీలక సమరంలో అందరి కళ్ళు రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ను అడ్డుకోవడానికి గుజరాత్ బౌలర్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక విలువైన సలహాను అందించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఫామ్ చూస్తుంటే ఏ బౌలర్‌కైనా చెమటలు పట్టడం ఖాయం. బౌలర్ల నామరూపాలు లేకుండా చేస్తూ మైదానంలో అతను సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేసిన వైభవ్, ఇప్పుడు అదే ముల్లాన్‌పూర్ పిచ్‌పై గుజరాత్‌తో తలపడనున్నాడు. దీంతో గుజరాత్ బౌలింగ్ విభాగం అతడిని ఎలా అవుట్ చేయాలనే దానిపై తీవ్రంగా బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. ఏ చిన్న తప్పు చేసినా మ్యాచ్ చేజారిపోతుందనే భయం గుజరాత్ క్యాంప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: GT vs RR: 10 ఏళ్ల హిస్టరీ రిపీట్‌కు అడ్డుగా ఆ 4 ఓవర్లు.. రాజస్థాన్ ఫేట్ మారేనా? ప్రపంచ స్థాయి బౌలర్, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం వైభవ్ సూర్యవంశీ దెబ్బకు తల్లడిల్లిపోయాడు. ఎలిమినేటర్ పోరులో బంతిని ఎక్కడ వేసినా సరే, వైభవ్ దాన్ని స్టాండ్స్‌లోకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ బౌలర్ అయిన కమిన్స్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. వైభవ్ బ్యాటింగ్ ధాటికి కమిన్స్ ఎంతగా అల్లాడిపోయాడో ఈ గణాంకాలే చెబుతున్నాయి. “వైభవ్ సూర్యవంశీకి వేరే ఎక్కడ బంతి వేసినా

Andhra Jyothy28 May, 02:24 am
గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే

ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 97 పరగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 47 పరగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆర్ఆర్ క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ 15 ఏళ్ల ఓపెనర్.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ పోరులో మేము గెలవడమే ముఖ్యం. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గేల్ సెంచరీ రికార్డు గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బ్రేక్ చేస్తానా? తొందర లేకుండా సింగిల్స్ తీస్తే సరిపోయేదా? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు. ఫీల్డర్‌ను చూసి ఆ షాట్ ఆడాను. థర్డ్ మ్యాన్ వైపు కొట్టుంటే బంతి సిక్స్ వెళ్లి ఉండేది. కానీ స్ట్రెయిట్‌గా ఆడేందుకు ప్రయత్నించాను. అందుకే టైమింగ్ మిస్ అయింది. ప్రస్తుతం ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే నా ముందున్న లక్ష్యం. సెంచరీలు, రికార్డులు.. ఇవన్నీ భవిష్యత్తులో బ్రేక్ చేయొచ్చు. మైలురాయిల

Samayam Telugu28 May, 02:39 am
నా కలలో కూడా ఇలా ఆడలేను.. వైభవ్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయా .. సన్ రైజర్స్ కెప్టెన్

రచయిత గురించిమహేష్ గోనెగోనె ఉమామహేశ్వరరావు (మహేష్ గోనె) సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా సమాచారం, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లో ప్రత్యేక వార్తలను కవర్ చేయడంలో మహేష్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో వెబ్ స్టోరీల కోసం కూడా పని చేశారు. మహేష్ గోనె.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్‌జే) నుంచి జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి మీడియా సంస్థలో ఆరేళ్లపాటు పని చేశారు. సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడే కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు.... ఇంకా చదవండి

TV9 Telugu24 May, 09:41 am
SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

- SRH Pitch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర... - వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలను పక్కనబెట్టి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టుకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తామని రాయుడు హామీ ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింద... - పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ 2026లో అద్భుత విజయాలతో దూసుకుపోతోంది.

