
Peddi Collections : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ సినిమా పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్, ఆంధ్ర లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పెద్ది సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందని బాక్సాఫీస్ అంచనా వేస్తున్నారు బిజినెస్ వర్గాలు. ఇలాంటి భారీ సినిమాలకు, స్టార్ హీరో సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు సాధారణమే. అవి సినిమా కలెక్షన్స్ కి ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. పెద్ది సినిమాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇచ్చారు. ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలకు కూడా ప్రమిషన్ ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. Also Read : Peddi Event : హైదరాబాద్ లో ‘పెద్ది’ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? మూవీ యూనిట్ ప్రభుత్వం దగ్గరకు వెళ్లినా, హైకోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. టికెట్ రేట్లపై ఎవరూ స్పందించట్లేదు. ప్రీమియర్ షోలకు కూడా ప్రమిషన్ ఇస్తారో లేదో అనుమానమే. కనీసం ఎర్లీ మార్నింగ్ షోలకు అయినా పర్మిషన్స్ ఇస్తారో లేదో తెలీదు. దీంతో పెద్ది సినిమా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడనుంది. గతంలో రాజాసాబ్ సమయంలో కూడా ఇలాగే అవ్వడం, చివరి నిమిషం వరకు పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలతో కలిపి కనీసం తెలంగాణలో ఎక్స్ ట్రా 20 కోట్ల వరకు వస్తాయి. ఇప్పుడు ఈ 20 కోట్లు నష్టమే. టికెట్ రేట్లు పెంచితే అందులో కొంత శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం నిబంధన పెట్టింది. అందుకు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. అయినా ఇప్పుడు పర్మిషన్స్ రాకపోవడం గమనార్హం. Also Read : Ram Charan : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. ఫొటోలు.. ఈ విషయంలో తెలంగాణ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముందు రోజే సినిమా చూడలేకపోతున్నామని, పెద్ది సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందని, వేరే చోట ప్రీమియర్స్ పడి ఇక్కడ పడకపోతే సోషల్ మీడియాలో లీక్స్ వచ్చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం తెలంగాణలో జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పెద్ది షోలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది.