translateexpand_more

Press Meet News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 07:00 am
జనసేన కోసం రామ్ చరణ్ త్యాగం.. బాబాయ్ కోసమే అబ్బాయి తప్పుకున్నాడా

Ram Charan : పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుండగా నిన్న జూన్ 1న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నేడు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హోటల్ లో మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రెస్ మీట్ నిర్వహిద్దామని ప్లాన్ చేసారు. మూవీ యూనిట్ అంతా దీనికి హాజరు కావాల్సి ఉంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసారు. పెద్ది ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవడానికి కారణం జనసేన సభ అని అనుకుంటున్నారు అభిమానులు. బాబాయ్ కోసం చరణ్ త్యాగం చేసాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన తరపున నేడు జూన్ 2న గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభను ప్లాన్ చేసారు. అయితే ఈ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పలువురు తెలంగాణ రాజకీయ నాయకులు కూడా పవన్ ని తిడుతూ ఈ సభ పెట్టొద్దు అంటూ కామెంట్స్ చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ సభ చర్చగా మారింది. Also Read : Dhanush : విజయ్ సీఎం అయిన వేళ.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై తండ్రి వ్యాఖ్యలు వైరల్.. సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే ప్రెస్‌మీట్ నిర్వహిస్తానని ప్రకటించాడు. దీంతో ఇది మరింత పొలిటికల్ హీట్ ని పెంచింది. ఇలాంటి నేపథ్యంలో పెద్ది ప్రెస్ మీట్ కూడా అదే టైంకి పెడితే మీడియా కవరేజ్ లో జనసేనకు, పెద్ది సినిమాకు కూడా నష్టం కలుగుతుందని భావించి పెద్ది సినిమా ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి పవన్ జనసేన మీటింగ్ ఇంపార్టెంట్ అని పెద్ది సినిమా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. నేడు పవన్ కళ్యాణ్ జనసేన ప్రెస్ మీట్ తర్వాత రేపు ఉదయం పెద్ది ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. రేపు రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి కాబట్టి ప్రెస్ మీట్ మొత్తానికే క్యాన్సిల్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఇప్పటిదాకా మూవీ టీమ్ అంతా కలిసి మీడియాతో మాట్లాడలేదు కాబట్టి రేపు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది అని మీడియా సమాచారం.