Andhra Jyothy28 May, 03:10 am
వైభవ్ కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వైభవ్ అద్భుతంగా ఆడాడు. అతడికి బౌలింగ్ చేయడానికి పెద్దగా ఆప్షన్లు కనిపించలేదు. అతడిని ఔట్ చేసేందుకు ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా.. లాభం లేకపోయింది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్.. బౌలర్ యార్కర్ వేయడంలో కాస్త పొరపాటు చేసినా వైభవ్ దాన్ని వదిలిపెట్టడు. ప్రతి బంతిని భారీ షాట్‌గా మలిచేందుకే ప్రయత్నిస్తాడు. వైభవ్ ఆటతీరుని మెచ్చుకోకుండా ఉండలేం’ అని కమిన్స్ వెల్లడించాడు. ‘టోర్నీ నుంచి నిష్క్రమించినా ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఈ సీజన్‌లో కుర్రాళ్ల ప్రతిభను వెలికితీశాం. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా రాణించారు. 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. అదే మా విజయావకాశాలను దెబ్బతీసింది. అయినప్పటికీ ఆఖరి వరకు పోరాడాం. గత మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరాం. కొద్ది తేడాతోనే టాప్ 2 ప్లేస్‌ను కోల్పోయాం. ఈ

Sakshi28 May, 02:36 am
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌థ ముగిసింది. బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎస్‌ఆర్‌హెచ్‌.. టోర్నీ నుం‍చి ఇంటిముఖం పట్టింది. తొలుత బౌలింగ్‌లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ జట్టు చతికలపడింది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి(38), సైల్‌ ఆరోరా(35), ఇషాన్‌ కిషన్‌(33) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి తృటిలో రికార్డు సెంచరీ సాధిం‍చే అవకాశాన్ని కోల్పో‍యాడు. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని కమ్మిన్స్ తెలిపాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీపై కూడా ఈ ఆసీస్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. మా ఓటమికి కారణమదే.. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో మా బౌలర్లకు పెద్దగా ఆప్షన్స్ లేకుండా చేశాడు. అతడిని ఆపేందుకు ఏమి చేయాలో కూడా నాకు ఆర్ధం కాలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ మ్యాచ్ ఫలితంలో వారికి మాకు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ ఆటకు

Asianet News Telugu27 May, 12:04 pm
ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిచేది హైదరాబాదే... టాప్ 5 రీజన్స్ ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ముగింపు దశకు చేరుకుంది... లీగ్ మ్యాచులు ముగిసి కీలకమైన ప్లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్ 1 లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఇక ఇవాళ (మే 27, బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో విజయం సాధించిన జట్టే క్వాలిఫయర్ 2 ఆడుతుంది... ఓడిన జట్టు ఐపిఎల్ నుండి నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లు ఒకెత్తు... ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్ మరో ఎత్తు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది... సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఇరుజట్ల బలాబలాలు చూసినా సన్ రైజర్స్ దే పైచేయిగా కనిపిస్తోంది. మరి ఈ కీలక పోరులో రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం సాధించడానికి ప్రధానంగా కనిపిస్తున్న 5 కారణాలు ఇవే... ఐపిఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ సాధించిన విజయాల్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా హైదరాబాద్ పులిగా పిలుచుకునే అభిషేక్ శర్మ తన ట్రేడ్‌మార్క్ హిట్టింగ్‌తో 560కి పైగా పరుగులు సాధించాడు. ఇక ట్రావిస్ హెడ్ కూడా 168 స్ట్రైక్ రేట్ తో 393 పరుగులు చేశాడు... ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఇద్దరు ఓపెనర్లు పవర్ ప్లే మొత్తం ఆడితే సెంచరీ భాగస్వామ్యం ఖాయం.. ఇది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో అభిషేక్,

Samayam Telugu27 May, 02:11 pm
ఎలిమినేటర్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్.. తుది జట్టులో కీలక మార్పు

ఎలిమినేటర్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్ రాయల్స్‌ ఈ మ్యాచులో ఓడిపోతే లీగ్ నుంచి నిష్క్రమణ రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

10TV Telugu28 May, 01:59 am
వైభ వ్ సూర్య వంశీ కానే కాదు.. అదే మా కొంప ముంచింది.. లేదంటేనా.. పాట్ క మిన్స్

