translateexpand_more

Ram Charan Temple News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu03 Jun, 06:59 am
ఇదెక్కడి క్రేజ్ రా మామా.. అర్జున్ థియేటర్ లో రామ్ చరణ్ గుడి.. పూజలు చేస్తున్న మెగా ఫ్యాన్స్

Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది(Peddi)’ విడుదల కాకముందే సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హంగామాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద మెగా అభిమానులు చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. Jason Sanjay: జాసన్ సంజయ్ కూడా అచ్చు విజయ్ లాగే.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ సమయంలో కటౌట్లు పెట్టడం చూస్తాం, కానీ కూకట్‌పల్లి ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకు వేసి ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్‌ను ప్రతిబింబించేలా థియేటర్ ఆవరణలోనే ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనికి ‘శ్రీ రామ్‌చరణ్ ఆలయం’ అంటూ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. చరణ్ రస్టిక్ లుక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా ఒక పెద్ద జాతరను తలపించింది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తూ, కర్పూర హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ అపూర్వ వేడుకల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం #PeddiTakeOver హ్యాష్‌ట్యాగ్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి అంతర్జాతీయ విజయం తర్వాత చరణ్ నటిస్తున్న పక్కా రా అండ్ రస్టిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో మాస్ ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఊపు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Ram Charan Temple News Keyword | Telugu Digital