translateexpand_more

Pawan Kalyan Prees Meet News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 12:07 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా...ప్రెస్ మీట్ లో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Andhra Pradesh Deputy cm Pawan kalyan press meet in Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంశం రాజకీయాల్లో దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు అడుగడుగున అడ్డుకున్న వారిపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రము కావాలని రాకముందే కల్చరల్ పరంగా సినిమా పరంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గతంలో తిరిగిన వాడినని చెప్పుకొచ్చారు. తెలంగాణ అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు. తెలంగాణ పైన నాకు ఉన్న ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మేము వ్యతిరేకం కాదని విభజన చేసిన విధానం కరెక్ట్ కాదని మాత్రమే చెబుతున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తన వారాహికి అనుమతి లేదంటే, కోదాడ వరకు నాకు అండగా తెలంగాణ వారు నిలిచారన్నారు. 2029 లో తప్పకుండా జనసేన పోటీ చేస్తుందన్నారు. బెదిరింపులకు లొంగేవాడిని కాదన్నారు. నా గుండెల్లో తెలంగాణ అంటే ఎంతో గౌరవముంటున్నారు. ఇంకెంత కాలం ఆంధ్రోడు అని తిడుతారన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న చాలా మంది గతంలో తాను తిరిగిన ఆదిలాబాద్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో కనీసం వెళ్లలేదన్నారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. గతంలో తనను వైసీపీ నాయకులు బెదిరింపులకు గురిచేశారన్నారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై కూడా వెంటనే విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే తన ఆస్తుల్ని సీజ్ చేయాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకొవాలన్నారు. ఏనాడు కూడా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పైన విద్వేషాం చూపించలేదన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని కొంత మంది అంటున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. మీ అయ్యా జాగిరా తెలంగాణ అంటూ.. సభను అడ్డుకున్న వారిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాంతో ఊగిపోయారు. నన్ను బెదిరింపులకు గురిచేసిన వారి విషయంలో రాహుల్ గాంధీ స్పందించాలన్నారు. ఇక్కడ ఎన్నికల్లో కూడా పోటీచేస్తానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమన్నారు. ఎంత కాలం ప్రాంతీయ వివాదాలు రెకెత్తిస్తారని మండిపడ్డారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావొద్దని సీఎం రేవంత్ తీర్మానం చేయాలన్నారు. ఇక్కడ ఎన్నికల్లో పొటీ చేస్తా..నేనే తిరుగుతానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్బాగమన్నారు. ఎవరు రావొద్దనడానికి ఇదేమన్న పాలస్తీనానా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పడంతో కాంగ్రెస్ దిమ్మలు కూల్చేస్తే జనసేన అండగా నిలిచిందన్నారు. ప్రతి సమస్యలపై పొరాడుతానన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే ఈ రోజు పదవుల్లో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. దేశంలో తెలంగాణ అంతర్బాగమన్నారు. దేశ సమగ్రతకు భంగం కల్గిస్తే చూస్తు ఊరుకోబోమన్నారు. ఆంధ్రాను, ఆంధ్రావారిని ద్వేశించి ఏంచేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. మళ్లీ గడీల పాలన తీసుకొస్తారా అంటూ మండిపడ్డారు. ప్రతి ఇంట్లోకి దూరుతానని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలపై చర్చిద్దామన్నారు. వైఎస్సార్ తనను రెచ్చగొడితే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నేను చచ్చిపొవడానికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్ ఉన్నప్పుడు లేవని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయని పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ లో బాంబులు పెట్టిన వారికి అనుకూలంగా కాంగ్రెస్ మాట్లాడిందన్నారు. తెలంగాణలో వలస తగ్గాలంటే ఏపీలో ఉద్యోగాలు పెరగాలన్నారు. బెంగాల్ కు వస్తే అమిత్ షాను తరిమేస్తారని గతంలో అన్నారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు పెట్టేవారిపై కేంద్రం దృష్టి సారించాలన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Pawan Kalyan Prees Meet News Keyword | Telugu Digital