Pat Cummins : ఐపీఎల్ 2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌థ ముగిసింది. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు కోల్పోవ‌డమే త‌మ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసింద‌ని స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ తెలిపాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు), ధ్రువ్ జురెల్ (50; 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీలు బాద‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 243 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ప్రఫుల్ హింజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇషాన్ మ‌లింగ‌, శివంగ్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. Nitish Kumar Reddy : నితీశ్‌కుమార్ రెడ్డి బ‌ర్త్ డే.. సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు వైర‌ల్‌ ఆ త‌రువాత 244 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో రాజ‌స్థాన్ 47 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో నితీశ్‌కుమార్ రెడ్డి (38), స‌లీల్ అరోరా (35), ఇషాన్ కిష‌న్ (33) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ మూడు వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజాలు త‌లా రెండు వికెట్లు తీశాడు. యశ్ రాజ్ పుంజా ఓ వికెట్ సాధించాడు. మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ స్పందించాడు. ఓట‌మి నిరాశ‌ను క‌లిగించింద‌న్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంద‌ని, 244 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌వ‌చ్చున‌ని, అయితే కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు కోల్పోవ‌డం త‌మ విజ‌యావ‌కాశాల‌ను

NTV Telugu27 May, 09:08 am
ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్ పై ఆసక్తికర విశ్లేషణ

SRH and RR Weakness ahead of IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు మరికొన్ని గంటల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఎవరు ప్రత్యర్థి బలహీనతలను బాగా ఉపయోగించుకుంటారన్నదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో ప్రధానంగా ఓపెనర్లపైనే ఆధారపడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు ఆర్ఆర్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. కానీ ఓపెనర్లు త్వరగా ఔటైతే మాత్రం ఆర్ఆర్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలుతోంది. మిడిల్ ఆర్డర్, ఫినిషర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. కీలక మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఫెరీరా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ బలహీనత తెలిసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సరైన వ్యూహంతో బరిలోకి దిగనుంది. పవర్‌ప్లేలోనే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వికెట్లు పడగొడితే.. మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించవచ్చని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు సార్లు రాజస్థాన్‌ను ఓడించిన హైదరాబాద్.. అదే ప్లాన్‌తో మళ్లీ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆర్ఆర్ బౌలింగ్ కూడా పూర్తిగా జోఫ్రా ఆర్చర్‌పైనే ఆధారపడుతోంది. ఆర్చర్ వికెట్లు తీస్తేనే ఆర్ఆర్‌ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అతడు విఫలమైతే మిగతా బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకర జట్టుగా నిలిచింది. అభిషేక్

10TV Telugu27 May, 08:11 am
వైభ వ్ సూర్య వంశీకి పాట్ క మిన్స్ వార్నింగ్ .. ఔట్ చేసేందుకు ఒక టి కాదు

Pat Cummins : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫ‌య‌ర్‌-2కి అర్హ‌త సాధించాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జ‌ట్టు ఇంటి ముఖం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవ‌కాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో అంద‌రి దృష్టి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ పైనే ఉంది. ఈ చిచ్చ‌ర పిడుగు మెరుపు ఆరంభాల‌ను అందిస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 ఇన్నింగ్స్‌ల్లో 41.64 స‌గ‌టుతో 232.27 స్ట్రైక్‌రేటుతో 583 ప‌రుగులు చేశాడు. Nitish Kumar Reddy : నితీశ్‌కుమార్ రెడ్డి బ‌ర్త్ డే.. సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు వైర‌ల్‌ ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో ఆర్ఆర్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో వైభ‌వ్ విఫ‌లం కాగా.. మ‌రో మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టాడు. ఈ క్ర‌మంలో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో అత‌డిని ఔట్ చేసేందుకు త‌మ మూడు ప్ర‌ణాళిక‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ తెలిపాడు. ఓ బౌల‌ర్‌గా మ‌న బ‌లాలు ఏంటో తెలుసుకుని బౌలింగ్ చేయడం ఓ ఎత్తు. కానీ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులో మ్యాచ్‌ను ఒంటి చేత్తో లాగేసుకునే ఒక‌రిద్ద‌రు ఆట‌గాళ్లు ఉన్న‌ప్పుడు వారి కోసం ప్లాన్ బి లేదా ప్లాన్ సి సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీని కోసం కొంత ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తాము. Rajat Patidar : ఆర్‌సీబీ కెప్టెన్ మామూలోడు కాద‌య్యా.. ర‌జ‌త్ పాటిదార్ నెట్‌వ‌ర్త్

