translateexpand_more

Ram Charan Wife Upasana News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu03 Jun, 11:23 am
త్రిషకు మెగా కోడలు సర్ ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్

Trisha: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తెలుగువారి ఇళ్లలో ఆవకాయ పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైపోతాయి. ఇప్పుడు అదే ఘుమఘుమలు కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష ఇంటికి చేరాయి. మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి త్రిషకు ఒక అదిరిపోయే సమ్మర్ సర్‌ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంతో నటిస్తున్న త్రిష కృష్ణన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఒక అదిరిపోయే సమ్మర్ సర్‌ప్రైజ్ అందింది. మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. త్రిషకు నోరూరించే ప్రత్యేకమైన గిఫ్ట్ పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉపాసన కొణిదెల నేతృత్వంలో నడుస్తున్న ప్రముఖ హోమ్ ఫుడ్ బ్రాండ్ ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి హీరోయిన్ త్రిషకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. సాంప్రదాయ తెలుగు వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ బ్రాండ్ నుంచి పంపిన గిఫ్ట్ బాక్స్‌లో.. వేసవి కాలం స్పెషల్ అయిన నోరూరించే ఘుమఘుమలాడే కొత్త ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పచ్చళ్లు, రుచికరమైన పొడులు ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ టేస్టీ సర్‌ప్రైజ్ చూసి త్రిష ఫిదా అయిపోయింది. ఆ గిఫ్ట్ బాస్కెట్‌ను ఫోటో తీసి తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉపాసనకు ట్యాగ్ చేస్తూ.. “ఈ అద్భుతమైన గిఫ్ట్ చూస్తుంటే నాకు నిజంగానే వేసవి కాలం (సమ్మర్) వచ్చేసినట్లు అనిపిస్తోంది. థ్యాంక్యూ సో మచ్ ఉపాసన” అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్‌ను ఉపాసన కూడా తన సోషల్ మీడియా ఖాతాలో రీ-షేర్ చేయడంతో, మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్‌లను తెగ వైరల్ చేస్తున్నారు.

Ram Charan Wife Upasana News Keyword | Telugu Digital