NTV Telugu27 May, 07:16 am
కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్ లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే

Vaibhav Suryavanshi and Abhishek Sharma Stats in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. పవర్ హిట్టింగ్, అద్భుతమైన స్ట్రైక్‌రేట్లు, భారీ ఇన్నింగ్స్‌లతో ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఇద్దరి గణాంకాలు చూసిన తర్వాత ఈరోజు ముల్లాన్‌పుర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పరుగుల వరద ఎంతలా ఉండబోతోందో అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 563 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 135 నాటౌట్. 43.30 సగటుతో పాటు 196.85 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే.. అభిషేక్ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ బాదాడు. ఒకసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచిన అభి.. రెండు సార్లు డక్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం అభిషేక్‌ను ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుత గణాంకాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 583 పరుగులు బాదాడు. అతడి అత్యధిక స్కోర్ 103. 213.55 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సీజన్‌లో వైభవ్ మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. బుడ్డోడు ఒక్కసారి మాత్రమే డక్ అవుట్ అయ్యాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయడం వైభవ్

NTV Telugu24 May, 04:43 am
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్‌ఆర్‌హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 19వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. - కావ్య మారన్‌కు చెందిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. - మే 27న న్యూ చండీగఢ్‌లో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది.

NTV Telugu30 May, 04:50 am
ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం .. టీమ్ లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో

Kavya Maran: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అయితే, టోర్నీ నుండి వైదొలిగిన రెండు రోజుల తర్వాత.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తన జట్టు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌తో చాలా సరదాగా, ఆత్మీయంగా మాట్లాడుతుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి 2016 ఛాంపియన్స్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో గుర్తిండిపోయేలా సాగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు, కెప్టెన్ పాట్ కమిన్స్ సీజన్ మధ్యలో జట్టుతో చేరిన తర్వాత సన్‌రైజర్స్ ప్రదర్శన సరికొత్త మలుపు తిరిగింది. అంతకుముందు కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ జట్టును ఎంతో అద్భుతంగా నడిపించాడు. అతని కెప్టెన్సీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 3 ఓటములతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో ముందే నిలిచింది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై భారీ విజయం సాధించినప్పటికీ, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ రెండో స్థానంలో నిలిచి ఉంటే పాట్ కమిన్స్ సేనకు ఫైనల్‌కు వెళ్లడానికి మరో అవకాశం (క్వాలిఫైయర్-2 రూపంలో) దక్కేది, కానీ ఈ సీజన్‌లో వారికి ఆ అదృష్టం లేకపోయింది. ఇటు ఫ్యాన్స్, అటు ప్లేయర్స్ అందరూ ఎంతో బాధలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ 53 సెకన్ల నిడివి గల ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. "గర్వించదగిన సీజన్ తర్వాత, మేము చిరునవ్వులు, కృతజ్ఞతలతో ​​గర్వంగా తల ఎత్తుకుని వెళ్తున్నాం. రికార్డులు సృష్టించడం, ప్రమాదాలతో తలపడటం, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం

Sakshi27 May, 02:09 pm
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ ఆర్ హెచ్

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్‌ 2026లో ఇవాళ జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలిమినేటర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు) మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు) చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు) మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

Zee Telugu26 May, 04:00 pm
SRH vs RR IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌కు చావో రేవో పోరు.. SRH గెలవాలంటే వీళ్లు చెలరేగాల్సిందే..!

SRH vs RR IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌ పోరులో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో తలపడనుంది. ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌లో కీలక ప్లేయర్లపై ఓ లుక్కేయండి.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు హెన్రిచ్ క్లాసెన్ కీలకంగా మారాడు. టీమ్‌లో ఎవరు ఆడినా.. ఆడికపోయినా.. క్లాసెన్ మాత్రం తన విధ్వంసంతో జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు. 14 ఇన్నింగ్స్‌లలో 159.47 స్ట్రైక్ రేట్‌తో 606 పరుగులు సాధించి.. ఒక టోర్నమెంట్‌లో 4వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 600 పరుగులకు పైగా సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో క్లాసెన్ నిలబడితే.. విజయం నల్లేరుపై నడకే. క్లాసెన్‌కుతోడు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండడం హైదరాబాద్‌కు ప్లస్ పాయింట్. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఐపీఎల్ 2026లో 500 పరుగుల మార్కును దాటారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ దళంపై ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఖాయం. కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంట్రీతో జట్టుతో స్థిరత్వం వచ్చింది. అతని రాక బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. నాకౌట్ మ్యాచ్‌లో కమిన్స్‌ అనుభవం కీలకం కానుంది. ఈ సీజన్‌లో ఇషాన్ మలింగ బౌలింగ్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ శ్రీలంక పేసర్ 14 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టి.. కీలక సమయాల్లో మ్యాచ్‌లను మలుపుతిప్పాడు. కొత్త బంతితో, డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తూ చక్కగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన యువ పేసర్ షకీబ్ హుస్సేన్.. సూపర్‌గా బౌలింగ్‌ చేస్తున్నాడు. మొదటి

TV9 Telugu27 May, 09:37 am
ఒకటి కాదు, రెండు కాదు.. బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం

Pat Cummins Three Plans For Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ లో నేడు జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరుకు సర్వం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య న్యూ చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ చావో రేవో సమరంలో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము మూడు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ పై ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి మంచి ఊపులో ఉంది. అయితే, ప్లేఆఫ్స్ మ్యాచ్ అనేది పూర్తిగా భిన్నమైనదని, ఇక్కడ పాత రికార్డులకు విలువ ఉండదని ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రాజస్థాన్ జట్టులోని 15 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడని కమిన్స్ కొనియాడాడు. ఇది కూడా చదవండి: ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..? గత మ్యాచ్ లో వైభవ్ హైదరాబాద్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఒక అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకునే ఈ సారి అతని కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు కమిన్స్ తెలిపాడు. కేవలం ఒక్క వ్యూహంతోనే మైదానంలోకి దిగితే వైభవ్ లాంటి విధ్వంసకర ఆటగాడిని ఆపడం సాధ్యం కాదని, అందుకే తాము ప్లాన్-ఎ తో పాటు ప్లాన్-బి, ప్లాన్-సి లను కూడా సిద్ధం చేసుకున్నట్లు ఒక ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించాడు. లీగ్ దశలో రాజస్థాన్‌పై సాధించిన రెండు విజయాలు తమ జట్టుకు మానసికంగా ఎంతో మేలు

NTV Telugu27 May, 08:44 am
కమిన్స్ కు పెద్ద తలనొప్పిగా వైభవ్ .. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్

Pat Cummins Plans For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు నేడు న్యూ చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే ప్యాట్ కమిన్స్ సేనకు ఇప్పుడు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పెద్ద సవాల్‌గా మారాడు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు 14 మ్యాచ్‌లలో 583 పరుగులు బాదాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే ఒక సెంచరీతో పాటు ఎన్నో వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తొలి మ్యాచ్‌లో కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు.. రెండో మ్యాచ్‌లో మాత్రం బుడ్డోడిని సెంచరీ చేయకుండా ఆపలేకపోయారు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం మాత్రం ఎస్ఆర్‌హెచ్‌కే దక్కింది. ఎలిమినేటర్‌కు ముందు జియోస్టార్‌తో మాట్లాడిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ వంటి బ్యాటర్‌ను ఎదుర్కోవాలంటే ప్లాన్-B, ప్లాన్-C కూడా సిద్ధంగా ఉండాలని తెలిపాడు. ‘ఒక బౌలర్‌గా ముందుగా మన బలాలపై నమ్మకం ఉండాలి. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగల ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు ఉంటారు. అలాంటి వారికి అదనంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాల్సి వస్తుంది. వైభవ్ కోసం కూడా మేము ప్రత్యేక ప్లాన్స్ రెడీ చేశాం. గత మ్యాచ్‌లో అతడు మా మీద సెంచరీ

NTV Telugu28 May, 02:02 am
వైభవ్ మాకు చుక్కలు చూపించాడు.. అతడి వల్లే ఓడిపోయాం.. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు

Pat Cummins Praises Vaibhav Sooryavanshiఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) పోరాడి ఓడిపోయింది. రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్) నిర్ధేశించిన 244 పరుగుల ఛేదనలో 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన 38 పరుగులకే టాప్‌ స్కోరర్‌ అంటే ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు ఎంత దారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. రాజస్థాన్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్‌ ఇంటిముఖం పట్టింది. ఆర్ఆర్ విజయంలోయువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5×4, 12×6) కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. సూర్యవంశీ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ అద్భుతంగా ఆడదాని, ఇలాంటి బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. వైభవ్ తమకు చుక్కలు చూపించాడని, అతడి వల్లే తాము ఓడిపోయాం అని చెప్పాడు. చిన్న పొరపాటు చేసినా వైభవ్ సూర్యవంశీ దాన్ని భారీ షాట్‌గా మలుస్తాడని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ‘వైభవ్ నిజంగా అద్భుతంగా ఆడాడు. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఉండవు. మార్జిన్స్ చాలా చిన్నగా ఉంటాయి. యార్కర్ కాస్త మిస్ అయినా అతడు వదిలిపెట్టడు. బంతి వెంటనే బౌండరీకి వెళుతుంది. అందుకే అతడికి క్రెడిట్ ఇవ్వాలి. వైభవ్ బ్యాటింగ్ సమయంలో చుక్కలు కనిపించాయి. అతడి ఇన్నింగ్స్ తేడా తీసుకొచ్చింది. టాస్ గెలిచి ఛేజ్ ఎంచుకోవడంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పిచ్ చివరి వరకు కూడా బాగానే ఉంది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలంటే కొన్ని విషయాలు సరిగ్గా జరగాలి. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడానికి ఇదే సరైన మైదానం, సరైన పరిస్థితులు. మా జట్టు చాలా వరకు రన్‌రేట్‌కు అనుగుణంగా

NTV Telugu28 May, 07:55 am
వైభవ్ ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు

AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న ‘గేమ్ అవేర్‌నెస్’ (మ్యాచ్‌పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ లాంటి హై-ప్రెషర్ నాకౌట్ మ్యాచ్‌లో వైభవ్ చూపించిన పరిణతి, ప్రశాంతత అసాధారణమైనవని డివిలియర్స్ కొనియాడాడు. “సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎన్ని రకాల ప్లాన్లు వేసినా, పదే పదే ఫీల్డింగ్ మారుస్తూ లెంత్ బాల్స్ వేసి వైభవ్ రిథమ్‌ను దెబ్బతీయాలని చూసినా.. అతడు మాత్రం ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా తన శైలిలోనే ఆడాడు. ఆ వయసులో ఆ స్థాయి ఏకాగ్రత, పట్టుదల చూపించడం నిజంగా అద్భుతం” అని డివిలియర్స్ అన్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలింగ్ లైనప్‌ను వైభవ్ పూర్తిగా కట్టడి చేశాడు. పాట్ కమిన్స్ రక్షణాత్మక ఫీల్డింగ్ పెట్టి, యార్కర్లతో కట్టడి చేయాలని చూసినా.. ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన భయం తెలియని షాట్లతో దీటుగా బదులిచ్చాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 8 ఓవర్లలోనే 125 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది. చివరకు రాజస్థాన్ 47 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించి క్వాలిఫైయర్-2 కు దూసుకెళ్లింది. ఇక, వైభవ్ బ్యాటింగ్ శైలితో పాటు మ్యాచ్‌కు ముందు అతడు అనుసరించే విధానాలు, మానసిక సన్నద్ధత (మెంటల్ రూటీన్స్) పై కూడా ఏబీడీ ముగ్ధుడయ్యాడు. బౌలర్లను ముందే స్టడీ చేయడం,

TV9 Telugu24 May, 12:57 pm
Video: పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులు పూయించిన ఛోటా ప్యాకెట్..

- హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో మే 22న జరిగిన లీగ్ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు చెలరేగిపోయారు. - మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచింది. - అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లతో పాటు ఇషాన్ కిషన్ కేవలం 46 బంతుల్లోనే 79 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.